ఐపాడ్‌పై దాడికి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన టాబ్లెట్‌- SURFACE GO

టెక్నాల‌జీ రంగంలో రెండు దిగ్గ‌జ కంపెనీల మ‌ధ్య పోటీ ఎప్పుడూ ఆస‌క్తిక‌రంగానే ఉంటుంది. ఒక కంపెనీ ఏదైనా ప్రొడ‌క్టు లాంఛ్ చేస్తే.. దాని కంటే మెరుగైన, ఉత్త‌మ స్పెసిఫికేష‌న్ల‌తో మ‌రో కంపెనీ త‌మ ప్రొడ‌క్టుని విడుదల చేస్తుంటుంది. ప్ర‌స్తుతం యాపిల్‌, మైక్రోసాఫ్ మ‌ధ్య టెక్ వార్ గురించి తెలిసిందే! యాపిల్ ఇటీవ‌ల లాంఛ్ చేసిన ఐపాడ్‌కి పోటీగా మైక్రోసాఫ్ట్ కూడా ఒక టాబ్లెట్‌ని రూపొందించింది. అదే Surface Go. 

టాబ్లెట్‌లా ప‌నిచేసే ల్యాప్‌టాప్‌
గ‌తంలో మైక్రోసాఫ్ట్ రూపొందించిన‌ Surface Pro టాబ్లెట్‌లానే క‌నిపించినా.. దాని కంటే ధ‌ర‌లోనూ, బ‌రువులోనూ త‌క్కువే! Intel Pentium Gold 4415Y ప్రాసెస‌ర్‌తో ప‌నిచేసే ఈ Surface Go.. 10 అంగుళాల ట‌చ్‌ స్క్రీన్‌తో పాటు 3:2 ఆస్పెక్ట్ రేషియా ఉంటుంది. దీని బ‌రువు కేవ‌లం 500 గ్రాములు. ఇప్ప‌టివ‌ర‌కూ విడుద‌ల చేసిన‌ సర్ఫేస్ ప్రో, స‌ర్వేస్ టాబ్లెట్ల కంటే ఇదే త‌క్కువ బ‌రువు. దీనిని ల్యాప్‌టాప్‌గానూ ఉప‌యోగించుకోవ‌చ్చు. కీ బోర్డు అవ‌స‌ర‌మైతే కనెక్ట్ చేసుకోవ‌చ్చు.. తీసేయ‌చ్చు. ఇందులో USB type C 3.1 కేబుల్‌ని ఇందులో అమ‌ర్చారు. Windows 10 S లేదా Windows 10తో ప‌నిచేస్తుంది. రెండిట్లో ఏదో ఒక ఓఎస్‌ను ఎంచుకోవ‌చ్చు. విండోస్ ల్యాప్‌టాప్‌లో ఉంటే స్ల్పిట్ స్క్రీన్‌, ఆఫీస్ 365, మైక్రోసాఫ్ట్ అప్లికేష‌న్స్ అన్ని ఇందులోనూ ప‌నిచేస్తాయి. 9 గంట‌ల పాటు బ్యాట‌రీ బ్యాక‌ప్ వ‌స్తుంది. ఇది రెండు ర‌కాల వేరియంట్ల‌లో ల‌భిస్తోంది. 4GB RAM, 64GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ. 27, 329 (399డాల‌ర్లు),  8GB RAM, 256GB of SSD స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ. 41,028(599 డాల‌ర్లు). అయితే కొన్ని దేశాల్లో ధ‌ర‌ల‌ను ప్ర‌క‌టించ‌క‌పోయినా.. ఇంచుమించు ఇదేలా ఉండొచ్చ‌ని భావిస్తున్నారు. కీబోర్డు- 99డాల‌ర్లు (రూ.6,781), మౌస్-34.88 డాల‌ర్లు (రూ.2328), Surface Pen-99 డాల‌ర్లతో(రూ.6781) విడిగా కొనుక్కోవాల్సిందే. వైఫై క‌నెక్ట‌విటీ గ‌ల Surface Go ట్యాబ్లెట్ అమ్మ‌కాలు ఆగ‌స్టు 2 నుంచి మొద‌ల‌వ‌బోతున్నాయి. ఎల్‌టీఈ స‌పోర్ట్ చేసే ట్యాబ్లెట్ త్వ‌ర‌లోనే అందుబాటులోకి రానున్నాయి. 

surface pro suface go tablet laptop microsoft appel ipad competitor యాపిల్ మైక్రోసాఫ్ట్ టాబ్లెట్ ఐపాడ్ ల్యాప్ టాప్