రూ.1000లోపు ధ‌ర‌లో ప‌వ‌ర్ బ్యాంక్స్‌లో బెస్ట్‌వి, వ‌ర‌స్ట్‌వి ఏవి?

మొబైల్ బ్యాట‌రీ సామ‌ర్థ్యం ఎంత ఉన్నా.. ప‌వ‌ర్ బ్యాంక్ త‌ప్ప‌నిస‌రిగా మారిపోయింది. ముఖ్యంగా ప్ర‌యాణ స‌మ‌యంలో వీటి ఉప‌యోగం మ‌రింత ఎక్కువ‌గా ఉంటోంది. ప్ర‌స్తుతం ఎంఐ, ఇన్‌టెక్స్, లెనోవో వంటి కంపెనీలు వీటిని త‌క్కువ ధ‌ర‌కే అందిస్తున్నాయి. ఎక్కువ బ్యాక‌ప్‌ సామ‌ర్థ్యంతో త‌క్కువ ధ‌ర‌లో చాలా బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. మరి వీటిలో రూ.1000 ధ‌ర‌ లోపు ఐదు బెస్ట్, మూడు  వ‌ర‌స్ట్‌వి తెలుసుకుందాం! 

1. Mi 10000mAH Li-Polymer Power Bank 2i
భారీ బ్యాట‌రీ సామ‌ర్థ్యంతో కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్ మోడ‌ళ్ల‌తో దేశీయ మార్కెట్‌లో దూసుకుపోతున్న చైనీస్ కంపెనీ ఎంఐ..  ప‌వ‌ర్ బ్యాంక్‌ల‌ను రూపొందిస్తోంది. ప‌దివేల ఎంఏహెచ్ సామ‌ర్థ్యం గ‌ల ఎంఐ పాలిమ‌ర్ లిథియం పాలిమ‌ర్ ప‌వ‌ర్ బ్యాంక్ 2ఐ అందుబాటులో ఉంది. ఇందులో రెండు యూఎస్‌బీ పోర్టులు, 240 గ్రాముల అతిత‌క్కువ బ‌రువు ఉంటుంది. 
1 x 1.4 x 14.7 cm = 146.118 cubic cm ఉండే ఈ ప‌వ‌ర్ బ్యాంక్ సాధార‌ణ కెపాసిటీ 6500 mAH. 

Pros
* మెరుగైన బిల్డ్ క్వాలిటీ
* 90 శాతం క‌న్వ‌ర్ష‌న్ రేట్‌
* టూవే ఫాస్ట్ చార్జింగ్‌
* త‌క్కువ  బ‌రువు, compact
* Nine layers of circuit chip protection
* అల్యూమినియం అల్లాయ్ + CNC Edge
* అతి తక్కువ బ‌డ్జెట్‌

ఎక్కువ సేపు చార్జింగ్ అవుతుంది. మొత్తం ఫుల్ అయ్యేందుకు సుమారు 7 నుంచి 8 గంట‌లు ప‌డుతుంది. అతి తక్కువ ధ‌ర‌లో మార్కెట్‌లో ఉన్న బెస్ట్ ప‌వ‌ర్ బ్యాంక్‌ల‌లో ఇదీ ఉంది. ఇది ఫాస్ట్ చార్జింగ్‌కు స‌పోర్ట్ చేస్తుంది. 18వాట్స్ వ‌ర‌కూ ప‌వ‌ర్ అవుట్‌పుట్‌ను అడ్జెస్ట్ చేసుకోవ‌చ్చు. దీంతో పాటు మ‌రిన్ని ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి. ఇది ల‌భ్య‌మ వుతున్న అమెజాన్ సైట్‌లో దీనికి ఒక స్టార్ రేటింగ్ మాత్ర‌మే ఉండ‌టం కొంత నిరుత్సాహ ప‌రిచే అంశం. 

2. Rock ITP106 13000mAH Power Bank 

* 13000 ఎంఏహెచ్ లిథియం అయాన్ బ్యాట‌రీ
* రెండు USB పోర్టులు
* 327 గ్రాములు బ‌రులు
* 9 x 6.3 x 2.3 cm = 230.391

Pros
* 13,000 ఎంఏహెచ్ బ్యాట‌రీ
* The conversion rate of 75%
* మెరుగైన డిజైన్‌, బిల్డ్ క్వాలిటీ
* అస‌లైన బ్యాట‌రీ సామ‌ర్థ్యం: 10000 mAH

ఇందులో లిథియం పాలిమ‌ర్ బ్యాట‌రీ కాకుండా లిథియం ఇయాన్ ఉప‌యోగించారు. ప‌వ‌ర్ బ్యాంక్‌ పెద్ద‌గా ఉండ‌టంతో దీనిని తీసుకెళ్ల‌డం కొంత ఇబ్బందిగా ఉండొచ్చు. ఎక్కువ ఫీచ‌ర్లతో రూ.1000 ధ‌ర లోపు ఉన్న ప‌వ‌ర్ బ్యాంక్‌ల జాబితాలో ఇది ముందు వ‌రుస‌లో ఉంటుంది. చార్జింగ్ కెపాసిటీ అధికంగా ఉండ‌టం దీనికి క‌లిసొచ్చే అంశం. 

