కొత్తగా వస్తున్న స్మార్ట్‌ఫోన్లలో వీలైనన్ని భిన్నమైన ఫీచర్లు ఉంటే మాత్రమే కస్టమర్లను ఆకట్టుకోగలమని కంపెనీలన్నిటీక అర్ధమైపోయింది. అందుకే కొత్త కొత్త ఫీచర్లతో అప్‌డేట్స్‌తో ఫోన్లను వదలుతున్నాయి. ఇలా ప్రతి అప్‌డేట్‌లోనూ కొత్త ఫీచర్లతో వచ్చే ఫోన్లలో షియోమి రెడ్‌మి ఫోన్లు ముందుంటాయి. తాజాగా అలా మార్కెట్లోకి వచ్చిందే నోట్ 8 ప్రొ మోడల్. ఈ మోడల్‌లో గూగుల్ కెమెరా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. మరి అదెలా చేయాలో చూద్దామా...
ఇలా చేయండి
గూగుల్ కెమెరా యాప్‌కు సంబంధించిన ఏపీకే ఫైల్ లింక్‌ను డౌన్‌లోడ్ చేసుకుని మీ ఫోన్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మీ రెడ్ మి నోట్ 8 ప్రొ ఫోన్లో ఈ ఏపీకే ఫైల్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అయితే ఇది సమర్థవంతంగా పని చేయాలంటే ఇంకో కొన్ని సెట్ల కన్ఫిగరేషన్ ఫైల్స్‌ని కూడా డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు ఫైల్స్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీరు గూగుల్ కెమెరాను సెట్ చేసుకోవడం చాలా సులభం అవుతుంది.
1. గూగుల్ కెమెరా ఏపీకే ఫైల్‌ని డౌన్‌లోడ్ చేయాలి.
2. ఇలా చేసేముందు కొన్ని అన్ నౌన్ సోర్సులకు పర్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుంది.
3. ఆ తర్వాత మీ ఫోన్‌లోకి వెళ్లి గూగుల్ కెమెరా యాప్‌ను మళ్లీ ఫ్రెష్‌గా ఇన్‌స్టాల్ చేయాలి
4. యాప్ ఇనిస్టాల్ చేశాక అప్పర్ రైట్ హ్యాండ్ సైడ్‌లో మీకు మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది
5. మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సెట్టింగ్స్‌లోకి వెళుతుంది. ఆపై సేవ్ సెట్టింగ్స్‌మీద క్లిక్ చేయాలి.
6. ఆ తర్వాత ర్యాండమ్‌గా ఒక పేరు పెట్టుకోవాలి. మీ ఫైల్ మేనేజర్‌లో జీక్యామ్ పేరుతో సేవ్ చేసుకోవాలి.
7. ఆ తర్వాత ఫైల్ మేనేజర్ ఫోల్డర్‌లోనే కాన్ఫిగ్ మీద క్లిక్ చేసి మీరు డౌన్‌లోడ్ చేసుకున్న సెకండ్ కన్ఫిగరేషన్ ఫైల్‌ని పేస్ట్ చేయాలి.
8. చివరిగా గూగుల్ యాప్‌ని ఓపెన్ చేసి బ్లాక్ పోర్షన్ మీద క్లిక్ చేయాలి. అక్కడే ఉన్న కొత్త కన్ఫిగరేషన్ ఫైల్‌ని సెలక్ట్ చేసుకుని రీస్టోర్ ఆప్షన్ ట్యాప్ చేయాలి. అంతే మీరు ఈ యాప్‌ని యూజ్ చేసి నేరుగా ఫొటోలు తీసుకోవచ్చు.
Install Google Camera Xiaomi Redmi Note 8 Pro