ఎయిర్‌టెల్, అపోలో హాస్పిటల్స్ కరోనా ట్రాకర్‌తో కరోనా ఉందో లేదో తెలుసుకోవడం ఎలా?

కరోనా వ్యాప్తిని అరికట్టడంలో నేను సైతం అంటూ ముందుకొచ్చింది టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్. దేశంలోనే ప్రముఖ హాస్పిటల్ చైన్ ఐన అపోలోతో కలిసి కరోనా ట్రాకింగ్ టూల్ ను తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్ కి ప్రధాన పోటీదారు అయిన జియో ఇప్పటికే తన మై జియో యాప్లో ఇలాంటి కరోనా వైరస్ ట్రాకర్ ను ప్రవేశపెట్టింది. దీనితో ఎయిర్‌టెల్ కూడా ముందుకొచ్చి అపోలోతో కలిసి అపోలో 24*7 అనే ట్రాకింగ్ టూల్ ను తీసుకొచ్చింది.                                       

ఎలా పనిచేస్తుందంటే 
అపోలో 24*7 మై ఎయిర్‌టెల్  మొబైల్ యాప్ లోను, వెబ్సైట్ లో కూడా అందుబాటులో ఉంది. 

* ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత ప్రభుత్వ కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఈ కాటన్ ట్రాకర్ టూల్‌ను  రూపొందించారు. 

* ఇది ఒక చాట్ బోట్ ఆధారంగా పని చేస్తుంది. 

ఎలా వాడుకోవాలి?
* మై ఎయిర్‌టెల్ లేదా ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో పాప్ అప్ మెసేజ్‌గా అపోల్ 24*7  సెక్ష‌న్ క‌నిపిస్తుంది. దానిలో టెస్ట్ నౌ అనే ఆప్ష‌న్‌ను క్లిక్ చేయాలి.

* ఎసెస్ నౌ అనే ఆప్ష‌న్‌ను నొక్కితే హిందీ, తెలుగు, ఇంగ్లీష్ త‌దిర‌త భాష‌లు క‌నిపిస్తాయి. కావాల్సిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. లొకేష‌|న్‌ను యాక్సెస్ చేయాలి. 

* త‌ర్వాత పేజీలో మీ వయసు, జెండర్, జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణులున్నాయా? ఇటీవల ఏవైనా విదేశీ ప్రయాణాలు చేశారా? వంటి వివరాలన్నీ అడుగుతుంది.

* గ‌త 14 రోజుల్లో మీరు విదేశాల నుంచి వ‌చ్చిన‌వారినిగానీ, క‌రోనా పాజిటివ్ వచ్చిన పేషంట్ల‌ను గానీ క‌లిశారా అని అడుగుతుంది. 

* మీరు మీ ఇన్‌ప‌ర్మేష‌న్ ఎంట‌ర్ చేస్తే మీకున్న‌లక్ష‌ణాల‌ను బ‌ట్టి లో రిస్క్‌, మీడియం రిస్క్, హై రిస్క్‌ల్లో ఏ కేట‌గిరీలో ఉన్నారో చెబుతుంది.

*  హై రిస్క్ జోన్‌లో ఉంటే ఏం చేయాలో చెబుతుంది. 

Airtel carona tracker carona virus Apollo 24*7 carona tracker ఎయిర్‌టెల్ క‌రోనా ట్రాక‌ర్‌ క‌రోనా వైర‌స్‌ కొవిడ్‌-19 ఎయిర్‌టెల్ అపోలో క‌రోనా ట్రాక‌ర్‌ అపోలో 24*7 క‌రోనా ట్రాక‌ర్‌