ఎవరైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడ అడ్రస్ కోసం గూగుల్ మ్యాప్ ని ఆశ్రయిస్తుంటారు. నావిగేసన్ కోసం గూగుల్ మ్యాప్ వాడుతూ అడ్రస్ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. గూగుల్ కూడా ఎప్పటికప్పుడు గూగుల్ మ్యాప్ ని అప్ డేట్ చేస్తూనే ఉంది. తాజాగా ఇప్పుడు మరో రెండు కొత్త ఫీచర్లను గూగుల్ మ్యాప్స్ లో తీసుకువచ్చింది.
మీరు వేగంగా వాహనాన్ని నడుపుతున్నప్పుడు స్పీడ్ కెమెరాలు ఎక్కడున్నాయో తెలియకపోవడం వల్ల ఫైన్ చెల్లించాల్సి వస్తూ ఉంటుంది. ఇప్పుడొచ్చిన కొత్త ఫీచర్ లో ఎక్కడెక్కడ స్పీడ్ కెమెరాలు ఉన్నాయో గూగుల్ మ్యాప్స్ ముందే హెచ్చరిస్తోంది. మీరు మ్యాప్‌లోనే స్పీడ్ కెమెరాను గుర్తించి మీ బండి వేగాన్ని తగ్గించొచ్చు. మీకు కొన్ని కిలోమీటర్ల ముందుగానే స్పీడ్ ట్రాప్ కెమెరాలను గుర్తించి గూగుల్ మ్యాప్స్ అలర్ట్ చేస్తుంది. గూగుల్ మ్యాప్స్‌లో బ్లూ కలర్‌లో సీసీ కెమెరా ఐకాన్ కనిపిస్తే అక్కడ స్పీడ్ ట్రాప్ కెమెరా ఉన్నట్టుగా మనం గుర్తించాలి.
స్పీడ్ ట్రాప్ కెమెరాలను గుర్తించడం కాకుండా మీరు వెళ్లే రూట్‌లో ఎక్కడైనా యాక్సిడెంట్స్ జరిగినట్టైతే ఆ విషయం కూడా గూగుల్ మ్యాప్స్‌లో తెలుసుకోవచ్చు. ముందుగానే యాక్సిడెంట్ గురించి మీకు సమాచారం లభిస్తుంది. మీకు గూగుల్ మ్యాప్స్‌లో రెడ్ కలర్ ఐకాన్ కనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు ఈ ఫీచర్ సరిగ్గా పనిచేయట్లేదని తెలుస్తోంది. రోడ్డు రిపేర్ చేస్తున్నా... ఆ ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగినట్టు గూగుల్ మ్యాప్స్ చూపిస్తోంది. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే మీరే స్వయంగా రిపోర్ట్ చేయొచ్చు. గూగుల్ మ్యాప్ లో కొత్తగా ప్రవేశపెట్టిన ఫీచర్ ADD a Report అనే సదుపాయం ద్వారా మీరు యాక్సిడెంట్ సమాచారాన్ని అప్ డేట్ చేయవచ్చు.
à°¨à±à°¯à±‚సౠటెకà±à°¨à°¾à°²à°œà±€ గూగà±à°²à± à°®à±à°¯à°¾à°ªà±à°¸à± గూగà±à°²à± à°®à±à°¯à°¾à°ªà±à°¸à± à°¸à±à°ªà±€à°¡à± కెమెరా à°¸à±à°ªà±€à°¡à± à°Ÿà±à°°à°¾à°ªà± కెమెరా à°Ÿà±à°°à°¾à°µà±†à°²à±