3. Lenovo PA13000mAH Power Bank
హై క్వాలిటీ ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల‌ను లెనోవో  రూపొందిస్తోంది.  వాటిలో ప‌వ‌ర్ బ్యాంక్‌లు కూడా ఉన్నాయి. 13,000 ఎంఏహెచ్ సామ‌ర్థ్యం గ‌ల లిథియం అయాన్ బ్యాట‌రీ గ‌ల లెనోవో పీఏ 13000 ఎంఏహెచ్ ప‌వ‌ర్ బ్యాంక్ ప్ర‌స్తుతం వెయ్యి లోపు అందుబాటులో ఉంది. 399 గ్రాముల బ‌రువైన ఈ ప‌వ‌ర్ బ్యాంక్‌లో రెండు ఫాస్ట్ చార్జింగ్‌ యూఎస్‌బీ పోర్టులు ఉంటాయి. 14.1 x 6.4 x 2.2 cm = 198.5 క్యూబిక్ సెంటీమీట‌ర్లు ఉంటుంది. దీని యాక్చువ‌ల్ బ్యాట‌రీ కెపాసిటీ 10,000 ఎంఏహెచ్. క‌న్వ‌ర్ష‌న్ రేట్ 90 శాతం. 

Pros
* హై క‌న్వ‌ర్ష‌న్ రేట్‌
* సులువుగా క్యారీ చేయ‌వ‌చ్చు. 
* హై యాక్చువ‌ల్ బ్యాట‌రీ కెపాసిటీ
* అంద‌మైన డిజైన్‌
* రెండు ఫాస్ట్ చార్జింగ్ అవుట్‌పుట్ పోర్టులు

Cons
ఇది ఫుల్‌గా చార్జింగ్ అవ్వాలంటే క‌నీసం 8 గంట‌లు ప‌డుతుంది. అయితే ఇందులో ఒక చార్జింగ్ పోర్ట్ స‌రిగా ప‌నిచేయ‌దనే ఫిర్యాదులు వినియోగ‌దారుల నుంచి ఉన్నాయి. 

4. Intex IT-PBA 10K Poly 10000mAH Power Bank
మంచి ఎలక్ట్రానిక్స్ ప‌రిక‌రాలు కాక‌పోయినా.. చెత్త పరిక‌రాల‌ను మాత్రం ఇన్‌టెక్స్ కంపెనీ త‌యారు చేయ‌ద‌నే అభిప్రాయం ఉంది. ప్ర‌స్తుతం ఈ కంపెనీ రూపొందించిన Intex IT-PBA 10k Poly 10000 mAH power bank కూడా కాంపాక్ట్ ప‌రిమాణంలో ఉంటూనే నాణ్య‌మైన‌దిగానూ గుర్తింపు పొందింది. లిథియం పాలిమ‌ర్ బ్యాట‌రీపై ఆధార‌ప‌డి ప‌నిచేస్తుంది. రెండు యూఎస్‌బీ పోర్టులు ఉంటాయి. 281 గ్రాముల బ‌రువు ఉంటుంది. 

Pros
* Compact size with medium weight
* రెండు యూఎస్‌బీ అవుట్‌పుట్ పోర్టులు
* ఫాస్ట్ చార్జింగ్ ఇన్‌పుట్‌
* ఫాస్ట్ చార్జింగ్ ఇన్‌పుట్‌
* అంద‌మైన, స్టైలిష్ డిజైన్‌

Cons
* ఉన్న రెండు యూఎస్‌బీ పోర్టుల్లో ఒక‌టి మాత్ర‌మే ఫాస్ట్ చార్జింగ్ అవుట్‌పుట్ క‌లిగి ఉంటుంది.
* పూర్తిగా చార్జ్ అయ్యేందుకు చాలా ఎక్కువ స‌మ‌యం తీసుకుంటుంది. 

