రూ.10,000లోపు ధ‌ర‌లో షియోమీ ఫోన్లు ఎన్నున్నాయ్‌?

షియోమీ కంపెనీ రెండు రోజుల కింద‌ట స‌రికొత్త ‘రెడ్‌మి 6’ ఫోన్‌ను ఆవిష్క‌రించింది. అయితే, ఈ ఫోన్ల ధ‌ర‌ల‌ను ప్ర‌క‌టించిన‌ప్పుడు ఒకింత అయోమ‌యం నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో స్మార్ట్ ఫోన్ కోసం రూ.10 వేలు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్న‌వారి కోసం ఈ కంపెనీ ఏయే ధ‌ర‌ల్లో ఫోన్ల‌ను అందించ‌గ‌ల‌దో ప‌రిశీలిస్తే- ‘సుమారు 10వేలు’ అంటే రూ.9 వేల నుంచి రూ.11వేల మ‌ధ్య అని అర్థం చేసుకోవాల్సి వ‌చ్చింది. ఎందుకంటే... మ‌న దేశంలో 9 అంకెతో అంత‌మ‌య్యే వ‌స్తువుల ధ‌ర‌ను ‘‘బాటా’’ ధ‌ర‌గా మ‌నం అభివ‌ర్ణిస్తుంటాం. ఇప్పుడు షియోమీ కూడా అదేప‌ని చేసింది. అంటే... ఫోన్ల ధ‌ర‌ల‌ను రూ.8,999 నుంచి 10,999గా నిర్ణ‌యించింది. మొత్తంమీద రూ.10 వేలు ఖ‌ర్చుపెట్టాల‌నుకున్న వారు ‘‘మ‌రి కాస్త‌’’ ఎక్కువ వెచ్చిస్తూ ‘‘ఇంకాస్త‌’’ మెరుగైన ఫోన్ కొన్న అనుభూతి చెందుతార‌న్న మాట‌. లేదంటే- ఖ‌రీదైన దానితో పోలిస్తే ‘కాస్త త‌క్కువ’ ధ‌ర‌తో అంతే నాణ్య‌మైన ఫోన్ కొన్న‌ట్లు భావిస్తారన్న మాట‌. కొంద‌రు మిత్రులు ఏదైనా కొనాలంటే కొంత బ‌డ్జెట్ నిర్ణ‌యించుకుంటారు. కానీ, చాలాసార్లు అంత‌క‌న్నా త‌క్కువ‌లో ఆ వ‌స్తువు కొని, ధ‌ర త‌క్కువైనా నాణ్య‌మైన‌దే ల‌భించింద‌ని సంతృప్తి ప‌డుతుంటారు. లేదంటే మ‌రికొంత ఎక్కువ ధ‌ర‌కు కొనుగోలు చేసి, మ‌రింత మెరుగైన‌ది దొరికింద‌ని సంబ‌ర‌ప‌డుతుంటారు. ఇప్పుడు మ‌ళ్లీ మ‌నం చ‌ర్చిస్తున్న అంశం ప్ర‌కారం రూ.10 వేల ధ‌ర‌లో ల‌భించే షియోమీ ఫోన్లు ఎన్ని ఉన్నాయో చూద్దామ‌ని వెబ్‌సైట్‌లోకి వెళితే వాటి ధ‌ర‌లు ఇలా ఉన్నాయ్‌.

Redmi 6 Pro: Rs 10,999 (3GB/32GB); Redmi 6: Rs 9,499 (3GB/64GB); Redmi Y1: Rs 8,999 (3GB/32GB); Redmi Y2: Rs 9,999 (3GB/32GB); Redmi Y1: Rs 10,999 (4GB/64 GB);  Redmi 5: Rs 8,999 (3GB/32GB); Redmi 5: Rs 10,999 (4GB/64GB); Redmi Note 5: Rs 9,999 (3GB/32GB).

   ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో రూ.10 వేల‌లోపు షియోమీ ఫోన్లు దాదాపు 10దాకా ఉంటే... రూ.10 వేల నుంచి రూ.20 వేల మ‌ధ్య 9, ఇప్పుడు రూ.8,999 నుంచి రూ.10,999 మ‌ధ్య 8 మోడల్స్ ఉన్నాయ్‌! కాబ‌ట్టి రూ.10వేలలో ఓ చ‌క్క‌టి స్మార్ట్‌ ఫోన్ కొనాలంటే ఒక్క షియోమీలోనే 8 మోడ‌ల్స్ ఉన్నాయ‌న్న మాట‌. అవ‌న్నీ విభిన్న‌మైన‌వే... వాటిలో Y2 and Y1 సిరీస్ ఫోన్లు సెల్ఫీ ప్రాముఖ్యంగ‌ల‌వి కాగా, ‘రెడ్‌మి 6 ప్రో’లో డ్యూయెల్ కెమెరాల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌బ‌డింది. అలాగే ‘నోట్ 5’లో పొడ‌వైన డిస్‌ప్లే, మంచి బ్యాట‌రీ ఉన్నాయి. ఇక ‘రెడ్‌మి 6’ కోసం వేచి చూడ‌లేనివారు ‘రెడ్‌మి 5’ను ఎంచుకోవ‌చ్చు. కాబ‌ట్టి రూ.10వేల లోపు షియోమీ ఫోన్ కొనాలంటే మ‌న‌ముందు చాలా ఆప్ష‌న్లు ఉన్నాయ‌న్న‌ది గుర్తుంచుకోవాలి.

Xiaomi Models Readmi