జులైలో కొన్ని మొబైల్ కంపెనీలు తమ ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేశాయి. Vivo NEX, OPPO Find X, ASUS ZenFone 5Z వంటి వాటితో పాటు కొన్ని బడ్జెట్ ఫోన్లు కూడా వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే శామ్‌సంగ్ తర్వాతి తరం ఫ్లాగ్ షిప్ ఫోన్‌ను, షియామీ ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌ను ఆగస్టులో విడుదల చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో.. ఇతర కంపెనీలు వీటికి పోటీగా ఎలాంటి మోడల్‌ను విడుదల చేస్తాయనే ఆసక్తి అందరిలోనూ పెరుగుతోంది. మరి ఈ నెలలో ఏయే ఫోన్లు ఏయే స్పెసిఫికేషన్లతో విడుదలవబోతున్నాయో చూద్దాం!
BlackBerry Evolve and Evolve X
మన దేశ మార్కెట్‌పై కెనడాకు చెందిన బ్లాక్‌బెర్రీ సంస్థ సీరియస్‌గానే దృష్టిసారించింది. ఇటీవలే KEY2 మొబైల్‌ను విడుదలచేసిన సంస్థ.. ఆగస్టు 2న మరో రెండు కొత్త ఫోన్లను ఆవిష్కరించబోతోంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఎవరికీ అందుబాటులో లేవు. 18:9 ఆస్పెక్ట్ రేషియోతో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్లు ఉంటాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
Honor Play
హెవీ గేమ్స్ కూడా ఆడేందుకు సౌకర్యంగా ఉండేలా కంపెనీలు తమ మొబైల్స్‌ను రూపొందిస్తున్నాయి. పెద్ద స్క్రీన్‌తో, సరికొత్త టెక్నాలజీతో హానర్ సరికొత్త మొబైల్‌ను విడుదల చేయబోతోంది. బడ్జెట్ రేంజ్ డివైజ్‌గా రానున్న Honor Play.. సరికొత్త GPU Turbo technologyతో రాబోతోంది. హెవీ గేమ్స్ ఆడుతున్న సమయంలో బ్యాటరీ త్వరగా తగ్గిపోతుంది. ఈ టెక్నాలజీ వల్ల బ్యాటరీ వినియోగం 30 శాతం తగ్గుతుంది. దీంతో పాటు గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ ఎఫిషియన్సీ 60 శాతం పెరుగుతుంది. 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్ల్పేతో రానున్న ఈ ఫోన్‌లో Kirin 970 చిప్‌సెట్‌ను అమర్చారు. ఈ ఫోన్ అమెజాన్‌లో ఆగస్టు 6వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది.
Xiaomi Mi A2
షియామీ సంస్థ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. Mi A1 సీరిస్‌లో భాగంగా Mi A2ను ఆగస్టు 8న విడుదల చేయబోతోంది. ఈ మొబైల్ ఎంఐయూఐ ఇంటర్‌ఫేస్‌తో కాకుండా.. ఆండ్రాయిడ్ వన్‌తో రాబోతోంది. ఇందులో శక్తిమంతమైన Snapdragon 660 చిప్‌సెట్ అమర్చారు. వెనుక భాగంలో 12MP+20MP డ్యుయెల్ కెమెరాలు, ముందు భాగంలో సెల్ఫీల కోసం 20 మెగాపిక్సల్ కెమెరాలు పొందుపరిచారు.
Samsung Galaxy Note 9
సరికొత్త టెక్నాలజీతో ప్లాగ్‌షిప్ ఫోన్‌ను శామ్‌సంగ్ విడుదల చేయబోతోంది. గెలాక్సీ నోట్9ను ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 9న ఆవిష్కరించబోతోంది. ఇందులో ఆసక్తికరమైన విషయమేంటంటే.. బ్లూటూత్ అమర్చిన S Pen. దూరంలో ఉండగానే ఫొటోలు తీసుకోవచ్చు, పాటలు వినొచ్చు. వీటితో పాటు మరిన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి. గెలాక్సీ నోట్8 మాదిరిగానే ఈ ఫోన్ కూడా ఉండొచ్చని తెలుస్తోంది. 4000 ఎంఏహెచ్ సామర్థ్యంతో పనిచేసే ఈ ఫోన్.. భారత మార్కెట్‌లో ఆగస్టు 9 తర్వాత లభించే అవకాశాలున్నాయి.
Moto G6 Plus
మోటో ఇటీవల విడుదల చేసిన జీ6 మోడల్ ఫోన్‌కి మరిన్ని ఫీచర్లు జోడించి జీ6 ప్లస్‌ను తీసుకురాబోతోంది. జీ6 కంటే పెద్ద స్క్రీన్ కలిగి స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 3,200 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో దీనిని రూపొందించింది. జీ6 డిజైన్‌నే కలిగి ఉండే ఈ ఫోన్‌ను ఈ నెలలోనే దీనిని లాంచ్ చేసేందుకు మోటో ఏర్పాట్లు చేస్తోంది.
Nokia 5.1
నోకియా కూడా ఇతర కంపెనీలతో పోటీపడుతూ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తోంది. నోకియా 2.1, 3.1తో పాటు 5.1 మోడళ్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో నోకియా 3.1 మోడల్ ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. దీని కంటే మెరుగైన ఫీచర్లు, డిస్ల్పేతో ఈ 5.1 రాబోతోంది. 5.5 అంగుళాలు ఉండి 18:9 హెచ్‌డీ డిస్ల్పే గల ఈ ఫోన్‌లో MediaTek Helio P18 చిప్‌సెట్‌ను అమర్చారు. వెనుక 16MP ముందు భాగంలో 8MP కెమెరాలు ఉంటాయి. వీటితో పాటు X5, X6 అనే రెండు మోడల్స్‌ను కూడా నోకియా ఆవిష్కరించబోతోంది. వీటిని 6.1 ప్లస్‌గా దేశీయ మార్కెట్‌లో విడుదల చేయవచ్చని తెలుస్తోంది.
mobiles smart phones blackberry nokia motorola xiomi samsung flagship mobile august