జియో 598 ప్లాన్‌తో డిస్నీ, హాట్‌స్టార్ వీఐపీ ప్యాక్ ఏడాది ఫ్రీగా పొంద‌డం ఎలా?

టెలికం కంపెనీలు కొత్త కొత్త రీఛార్జి ప్లాన్స్‌తో యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాయి. రీసెంట్‌గా జియో 598 ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఐపీఎల్ ప్రేమికుల‌ను ఉద్దేశించి ఈ ప్యాక్ తీసుకొచ్చామ‌ని జియో ప్ర‌క‌టించింది. 

రిల‌య‌న్స్ జియో 598 రీఛార్జి ప్లాన్ 
* ఈ ప్లాన్‌ను 598 రూపాయ‌ల‌తో రీఛార్జి చేసుకోవాలి.
* వ్యాలిడిటీ 56 రోజులు 
* రోజుకు 2జీబీ డేటా ఇస్తుంది. అంటే మొత్తం 112 జీబీ డేటా 
* రోజుకు 100 ఎస్ఎంస్‌లు ఫ్రీ
* అన్‌లిమిటెడ్ ఆన్‌నెట్ కాలింగ్ ఫ్రీ  
* జియో నుంచి ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు కాల్ చేయ‌డానికి 2వేల నిముషాల టాక్‌టైం ఫ్రీ.  

డిస్నీప్ల‌స్‌ హాట్‌స్టార్ వీఐపీ ఫ్రీ 
ఈ ప్లాన్లో హైలెట్ ఏమిటంటే డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ వీఐపీ ప్యాక్ ఏడాదిపాటు ఫ్రీగా అందిస్తుంది. ఐపీఎల్ రేపే మొద‌ల‌వ‌బోతోంది. అది హాట్‌స్టార్‌లోనే లైవ్ వ‌స్తుంది. అందుకే డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ ఫ్రీ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను జియో ఈ ప్యాక్‌తోఅందిస్తుంది. 

ఫ్రీ స‌బ్‌స్క్రిప్ష‌న్ పొందాలంటే.. 
* జియో 598 ప్లాన్ రీఛార్జి చేసుకున్న త‌ర్వాత ఓటీపీ వ‌స్తుంది. 

* హాట్‌స్టార్ అప్లికేష‌న్‌ను ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి.

* యాప్ ఓపెన్ చేసి మీకొచ్చిన ఓటీపీతో దానిలోకి లాగిన్ అవ్వాలి. 

* ఏడాదిపాటు డిస్నీ,  హాట్‌స్టార్ వీఐపీ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఫ్రీగా ఆనందించొచ్చు.  

జియో 598 ప్లాన్‌ జియో 598 ప్లాన్‌తో డిస్నీ హాట్‌స్టార్ వీఐపీ ప్యాక్ ఏడాది ఫ్రీ Jio 598 Plan Disney Hotstar VIP Subsription free