అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్‌..  ఫీచ‌ర్స్ మీకోసం..

స్మార్ట్‌టీవీల‌దే ఇప్పుడు రాజ్యం. దానికి త‌గ్గ‌ట్లే నెట్‌ను టీవీకి క‌నెక్ట్ చేసే డాంగిల్స్ కూడా జోరు పెంచేశాయి. లేటెస్ట్‌గా అమెజాన్ త‌న ఫైర్ టీవీ స్టిక్ మ‌రిన్ని లేటెస్ట్ ఫీచ‌ర్ల‌తో లాంచ్ చేసేసింది. వాయిస్ కంట్రోల్ రిమోట్ దీనిలో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. 3,999 రూపాయ‌ల ధ‌ర‌కు ల‌భిస్తున్నఫైర్ టీవీ స్టిక్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌, ఈరోస్ మూవీస్‌, వూట్ టీవీ లాంటి వ‌న్నీ చూడొచ్చు. ఈ ఫైర్ టీవీ స్టిక్‌లో స్పెషల్  ఫీచ‌ర్స్ ఏమిటో చూద్దామా..

అడ్వాన్స్‌డ్ స్ట్రీమింగ్ అండ్ ప్రెడిక్ష‌న్‌
అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ASAP ( అడ్వాన్స్‌డ్ స్ట్రీమింగ్ అండ్ ప్రెడిక్ష‌న్‌) టెక్నాల‌జీతో ప‌ని చేస్తుంది. అంటే మీరు త‌ర‌చుగా చూసే ఛాన‌ల్స్‌, మూవీ జోన‌ర్స్‌ను ట్రాక్ చేస్తుంది. అలాంటి ప్రెడిక్ష‌న్స్ మీకు చూపిస్తుంది. మీరు త‌ర‌చుగా చూడ‌డానికి ఇష్ట‌ప‌డుతున్న కంటెంట్ ఉంటే డౌన్‌లోడ్ చేయ‌డానికి వీలుగా మీకు చూపిస్తుంది. మీరు అది చూసి ఇష్ట‌పడితే  ప్లే బ‌ట‌న్ నొక్కితే చాలు వెంట‌నే ఆ కంటెంట్ ప్లే అవుతుంది. 

డేటా మానిట‌రింగ్ 
మీ బ్రాడ్‌బ్యాండ్ క‌నెక్ష‌న్ లిమిటెడ్ డేటాతో ఉంటుందా? అయినా ఇబ్బంది లేదు. ఎందుకంటే అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్‌లో డేటా మానిట‌రింగ్ ఆప్ష‌న్ కూడా ఉంది. డేటా యూసేజ్ ప‌రిమితి దాటుతుంటే అల‌ర్ట్ చేస్తుంది. 

వాయిస్ సెర్చ్ 
ఫైర్ టీవీ స్టిక్‌తో పాటు ఇచ్చే రిమెట్‌లో వాయిస్ సెర్చ్  ఆప్ష‌న్ కూడా ఉంది. రిమోట్ టాప్‌లో ఉన్న స్పీక‌ర్ బ‌ట‌న్ ప్రెస్ చేసి పట్టుకుని మీకు కావ‌ల‌సిన కంటెంట్ పేరు చెఓబితే వెంట‌నే సెర్చ్ చేస్తుంది. ఈ వాయిస్ సెర్చ్ ఇంగ్లీష్‌, హిందీ భాష‌ల్లో ల‌భిస్తోంది. 

పేరెంట‌ల్ కంట్రోల్స్ 
పిల్ల‌లు ఎలాంటి కంటెంట్ చూడాలో మీరే నిర్ణ‌యించ‌వ‌చ్చు. ఇందుకోసం ఫైర్ టీవీ స్టిక్‌లో పేరెంటల్ కంట్రోల్స్ ఆప్ష‌న్ ఉంది.

సూప‌ర్ వీడియో క్వాలిటీ
అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్‌లో క్వాడ్ కోర్ ప్రాసెస‌ర్ వాడారు. ఇది 802.11ac MIMO Wi-Fiని స‌పోర్ట్ చేస్తుంది. కాబ‌ట్టి  ఫాస్ట్‌గా ప‌నిచేస్తుంది. 4కే టీవీ , గ్లోబ‌ల్ బ్రాడ్‌బ్యాండ్ క‌నెక్ష‌న్ ఉంటే  హై ఎఫిషియ‌న్సీ వీడియో కోడెక్ (HEVC), FHD వీడియోల‌ను చూడొచ్చు. 

Amazon Fire TV Stick data monitoring ASAP అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్‌ అడ్వాన్స్‌డ్ స్ట్రీమింగ్ అండ్ ప్రెడిక్ష‌న్‌ డేటా మానిట‌రింగ్ వాయిస్ సెర్చ్ Â