ఆధార్ నెంబ‌ర్‌తో నిమిషాల్లో ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవ‌డం ఎలా?

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ కావాలా? జస్ట్ మీ ఆధార్ నంబర్ ఉంటే చాలు వెంటనే దీన్ని ప్రారంభించుకోవచ్చు.  ఆధార్‌తో ఆధారిత డిజిటల్‌ పొదుపు ఖాతాను సత్వరమే ప్రారంభించే సదుపాయం గతంలో ఉండేది. మధ్యలో కొన్నాళ్లు ఆపేసిన ఎస్‌బీఐ తాజాగా దాన్ని మళ్ళీ పునఃప్రారంభించింది. యోనో యాప్‌తో ఎస్‌బీఐ ఖాతాదార్లు తమ ఆధార్‌ను ఉపయోగించి ఆన్‌లైన్‌ డిజిటల్‌ పొదుపు ఖాతాను ఓపెన్ చేయవచ్చ‌ని  తెలిపింది.  డిజిటల్  సేవింగ్స్  అకౌంట్ ఖాతాదారులకు కూడా  మిగతా ఖాతాదార్లకు లభించే అన్ని సదుపాయాలు ఉంటాయి.

ఎలా ప్రారంభించాలి? 
* ముందుగా  స్మార్ట్ ఫోన్ లో యోనో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి 

* ఇప్పుడు యోనో యాప్ ఓపెన్ చేసి పాన్‌, ఆధార్‌ వివరాలు న‌మోదు చేయాలి.  

* మీ ఆధార్ నెంబ‌ర్‌కు లింక‌యి ఉన్న మొబైల్ నెంబ‌ర్‌కు ఓటీపీ వస్తుంది. 

* తర్వాత మీ పేరు, పుట్టిన తేదీ, అడ్ర‌స్ వంటి వివ‌రాల‌న్నీ న‌మోదు చేయాలి. 

* ఇవ‌న్నీ పూర్త‌వ‌గానే మీ ఎస్‌బీఐ డిజిట‌ల్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. 

* ఖాతా ఓపెన్ అయ్యాక దానితో ట్రాన్సాక్ష‌న్స్ ప్రారంభించుకోవ‌చ్చు.

ఇవీ స‌దుపాయాలు
* ఎస్‌బీఐ డిజిట‌ల్ సేవింగ్స్  ఖాతాదార్లకు కూడా మామూలు సేవింగ్స్ అకౌంట్ వారికి ఉన్న అన్ని స‌దుపాయాలూ ల‌భిస్తాయి .
* నామినేషన్‌ సదుపాయం కూడా ఉంటుంది. 
* మీ డిజిట‌ల్ సేవింగ్స్ అకౌంట్‌కు సంబంధించిన ఎస్‌ఎమ్‌ఎస్‌ అలర్ట్‌లు కూడాల ల‌భిస్తాయి.  

ఎస్‌బీఐ డిజిట‌ల్ సేవింగ్స్ అకౌంట్‌ ఆధార్‌తో ఎస్‌బీఐ డిజిట‌ల్ సేవింగ్స్ అకౌంట్‌ SBI Digital Savings account Open SBI Digital Savings Account with Aadhar numberÂ