దేశంలో తొలి రివోల్ట్ RV 400 AI ఎలక్ట్రిక్ బైక్ : బైక్ హైలెట్స్,ఆన్ ది రోడ్ ధర మీకోసం

రెవోల్ట్ మోటార్స్ కంపెనీ దేశంలోనే తొలిసారిగా పూర్తి స్థాయిలో విద్యుత్ శక్తితో పనిచేసే ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత మోటార్ సైకిల్‌ను లాంచ్ చేసింది. ఆర్‌వీ 400 పేరిట మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ రాహుల్ శర్మ దీనిని లాంచ్ చేశారు. బాష్, అమెజాన్, ఎంఆర్‌ఎఫ్ టైర్స్, ఎయిర్‌టెల్, గూగుల్, ఏటీఎల్, సోకో, క్యూఎస్ మోటార్ తదితర కంపెనీలు పార్ట్‌నర్స్‌గా వ్యవహరించాయి. ఈ బైక్ హైలెట్స్ ఓ సారి చూద్దాం. 

ఈ మోటార్ సైకిల్ గరిష్టంగా గంటకు 85 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఒక్కసారి ఫుల్ చార్జింగ్ పెడితే 156 కిలోమీటర్ల వరకు ఈ బైక్‌పై వెళ్లవచ్చు.15యాంప్స్ సాకెట్‌తో సులభంగా చార్జింగ్ చేసుకోవచ్చు. అందుకు గాను ప్రత్యేక చార్జింగ్ సెటప్ అవసరం లేదు. అలాగే ఆ బ్యాటరీని తొలగించి దాన్ని ఇల్లు లేదా ఆఫీస్‌లో ఎక్కడైనా చార్జింగ్ చేసుకోవచ్చు.  ఈ బైక్ లో ‘ఆన్ లైన్ రీఛార్జ్ ఎబిలిటీ’ అనేది ఆకట్టుకునే ఫీచర్ గా చెప్పవచ్చు. ఇంటర్నెట్ ద్వారా ఎలాంటి ఛార్జ్ ఉండదు. 

బైక్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉన్నందున బ్యాటరీ లైఫ్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. దీంతో బ్యాటరీ చెడిపోయినా మనకు ఇట్టే యాప్‌లో తెలిసిపోతుంది. బైక్ రైడర్ Onlineలో బ్యాటరీలను ఆర్డర్ చేయాలంటే రివోల్ట్ కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. ఆ బ్యాటరీలను నేరుగా బైక్ రైడర్ ఇంటికి డెలివరీ చేసి మార్పిడి చేస్తారు. 22కెవైఎంసీఓ iFlow 5కిలోల బ్యాటరీ మాదిరిగా కాకుండా RV 400 బ్యాటరీల్లో ఒక్కోదాని బరువు 18కిలోల వరకు ఉంటుంది. 

రియల్ టైం ఇన్ఫర్మేషన్, డైయాగ్నిస్టిక్స్, జియో ఫెన్సింగ్, OTA అప్ డేట్ సపోర్ట్, బైక్ లొకేటర్, ఆర్టిఫీషియల్ ఎగ్జాస్ట్ సౌండ్ సిస్టమ్ ఈ బైకులో లోడ్ అయ్యాయి. ఈ-బైక్ లో నాలుగు ఎగ్జాస్ట్ నోట్ ఆప్షన్లు ఉన్నాయి. ఇవి వద్దనుకుంటే  కస్టమైజడ్ నోట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. 

ఈ మోటార్ సైకిల్ విద్యుత్‌తో పనిచేస్తుంది. అలాగే దీన్ని స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. అందుకు గాను ఫోన్‌లో ఓ కంపానియన్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అనంతరం బైక్‌లో ఉండే బ్లూటూత్ సహాయంతో ఈ బైక్.. స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అవుతుంది. ఆ తరువాత యాప్ ఓపెన్ చేసి అందులో ఉండే పలు ఫీచర్లను వినియోగదారులు పొందవచ్చు.

ట్రిప్ హిస్టరీ, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించారు, బ్యాటరీ చార్జింగ్ ఎంత ఉంది, ఇంకా ఎంత దూరం వెళ్లవచ్చు, బైక్ రక్షణ కోసం జియో ఫెన్సింగ్ వంటి ఫీచర్లను ఆ యాప్‌లో అందిస్తున్నారు. రివోల్ట్ బైక్ కు సంబంధించి ఆండ్రాయిడ్, iOS Apps, గూగుల్ ప్లే, Apple యాప్ స్టోర్లలో త్వరలో రిలీజ్ కానున్నాయి.

బైక్‌కు ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్‌ను ఏర్పాటు చేశారు. యాప్ ద్వారానే ఈ బైక్‌ను స్టార్ట్ చేయవచ్చు. అందుకు గాను యాప్‌కు వాయిస్ కమాండ్లను ఇవ్వాల్సి ఉంటుంది. ఇక బైక్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్‌కు ఓటీఏ రూపంలో అప్‌డేట్లను ఇస్తారు. యాప్‌లో ఉన్న పలు సౌండ్ సెట్టింగ్స్ ద్వారా బైక్ సైలెన్సర్ సౌండ్‌ను మనకు ఇష్టం వచ్చినట్లు మార్చుకోవచ్చు. 

రివోల్ట్ బైక్ కొత్త మోడల్ లో పూర్తిస్థాయిలో డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ కన్సోల్, రీజనరేటివ్ బ్రాకింగ్ సిస్టమ్, బ్లూ టూత్ కనెక్ట్ విటీ ఉంది. కాంపాక్ట్ డిజైన్ తో పాటు బోల్ట్ ఆన్ సబ్ ఫ్రేమ్, ఫ్రంట్ లో USD ఫోర్క్, రియల్ లో మోనోషాక్, డిస్క్ బ్రేక్స్, LED హెడ్ లాంప్స్, హ్యాండల్ బార్ దగ్గర రియర్ బ్రేక్ లెవల్ , 4G LTE SIM వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. 

రెవోల్ట్ ఆర్‌వీ 400 మోటార్‌సైకిల్‌ను బ్లాక్, రెడ్ కలర్ వేరియెంట్లలో విడుదల చేశారు. బైక్ ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. సబ్సిడీ పోను దీని ధర రూ.1.20 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఈ నెల 25వ తేదీ నుంచి అమెజాన్‌లో ప్రీ బుకింగ్స్‌ను ప్రారంభించనున్నారు. ఢిల్లీ కస్టమర్లు రూ. 100 టోకన్ పై రివోల్ట్ కంపెనీ వెబ్ సైట్ లేదా అమెజాన్ వెబ్ సైట్ ద్వారా బైక్ ను బుక్ చేసుకోవచ్చు.

రెవోల్ట్ మోటార్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోటార్ సైకిల్‌ రివోల్ట్ ఇంటెల్లి కార్పొరేషన్ రివోల్ట్ RV 400 AI ఎలక్ట్రిక్ బైక్ రివోల్ట్ RV 400 AI ఎలక్ట్రిక్ బైక్ ధర రివోల్ట్ RV 400 AI ఎలక్ట్రిక్ బైక్ ఫీచర్లు