ఫేస్‌బుక్‌లో ఎన్నో ఫోటోలు, వీడియోలు పెడుతుంటాం. అయితే వాటిని ఇప్పుడు గూగుల్ ఫొటోస్‌లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్ ఇందుకోసం ఒక ప్రత్యేకమైన ట్రాన్స్‌ఫర్ టూల్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోటో ట్రాన్స్‌ఫర్ టూల్‌ను గత ఏడాది ఐర్లాండ్‌లో ప్రవేశపెట్టింది. తర్వాత అమెరికా, కెనడాల్లో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోటో షేరింగ్ టూల్‌ను ఫేస్‌బుక్ వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఫేస్‌బుక్ ఫోటో ట్రాన్స్‌ఫర్ టూల్‌ను ఎలా వాడుకోవాలి?
1. మీ విండోస్ పీసీ లేదా మాక్‌లో ఫేస్‌బుక్ ఓపెన్ చేయండి.
2. సెట్టింగ్స్‌లోకి వెళ్లి సెట్టింగ్స్ అండ్ ప్రైవసీని సెలెక్ట్ చేయండి.
3. మెనూలో లెఫ్ట్ సైడ్ ఉన్న యువర్ ఫేస్‌బుక్ ఇన్ఫర్మేషన్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి.
4. ఇప్పుడు ట్రాన్స్‌ఫర్ ఏ కాపీ ఆఫ్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసి వ్యూ బటన్ నొక్కండి.
5. డ్రాప్ డౌన్ మెనూలోకి వెళ్లి గూగుల్ ఫొటోస్‌ను సెలెక్ట్ చేయండి.
6. ఇప్పుడు చివరగా కన్ఫర్మ్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ నొక్కి మీ గూగుల్ ఫొటోస్ పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి.
7. అంతే మీ ఫేస్‌బుక్ ఫోటోలు వీడియోలు మొత్తం మీ గూగుల్ ఫొటోస్‌లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి.
ఫేసà±â€Œà°¬à±à°•ౠఫోటో షేరింగà±â€Œ ఫేసà±â€Œà°¬à±à°•ౠఫోటో షేరింగౠటూలౠFacebook photos Sharing Facebook sharing tool transfer facebook photos to google photos