ఇప్పుడు భూమిమీద బతికున్న వాళ్లెవరూ దాదాపు చూడని విపత్తు ఈ కరోనా వైరస్. దేశాలకు దేశాలే దీని ధాటికి అల్లాడిపోతున్నాయి. దీన్ని ఎలాకట్టడి చేయాలో తెలియక పెద్దన్న అమెరికా కూడా కిందా మీదా అవుతోంది. ఇక ఇండియాలో అయితే ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం లాక్డౌన్ను విధించింది. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటుంది. కానీ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న ప్రతిమార్గాన్నీ వైరస్ వ్యాప్తిని ఆపడానికి ఉపయోగించుకుంటోంది ప్రభుత్వం. కరోనా రోగి మన దగ్గరలో ఉంటే అప్రమత్తం చేసే అద్భుతమైన ఫీచర్తో ఆరోగ్యసేతు అనే యాప్ను తీసుకొచ్చంది .
వెంటనే గుర్తిస్తుంది
మనం కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఆరోగ్యసేతు యాప్ సహకరిస్తుంది. కరోనా పాజిటివ్ రోగులు మనకు దగ్గరలో ఉంటే ఇది మనల్ని అలర్ట్ చేస్తుంది. కరోనా వైరస్ వచ్చాక దాన్ని ట్రాక్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఎన్నో రకాల యాప్స్ వచ్చాయి. కానీ పాజిటివ్ వ్యక్తి మీ దగ్గరకు వస్తుంటే మిమ్మల్నిఅలర్ట్ చేసే యూనిక్ ఫీచర్ ఆరోగ్యసేత యాప్లో మాత్రమే ఉంది.
ఎలా వాడుకోవాలో చూద్దాం
* ఆరోగ్యసేతు యాప్ గూగుల్ ప్లే స్టోర్ , యాప్ స్టోర్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
* మీ పేరు, మొబైల్ నంబర్తో రిజిస్టర్ చేసుకోవాలి. మన హెల్త్ కండిషన్ గురించి కూడా ప్రశ్నలు అడుగుతుంది. వాటన్నింటికీ జవాబులు ఇస్తే నమోదు చేస్తుంది
* ట్రాకింగ్ను ప్రారంభించడం కోసం ఫోన్లో జీపీఎస్, బ్లూటూత్ను ఆన్లో ఉంచాలి. ఎలో ఆల్వేస్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి.
* ఇక ఇప్పుడు కరోనా పాజిటివ్ వ్యక్తి ఎవరైనా మన దగ్గరికి వచ్చినా, మనం వాళ్ల దగ్గరికి వెళ్లినా ఈ యాప్ మీ లొకేషన్ స్కాన్ చేసి.. డేటాను ప్రభుత్వానికి చేరవేస్తుంది. మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది.
యూజర్ ఫ్రెండ్లీ యాప్
* ఈ యాప్ను యూజర్ ఫ్రెండ్లీగా తయారు చేశారు. ఇంగ్లీష్, హిందీ భాషలతో కలిపి 11 భాషల్లో అందుబాటులో ఉంది.
* దీనిలో కరోనా నివారణ చర్యలు, అప్డేట్స్ వస్తాయి
* మీకు ఏవైనా సందేహాలుంటే తీర్చడానికి చాట్బోట్ కూడా ఉంది.
* మీకు అనుమానం ఉంటే కరోనా టెస్ట్ చేయించుకోవడానికి టోల్ ఫ్రీ నంబర్ 1075కి కాల్ చేస్తే మీకు దగ్గరలో ఉంటే టెస్టింగ్ సెంటర్లో అపాయింట్మెంట్ లభిస్తుంది.
* అత్యాధునిక టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ఈ యాప్ పనిచేస్తుంది.
క‌రోనా అల‌రà±à°Ÿà±â€Œ ఆరోగà±à°¯â€Œà°¸à±‡à°¤à± యాపà±â€Œ Arogyasethu app Carona positive Arogya sethu app alert