59 నిమిషాల్లో కోటీ రూపాయలు లోన్ ఇచ్చే వెబ్‌సైట్, స్టెప్ బై స్టెప్ మీకోసం 

3 నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన వెబ్‌సైట్ PSBloansin59minutes.comలో మీరు కేవలం 59 నిమిషాల్లోనే కోటి రూపాయల వరకు లోన్ పొందవచ్చు.మూడు నెలల్లోనే అత్యధిక రుణాలు ఇచ్చిన ఆన్‌లైన్ లెండింగ్ ప్లాట్‌ఫామ్‌గా ఈ వెబ్‌సైట్ రికార్డులు సృష్టిస్తోంది . ఇప్పటి వరకు రూ.35,000 కోట్ల రుణాలను మంజూరు చేసి కొత్త రికార్డును నెలకొల్పింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ సెక్రెటరీ రాజీవ్ కుమార్ రూపొందించిన ఈ వెబ్‌సైట్‌ను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు(MSMEs) కేవలం 59 నిమిషాల్లో అంటే గంట లోపే రుణాలు మంజూరు చేయడం ఈ వెబ్‌సైట్ ప్రత్యేకత. ఇలా ఇప్పటి వరకు మూడు నెలల్లో రూ.35,000 కోట్ల రుణాలు మంజూరు చేసింది ఈ ప్లాట్‌ఫామ్. మరి లోన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఓ సారి చూద్దాం. 

లోన్ వివరాలు 
10 లక్షల నుంచి కోటిరూపాయల వరకు లోన్ అర్హతను బట్టి ఇస్తారు. వడ్డీ రేటు 8 శాతంగా ఉంటుంది.లోన్ ప్రాసెస్ పూర్తి అయిన వారం రోజుల్లో మీ అకౌంటుకుకి అమౌంట్ బదిలీ అవుతుంది.

డాక్యుమెంట్లు
బ్యాంకు అకౌంట్ వివరాలు సమర్పించాలి. 6 నెలల బ్యాంకు స్టేట్ మెంట్ పీడీఎఫ్ రూపంలో ఇవ్వాలి.
ఈకెవైసి డిజిటల్ పేపర్ సబ్ మిట్ చేయాలి
గత మూడు సంవత్సరాల ఆదాయప పన్ను వివరాలను XML formatలో సమర్పించాలి.  Income tax codes, e-filing వివరాలు కూడా ఇవ్వాలి.
GST ID username and password వంటి వివరాలను కూడా సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది. 

రిజిస్ట్రేషన్ అండ్ అప్రూవల్ ప్రాసెస్
ముందుగా కంపెనీ అఫిషియల్ వెబ్ సైట్  PSBloansin59minutes.comలోకి వెళ్లండి. అందులో సిగ్నప్ లేక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయండి. మీ పేరు, ఈమెయిల్, ఫోన్ నంబర్ ఇస్తే ఒటీపీ వస్తుంది. 
ఓటీపి వచ్చిన తరువాత దాన్ని ఎంటర్ చేసి ఐ అగ్రి బటన్ నొక్కగానే మీకు ప్రొసీడ్ అనే ఆప్సన్ కనిపిస్తుంది. అక్కడ కనిపించే ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
తరువాత జీఎస్టీ వివరాలను అడుగుతుంది. అవి ఎంటర్ చేయాలి. దాని తర్వాత బ్యాంకు వివరాలను ఎంటర్ చేయాలి. 
అది అయిపోగానే మీకు లోన్ ఎందుకు అవసరమో దానికి సంబంధించిన వివరాలను ఎంటర్ చేయండి.
ఈ ప్రాసెస్ పూర్తి అయిన తరువాత మీకు అక్కడ కనిపించే బ్యాంకుల్లో అకౌంట్ ఉన్న బ్యాంకును సెలక్ట్ చేసుకోండి
ఈ ప్రాసెస్ పూర్తి అయిన తరువాత మీరు Convenience fee కింద రూ.1000 చెల్లించాలి.
ఇది పే చేసిన తరువాత మీ ప్రాసెస్ పూర్తి అయిపోతంది. మీరు అప్రూవ్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వారం రోజుల్లో మీ అకౌంట్లో లోన్ అమౌంట్ జమ అవుతుంది.

న్యూస్ టెక్నాలజీ లోన్స్ మొబైల్స్ ఆన్‌లైన్Â