గూగుల్ దూకుడు త‌గ్గాలంటున్న సుంద‌ర్ పిచాయ్‌.. ఏమిటా క‌థ‌? 

గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈవో, మ‌న భార‌తీయుడు సుంద‌ర్ పిచాయ్ గూగుల్ దూకుడు త‌గ్గాలంటున్నాడు. అదేంటి సంస్థ సీఈవో అయి ఉండీ దూకుడు త‌గ్గాలంటాడు.. అదీ క‌రోనా లాంటి క‌ష్ట‌కాలంలో అనుకుంటున్నారా?  దానికి కార‌ణం అదే. క‌రోనా వైర‌స్ అవుట్‌బ్రేక్‌తో ప్ర‌పంచ‌మంతా అత‌లాకుత‌ల‌మైన ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఆల్ఫాబెట్‌లోకి కొత్తగా ఉద్యోగులను తీసుకునే విష‌యంలో కాస్త ఆచితూచి వెళ్లాల‌న్న‌ది సుంద‌ర్ పిచాయ్ ఆలోచ‌న‌. 

నిరుడు 20 వేల మంది
ఆల్ఫాబెట్‌లో  గ‌త సంవ‌త్స‌రం 20 వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. దీంతో 2019 చివ‌రి నాటికి ఈ సంస్థ‌లో 1,18,899 మంది ఉద్యోగులున్నారు.  ఈ సంవత్స‌ర‌మూ దాదాపు అంతేమందిని తీసుకోవాల‌నుకున్నారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు తీసుకున్న‌వారిని ఉంచి.. మిగ‌తావారిని తీసుకునే విష‌యంలో కాస్త చూసి వెళ‌దాం అని సుంద‌ర్ పిచాయ్ త‌మ ఆల్ఫాబెట్ ఉద్యోగుల‌కు చెప్పేశార‌ట‌. అంతేకాదు ఖ‌ర్చులు త‌గ్గించుకునే మార్గాలు చూడాల‌నీ అడిగారు. 

మాకేం కొమ్ముల్లేవు
క‌రోనా ప్ర‌పంచాన్ని అల్లాడిస్తోంది. వ్యాపారాల‌న్నీ ఆగిపోయాయి. వ్యాపారాలు బాగుంటేనే మా గూగుల్‌కు యాడ్స్ వ‌స్తాయి. అవి లేక‌పోతే మేం మాత్రం చేయ‌గ‌లిగేది. క‌రోనా నుంచి ర‌క్షించుకోవడానికి గూగుల్ ద‌గ్గ‌ర‌, ఆల్ఫాబెట్ దగ్గ‌ర ప్ర‌త్యేక అస్త్రాలేమీ లేవ‌ని చెప్పేశారు. అంటే త‌మకేం కొమ్ముల్లేవ‌ని ఇన్‌డైరెక్ట్ గా చెప్పేశారు.  దీంతో ఆల్ఫాబెట్‌లో జాబ్ కొట్టాల‌ని ఆశ‌లు పెట్టుకున్న యూత్‌కు ఈ సంవ‌త్స‌రం నిరాశే మిగిలేలా క‌నిపిస్తోంది
 

Sundar Pichai Google Alphabet Alphabet hiring Carona effect గూగుల్‌ ఆల్ఫాబెట్‌ ఆల్ఫాబెట్ హైరింగ్‌ క‌రోనా వైర‌స్‌ క‌రోనా ఎఫెక్ట్‌ సుంద‌ర్ పిచాయ్‌ Â