5. Intex IT-PB12.5K 12500mAH Power Bank

ఇన్‌టెక్స్ త‌యారుచేసిన మ‌రో భారీ ప‌వ‌ర్ బ్యాంక్ Intex IT-PBA12.5K. 12500 ఎంఏహెచ్ గ‌ల ఈ ప‌వ‌ర్ బ్యాంక్‌లో మూడు యూఎస్‌బీ అవుట్‌పుట్ పోర్టులు ఉంటాయి. 290 గ్రాముల బ‌రువు ఉంటుంది. 

Pros
* 500 life cycles
* ఎల్ఈడీ ఫ్లాష్‌లైట్‌
* ఫాస్ట్ చార్జింగ్ ఇన్‌పుట్ ఒక‌టి
* రెండు ఫాస్ట్ చార్జింగ్ అవుట్‌పుట్స్
* కాంపాక్ట్ డిజైన్‌

Cons
* చార్జింగ్‌కు ఎక్కువ స‌మ‌యం తీసుకుంటుంది. 
* Low actual charge capacity
* పూర్ క్వాలిటీ, క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్ స‌రిగ్గా లేక‌పోవ‌డం 

Worst power bank under 1000

1.Ambrane P-1310 13000mAH Power Bank

* 13000 ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్థ్యం
* డ్యుయెల్ అవుట్‌పుట్‌
* టార్చ్‌లైట్‌
* 308 గ్రాముల‌ బ‌రువు

Cons
* ఒకే ఒక్క ఫాస్ట్ చార్జింగ్ అవుట్‌పుట్ 
* పెద్ద ప‌రిమాణంలో ఉండ‌టంతో కొంత ఇబ్బందులు త‌ప్ప‌వు.
* డిజైన్ కూడా బాగోలేక‌పోవ‌డం
* బిల్డ్ క్వాలిటీ లేక‌పోవ‌డం.  
* ఫోన్ చార్జింగ్ పెట్టిన‌ప్పుడు చాలా వేడెక్కుతుంది. 
* ధ‌ర కూడా అధికంగా ఉండ‌టం
* ఆంబ్రాన్స్ అనే బ్రాండ్ ఎవ‌రికీ తెలియ‌దు. పేప‌ర్ మీద ఈ ప్రొడ‌క్ట్ స్పెసిఫికేష‌న్లు బాగానే ఉన్నా.. ఇందులో చాలా స‌మ‌స్య‌లు ఉన్నాయి. త‌మ‌కు నాణ్య‌త లేని ప్రొడ‌క్టులు వ‌చ్చాయ‌ని చాలా మంది ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. 

2. Ambrane P-1111 10000mAH Power Bank

* రెండు యూఎస్‌బీ అవుట్‌పుట్ పోర్టులు
* 10000 ఎంఏహెచ్ బ్యాట‌రీ
* Apb లిథియం అయాన్ సెల్‌
* టార్చ్‌లైట్, indicative LEDs
* 299 గ్రాములు బ‌రువు

Cons
* కేవ‌లం ఒకే ఒక్క ఫాస్ట్ చార్జింగ్ అవుట్‌పుట్
* పూర్ క్వాలిటీ
* చాలా పెద్ద‌గా, బరువుగా ఉండ‌టం 
* ఎక్కువ సేపు చార్జింగ్ అవుతుంది. సుమారు రోజంతా చార్జింగ్‌ పెడితే గానీ ఇది పూర్త‌వ‌దు.
* కస్ట‌మ‌ర్ స‌పోర్ట్ బాగా లేక‌పోవ‌డం

3. Intex IT-PB11K 11000mAH Power Bank
* 11000 ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్థ్యం
* 308 గ్రాముల బ‌రువు ఉంటుంది
* రెండు ఫాస్ట్ చార్జింగ్ యూఎస్‌బీ పోర్టులు

Pros
* ఫాస్ట్ చార్జింగ్ ఇన్‌పుట్‌
* డీసెంట్ చార్జింగ్ స్పీడ్‌
* హై బ్యాట‌రీ కెపాసిటీ

Cons
* సులువుగా గీత‌లు ప‌డతాయి
* త్వ‌ర‌గా చార్జింగ్ అయిపోతుంది
* నాణ్య‌త స‌రిగ్గా లేక‌పోవ‌డం
* క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్ స‌రిగా ఉండ‌దు

ప‌వ‌ర్ బ్యాంక్‌ లెనోవో ఇన్‌టెక్స్‌ Intex IT-PBA 10K Poly 10000mAH Power Bank Lenovo PA13000mAH Power Bank Mi Li-Polymer Power Bank 2i Rock ITP106 13000mAH Power Bank బెస్ట్‌ వ‌ర‌స్ట్ ప‌వ‌ర్ బ్యాంక్స్‌