జియో ఫోన్‌లో వాడుతున్న KaiOS గురించి మ‌నం విస్మ‌రించ‌కూడ‌ని అంశాలు

ఆండ్రాయిడ్‌, ఐవోఎస్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌లు కొన్నేళ్లుగా శాసిస్తున్న‌ స‌మ‌యంలో.. జియో ఫోన్ రాక‌తో KaiOS గురించి అధికంగా చ‌ర్చ జ‌రుగుతోంది. టీవీ, గూగుల్ మ్యాప్స్‌, వాట్సాప్‌, వంటి ప‌వ‌ర్‌ఫుల్ యాప్‌లు.. ఫీచ‌ర్ ఫోన్‌లోనే ప‌నిచేస్తున్నాయంటే.. అది క‌చ్చితంగా ఈ ఓఎస్ వ‌ల్లే అన‌డంలో సందేహం లేదు. సులువుగా యాప్స్ అన్నింటినీ స‌పోర్ట్ చేస్తుండటంతో ఆండ్రాయిడ్‌, ఐవోఎస్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ల‌కు పోటీగా ఈ ఓఎస్ కూడా మారుతుందని అంద‌రూ అంచ‌నా వేస్తున్నారు. అతి త‌క్కువ స‌మ‌యంలోనే పాపుల‌ర్ అయిన ఈ KaiOSలో నాలుగు అత్యంత ముఖ్య‌మైన ఫీచ‌ర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

కైస్టోర్‌(KaiStore)
ఆండ్రాయిడ్‌, ఐవోఎస్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్స్‌కి వేర్వేరుగా యాప్ స్టోర్లు ఉన్న‌ట్లే ఈ KaiOSకి కూడా KaiStore అనే యాప్ స్టోర్ ఉంది. ఇందులో యూజ‌ర్ల‌కి అవ‌స‌ర‌మైన‌ ఎన్నో ర‌క‌ర‌కాల యాప్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. పేరొందిన, ప్రస్తుతం అంద‌రికీ అందుబాటులో ఉండే యాప్స్ అన్నీ KaiStoreలోనే ఉన్నాయి. మ‌రిన్ని యాప్స్ ఇందులోకి తీసుకురాబోతున్నారు. త్వ‌ర‌లోనే వాట్సాప్ యాప్‌ కూడా ఈ ఆప‌రేటింగ్ సిస్టమ్‌లో ప‌నిచేయ‌నుంది. 

గేమ్స్‌(Games) కూడా.. 
ఆండ్రాయిడ్ గో వంటి లోఎండ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌కి మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా ఈ Kai ఆప‌రేటింగ్ సిస్టమ్‌ను మార్చే ప్ర‌ధాన ఫీచ‌ర్ల‌లో గేమ్స్ కూడా ఒక‌టి. ఫీచ‌ర్ ఫోన్ల‌లో ఎక్కువ గేమింగ్‌కు అవ‌కాశం ఉండ‌దు. కానీ ఈ KaiOS గేమింగ్‌ను స‌మ‌ర్థంగా, మ‌రింత మెరుగ్గా స‌పోర్ట్ చేయ‌నుంది. క్ర‌మంగా దీనికి పాపులారిటీ పెరుగుతుండ‌టంతో గేమ్ డెవ‌లప‌ర్లు కూడా ఈ ఓఎస్‌కు త‌గిన‌ట్టుగా గేమ్స్‌ను రూపొందించేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో ప‌నిచేయ‌ని సింపుల్ గేమ్స్ అన్నీ త్వ‌ర‌లోనే KaiOSలో ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చు.

సోష‌ల్ మెసేజింగ్ యాప్స్
స్మార్ట్‌ఫోన్లు అంబాటులోకి వ‌చ్చాక కేవ‌లం కాల్స్ మాట్లాడుకునేందుకే ఫీచ‌ర్ ఫోన్ అనేంత‌గా ప‌రిస్థితి మారిపోయింది. కానీ జియోఫోన్ విష‌యంలో మాత్రం ఈ అభిప్రాయం మార్చుకోవాల్సిందే! ప్ర‌స్తుతం ఫేస్‌బుక్‌, గూగుల్ మ్యాప్స్, గూగుల్, సెర్చ్‌ వంటి సోష‌ల్ మీడియా, మెసేజింగ్ అప్లికేష‌న్లు కూడా ఇందులో ఉప‌యోగించుకునేలా రూపొందించ‌డం అతి పెద్ద‌ ఫీచ‌ర్ అని చెప్పుకోవ‌చ్చు. అన్ని సోష‌ల్ మీడియా అప్లికేష‌న్లు సులువుగా ప‌నిచేసే సామర్థ్యం ఈ కై ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌లో ఉంది. ఇప్పుడు మొబైల్ కంపెనీల‌న్నీ త‌క్కువ బ‌డ్జెట్లోనే ఎక్కువ ఫీచ‌ర్లు గ‌ల ఫోన్‌ల‌ను త‌యారుచేసేందుకు ముందుకొస్తాయి. 

నాలుగు రోజుల వ‌ర‌కూ బ్యాట‌రీ
ఎక్కువ బ్యాట‌రీ లైఫ్ ఉన్న ఫోన్ల‌కు ఇప్పుడు భారీగా డిమాండ్ ఉన్న విష‌యం తెలిసిందే! 3000 ఎంఏహెచ్ సామ‌ర్థ్యం గ‌ల ఆండ్రాయిడ్ ఫోన్లు ఒక‌సారి చార్జింగ్ పెడితే రోజంతా బ్యాట‌రీ నిల‌వ‌డం క‌ష్ట‌మైపోతోంది. ఈ త‌రుణంలో ఒక్క‌సారి చార్జింగ్ పెడితే జియో ఫీచ‌ర్ ఫోన్‌ నాలుగు రోజుల పాటు బ్యాట‌రీ బ్యాక‌ప్ వ‌స్తుంది. కై ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌లో ఉన్న రిసోర్స్ మేనేజ్‌మెంట్ వ‌ల్లేన‌ని అంతా అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌లో ఎన్నో ర‌కాల బ్యాట‌రీ సేవింగ్ ఆప్ష‌న్లు ఉన్నాయి. ఇవ‌న్నీ ఫోన్‌ను త‌క్కువ‌గా ఉప‌యోగించేలా చేసి బ్యాట‌రీని ఆదా చేస్తాయి.

ఆండ్రాయిడ్ ios kai operating system jio phone battery games compatable జియో కై ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్