ఈ రోజుల్లో మొబైల్ కొంటేనే సరిపోదు. దానికి ఛార్జింగ్ ఎంత మేర వస్తుందనేది కూడా చూడాలి. డేటా వాడకం అనేది విపరీతంగా పెరిగిపోయిన నేడు మొబైల్ ఛార్జింగ్ మహా అంటే ఏ మూడు గంటలో నాలుగు గంటలో వస్తుంది. అలాంటిప్పుడు ఫోన్ నేలకు విసిరికొట్టేయాలనిపిస్తుంది.
ఇక దూర ప్రయాణాలు చేసే సమయాల్లో అయితే ఈ బాధ గురించి చెప్పనే అవసరం లేదు. అలాంటి వారు ఎక్కువగా పవర్ బ్యాంక్ లను ఆశ్రయిస్తుంటారు.అయితే పవర్ బ్యాంక్ కూడా చూసి తీసుకోకపోతే అది మొబైల్ ఛార్జింగ్ లాగే తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి పవర్ బ్యాంక్ కొనేముందు ఈ విషయాలు తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి.
ముందుగా పవర్ బ్యాంక్ అనేది కెపాసిటి ఎంత ఉందో లెక్కించాలి. పవర్ బ్యాంక్ బాక్స్ పైన ఉన్న కెపాసిటీకి అసలు కెపాసిటీకి చాలా తేడా ఉంటుంది. చాలామంది ఇక్కడే తికమక అవుతుంటారు. తమ దగ్గర 4000 ఎంఏహెచ్ స్మార్ట్‌ఫోన్ ఉందంటే 20,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంకుతో ఐదు సార్లు ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చని అనుకుంటారు. అయితే పవర్ బ్యాంక్ కెపాసిటీని లెక్కించే పద్ధతి అది కాదు. కన్వర్షన్ లాస్ ఉంటుంది.
సాధారణంగా మీ స్మార్ట్‌ఫోన్ పవర్ రేటింగ్‌ను 5 వోల్ట్స్‌తో లెక్కిస్తారు. కానీ పవర్ బ్యాంకు విషయానికి వచ్చేసరికి 3.7 వోల్ట్స్ మాత్రమే లెక్కిస్తారు. దీనివల్ల కెపాసిటీ తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మీ పవర్ బ్యాంక్ కెపాసిటీ 20,000 ఎంఏహెచ్ అనుకుందాం. 20,000 ఎంఏహెచ్ x 3.7 వోల్ట్స్= 74,000 మెగావాట్ హవర్స్. దీన్ని 5 వోల్ట్స్‌కి కన్వర్ట్ చేస్తే మీ స్టోర్డ్ కెపాసిటీ 14,800 ఎంఏహెచ్(37,000 మెగా వాట్ హవర్స్ / 5 వోల్ట్స్) మాత్రమే. అంటే మీరు 20,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ కొంటే అందులో మీకు లభించే కెపాసిటీ 14,800 ఎంఏహెచ్. ఇలా లెక్కలు వేయడం తలనొప్పి అని మీరు అనుకుంటే సింపుల్ గా పవర్ బ్యాంక్ కెపాసిటీలో ఓ పాతిక శాతం తక్కువగా ఉంటుందని అనుకుని తీసుకుంటే సరిపోతుంది.
à°¨à±à°¯à±‚సౠటెకà±à°¨à°¾à°²à°œà±€ పవరà±â€Œà°¬à±à°¯à°¾à°‚కౠమొబైలà±à°¸à± à°¸à±à°®à°¾à°°à±à°Ÿà±â€Œà°«à±‹à°¨à±à°¸à±Â