10 నిమిషాల్లో .. పాన్ కార్డు పొంద‌టం ఎలా?

దేశంలో పౌరులంద‌రి ఆదాయ వ్య‌యాలు తెలుసుకోవ‌డానికి పాన్ కార్డు తప్ప‌నిస‌రి అంటున్న ఆదాయ‌ప‌న్ను విభాగం, దాన్ని పొందేందుకు సులువైన మార్గాలను ప్ర‌జల‌కు అందుబాటులోకి తెస్తోంది. లేటెస్ట్‌గా ఈ ఆధార్‌ను కేవ‌లం 10 నిమిషాల్లోనే పొంద‌వ‌చ్చంటూ కొత్త ప‌ద్ధ‌తి తీసుకొచ్చింది.  దీంట్లో ఇంకో సూప‌ర్ సీక్రెట్ ఏమిటంటే ఇది ఉచిత స‌ర్వీస్ కావ‌డం.  కాక‌పోతే దీనికి మీకు కావాల్సింద‌ల్లా జ‌స్ట్ మీ ఆధార్ కార్డు మాత్ర‌మే. 

ఆధార్ కార్డును ఉపయోగించి పాన్ కార్డు పొందడం ఎలా? 
ఈ సులువైన ప‌ద్ధ‌తిని ఉప‌యోగిస్తే మీరు ఆధార్ కార్డు ద్వారా పాన్‌కార్డ్‌ను ఆన్‌లైన్‌లో ఈజీగా పొంద‌వ‌చ్చు. 

1. ఆదాయ‌ప‌న్ను విభాగం వారి అఫీషియ‌ల్ వెబ్‌సైట్ https://www.incometaxindiaefiling.gov.in/ను  బ్రౌజ‌ర్‌లో ఓపెన్ చేయండి. 

2. ఎడ‌మ‌వైపు క్విక్ లింక్స్ క‌నిపిస్తాయి. దానిలో ఫ‌స్ట్ ఆప్ష‌న్‌గా Instant PAN through Aadhaar  క‌నిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి.

3. ఇప్పుడు మీ ఆధార్ నెంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయండి.  కెప‌చా ఎంటర్ చేసి, కింద ఐ క‌న్ఫ‌ర్మ్ ద‌ట్ అనే బాక్స్‌ను క్లిక్ చేయండి.

4.  మీ ఆధార్ నెంబ‌ర్‌తో లింక‌యి ఉన్న మొబైల్ నెంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది. దాన్ని ఎంట‌ర్ చేసి మీ ఆధార్ కార్డ్‌ను వాలిడేట్ చేయండి. 

5.  మీ ఈమెయిల్ ఐడీని కూడా వాలిడేట్ చేయండి. అయితే ఇది ఆప్ష‌న్ మాత్ర‌మే. అక్క‌ర్లేద‌నుకుంటే స్కిప్ చేయొచ్చు. 

6. మీ వాలిడేష‌న్ పూర్త‌యిన వెంట‌నే ఇన్‌క‌మ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ స‌ర్వ‌ర్, ఆధార్ ఇచ్చే సంస్థ యూఐడీఏఐకు మీ పాన్ కార్డ్ రిక్వెస్ట్‌ను పంపిస్తుంది. ఈ ప్రాసెస్ 10 నిముషాలు ప‌డుతుంది. 

7. త‌ర్వాత 10, 12 నిముషాల్లో మీరు Check Status/Download PAN అనే ఆప్ష‌న్ క్లిక్ చేయండి. 

8. మీ ఈపాన్ కార్డ్ రెడీ అయిపోయింది. పీడీఎఫ్ వెర్ష‌న్ క్లిక్ చేసి దాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఇది మీరు ఫ్రీగా తీసుకోవ‌చ్చు.

9. మీకు లామినేట్ చేసి పాన్ కార్డ్ కావాలంటే 50 రూపాయ‌లు ఖ‌ర్చ‌వుతుంది.  
 

PAN Card In 10 Minutes Free PAN Card e-PAN Card  నిమిషాల్లో పాన్ కార్డ్‌ పాన్ కార్డ్ ఫ్రీ పాన్ కార్డ్ అప్ల‌యి à°ˆ-పాన్‌కార్డ్‌ Â