SBI కార్డు లేకుండా ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవడం ఎలా ?

దేశంలో తొలిసారిగా కార్డు లేకుండానే డబ్బులను డ్రా చేసుకునే సదుపాయాన్ని State Bank Of India కల్పిస్తోంది . ఇకపై మీరు ఏటీఎం కార్డు మర్చిపోయినా... మీ కార్డు అందుబాటులో లేకపోయినా... ఏటీఎంలో డబ్బులు డ్రా చేయొచ్చు. ఇందుకోసం కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్‌ ఫీచర్ ని SBI అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ఉపయోగించుకవాలంటే కస్టమర్లు YONO యాప్ ఉండాలి. ఈ యాప్ ఉంటే దేశంలోని 16,500 ఎస్‌బీఐ ఏటీఎంలల్లో ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా చేయొచ్చు. ఈ సర్వీసు ఉన్న ఏటీఎంలకు 'యోనో క్యాష్ పాయింట్స్' అని SBI నామకరణం చేసింది. ప్రాసెస్ ఓ సారి చూద్దాం. 

పాయింట్ 1
ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి YONO యాప్ డౌన్‌లోడ్ చేయాలి. ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్లల్లో ఈ యాప్ పనిచేస్తుంది.

పాయింట్ 2
యాప్ డౌన్లోడ్ అయిన తరువాత దాంట్లో మీరు రిజిస్టర్ కావాలి. యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత రిక్వెస్ట్ యోనో క్యాష్ క్లిక్ చేయాలి. అక్కడడ మీకు అకౌంట్ నంబర్ కనిపిస్తుంది. 

పాయింట్ 3
అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసి ఎంత నగదు కావాలో ఎంటర్ చేయాలి. తర్వాత 6 అంకెల యోనో క్యాష్ పిన్ సెట్ చేసుకోవాలి. దాన్ని సెట్ చేసుకోగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎస్ఎంఎస్ వస్తుంది.

పాయింట్ 4
ఈ రిఫరెన్స్ నెంబర్ కేవలం 30 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది. ఈ నంబర్ గుర్తు పెట్టుకుని మీరు మీకు దగ్గర్లో ఉన్న యోనో క్యాష్ పాయింట్‌కు వెళ్లాలి. అక్కడ ముందుగా మీకు ఎస్ఎంఎస్‌లో వచ్చిన 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి.

పాయింట్ 5
మీరు యాప్‌లో ఎంటర్ చేసిన అమౌంట్‌ను ఏటీఎంలో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీరు యాప్‌లో క్రియేట్‌ చేసిన 6 అంకెల యోనో క్యాష్ పిన్‌ను ఎంటర్ చేసి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఇలా ప్రతి సారి మీరు పై ప్రాసెస్ ద్వారా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. 
 

న్యూస్ టెక్నాలజీ ఎస్‌బిఐ యోనో క్యాష్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు విత్ డ్రా