స్కైప్ వీడియో కాల్స్‌కు మీకు న‌చ్చిన బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకోవడం ఎలా?

లాక్‌డౌన్ పుణ్యమాని వీడియో  కాన్ఫరెన్సింగ్ ఫ్లాట్‌ఫామ్స్‌కు ఎక్కడ లేని క్రేజ్ వచ్చి పడింది. జూమ్ హౌస్ పార్టీ, స్కైప్ ఇలా అన్నీ ఎక్కడెక్కడో ఉన్న వారందరినీ కలుపుతూ జనం మనసులో స్థానం  సంపాదించుకోవడానికి వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ప్రజల అవ‌స‌రాన్ని దృష్టిలో పెట్టుకునికంపెనీలు కూడా వీటిలో కొత్త కొత్త ఫీచర్లు,‌ అదనపు హంగులు తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీకి చెందిన స్కైప్ ఇప్పుడు వీడియో చాట్‌కు మీకు నచ్చిన వర్చువల్ బ్యాక్ గ్రౌండ్ పెట్టుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన వీడియో కాన్ఫరెన్సింగ్ సొల్యూషన్ అయిన జూమ్‌లోమీకు నచ్చిన ఇమేజ్‌ను కస్టమ్ బ్యాక్‌గ్రౌండ్‌గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్కైప్ కూడా ఇదే ఫీచర్‌ను తీసుకువచ్చింది.

 మీకు న‌చ్చిన బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకోవడం ఎలా?
మీ స్కైప్‌ను అప్డేట్ చేసుకోండి. ఇందుకోసం ముందుగా మీ విండోస్ డెస్క్ టాప్ లేదా లాప్టాప్ లేదా మాక్ లో స్కైప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్ లోడ్ చేసుకోండి.
అఫీషియ‌ల్ వెబ్‌సైట్ నుంచి మాత్రమే దీన్ని డౌన్‌లోడ్ చేసుకోండి.
 స్కైప్ యాప్‌ను మీ పీసీ లేదా మాక్‌లో లాంచ్ చేయండి.
అప్లికేషన్ ఓపెన్ చేయండి.
సైన్ ఇన్ అయి ప్రొఫైల్ పిక్చర్‌ను క్లిక్ చేయండి.
సెట్టింగ్స్ బటన్ క్లిక్ చేసి తర్వాత ఆడియో అండ్ వీడియో బటన్ క్లిక్ చేయండి.
యాడ్ ఇమేజ్ క్లిక్ చేసి మీ పీసీ లేదా మాక్‌లో నుంచి కొత్త ఇమేజ్ ను add చేయండి.
అంతే మీకు న‌చ్చిన ఇమేజ్ మీ స్కైప్ కాల్స్‌కు బ్యాక్‌గ్రౌండ్‌గా వ‌చ్చేస్తుంది.

స్కైప్ వీడియో కాల్స్‌కి కస్టమైజ్డ్‌ బ్యాక్ గ్రౌండ్ యాడ్ చేయడం ఎలా?
స్కైప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.
మీ ప్రొఫైల్ పిక్చ‌ర్‌ను క్లిక్ చేయండి.
ఆడియో అండ్ వీడియో టాబ్‌ను సెలెక్ట్ చేయండి. బ్ల‌ర్ ఆప్ష‌న్ క్లిక్ చేస్తే మీ బ్యాక్‌గ్రౌండ్ బ్ల‌ర్ అవుతుంది.
ఆ ప్లేస్‌లో ఏదైనా ఇమేజ్ యాడ్ చేయాలంటే Add Image క్లిక్ చేసి మీ పీసీ లేదా మ్యాక్ నుంచి న‌చ్చిన ఇమేజ్‌ను సెలెక‌ట్ చేయండి.  అంతే మీకు న‌చ్చిన ఇమేజ్ మీ వీడియోకాల్స్‌కు బ్యాక్‌గ్రౌండ్‌గా సెట్ అయిపోతుంది.  

విండోస్ 10కి లేదు
విండోస్ 10లో మాత్రం ప్రస్తుతానికి ఈ ఫీచర్ అందుబాటులో లేదు. త్వ‌ర‌లో అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.

 

స్కైప్ వీడియో కాల్స్‌కు న‌చ్చిన బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకోవడం స్కైప్ వీడియో కాల్స్ బ్యాక్‌గ్రౌండ్ క‌స్ట‌మైజేష‌న్‌ Customization of Skype back ground Skype video calls background customization