ఇండియన్ ఆర్మీ నుంచి వీడియో గేమ్, డౌన్లోడ్ ప్రాసెస్ ఇదే

పబ్‌జీ, పోర్ట్ నైట్ గేములు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ గేముల్లో పడి యూత్ ప్రపంచాన్ని మరచిపోయారు. అలాగే కొందరు ప్రాణాలను పోగొట్టుకున్నారు. అయితే ఇప్పుడు వీటికి భిన్నంగా  భారత వాయుసేన యాప్ ఓ వీడియో గేమ్ తీసుకొచ్చింది.ఇది  అటు వినోదంతోపాటు వాయుసేనలో చేరేలా ప్రేరణ కూడా పెంపొందిస్తుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పోరాటాలు, సాహసాలను వివరించేలా ఎయిర్ ఫైట్ గేమ్ రూపొందించడం నిజంగా గర్వించదగ్గ అంశమే. 

 ‘ఏ కట్ ఎబోవ్’ పేరుతో అందుబాటులోకి తెచ్చిన ఈ గేమ్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 33 ఎంబీ సైజ్ ఉన్న ఈ గేమ్‌ను ఆండ్రాయిడ్‌లో ఇప్పటికే 1000 మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. 4.5 స్టార్ రేటింగ్ ఇచ్చారు.ఈ గేమ్ లో ప్లేయర్స్ ఫైటర్ జెట్స్ తో మిషన్ పూర్తి చేసేలా రూపొందించారు. కాగా యువతను ఎయిర్ ఫోర్స్ లోకి తీసుకువచ్చే విధంగా దీన్ని తయారు చేశారు.

ప్రస్తుతం సింగిల్ ప్లేయర్ వర్సెన్ లో ఉన్న ఈ గేమ్ త్వరలోనే మల్టీ ప్లేయర్స్ గేమ్ గా ఎయిర్ ఫోర్స్ అధికారులు మార్చనున్నారు. ప్లేయర్స్ రకరకాల ఫైటర్ జెట్స్‌తో మిషన్స్ పూర్తి చేయాలి. ఈ గేమ్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నిర్వహించిన బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ కూడా ఉంటుంది.ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందనన్ వర్తమాన్‌, MiG-21 ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఈ గేమ్‌లో చూడొచ్చు. 

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ భారతదేశానికి చెందిన గేమ్ డెవలపర్‌ Threye Interactive సంస్థతో కలిసి 'Indian Air Force: A Cut Above' అనే ఈ గేమ్ ను రూపొందించింది. అక్టోబర్ నాటికి మల్టీప్లేయర్ ఫీచర్స్‌తో పూర్తి గేమ్ రిలీజ్ కానుంది. ఈ గేమ్ ఎలా ఆడాలో డెవలపర్లు యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోలు అప్‌లోడ్ చేశారు. చూడాలనుకున్న వారు Threye యూట్యూబ్ ఛానెల్‌లో ఆ వీడియోలు చూడొచ్చు.

ఆసక్తి ఉన్నవారు ఈ లింక్ ద్వారా దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. 
https://play.google.com/store/apps/details?id=com.threye.iaf.aca
 

ఇండియన్ ఆర్మీ పబ్‌జీ పోర్ట్ నైట్ ఏ కట్ ఎబోవ్ వీడియో గేమ్ ఇండియన్ ఆర్మీ వీడియో గేమ్