బెస్ట్ డిస్ప్లే ఉన్న స్మార్ట్ఫోన్ల లిస్ట్ తీస్తే అందులో శాంసంగ్ ఫోన్లు ముందు వరుసలో ఉంటాయి. వైబ్రంట్ కలర్స్, కర్వ్డ్ ఎడ్జెస్, అమోల్డ్ ప్యానల్స్.. ఇలా మార్కెట్లోకి వచ్చిన కొత్త ఫీచర్ ఏదైనా శాంసంగ్లో ది బెస్ట్గా ఉంటుంది. అందుకే ఇతర ఫోన్లతో పోల్చితే శాంసంగ్ డిస్ప్లే చాలా రిచ్గా కనిపిస్తుంది. అయితే డిస్ప్లే ఎంత క్వాలిటీగా ఉన్నా, స్క్రీన్ ఎంత కలర్ఫుల్గా ఉన్నా ఒక్కసారి కిందపడిందంటే ఇక దానిమీద ఆశ వదిలేసుకోవాల్సిందే కదా.. కానీ ఆ సమస్యను కూడా తీర్చేందుకు శాంసంగ్ రెడీ అయింది. కిందపడినా పగలని అన్బ్రేకబుల్ ఫ్లెక్సీ ఓఎల్ఈడీ ప్యానల్ను తీసుకురాబోతోంది.
మిలట్రీ స్టాండర్డ్స్తో తయారీ
ఈ అన్బ్రేకబుల్ డిస్ప్లే ఏకంగా మిలట్రీ స్టాండర్డ్స్తో తయారుచేశామని శాంసంగ్ ప్రకటించింది. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ సెట్ చేసిన ప్రమాణాల ప్రకారం పరీక్షలు చేశారు. ఫోర్టిఫైడ్ ప్లాస్టిక్ విండోతో తయారుచేసిన ఈ ప్యానల్ స్మార్ట్ఫోన్లకు అద్భుతంగా సరిపోతుంది. తేలికగా, పారదర్శకంగా ఉండి గ్లాస్లాగానే పనిచేస్తుంది. కానీ కిందపడినా పగలని ధృడత్వం ఈ డిస్ప్లే ప్రత్యేకత అని శాంసంగ్ ప్రకటించింది.
26సార్లు కింద పడేసినా నో డ్యామేజ్
ఆటోమొబైల్ కన్సోల్స్, చేత్తో తీసుకెళ్లగలిగే మిలట్రీ సామగ్రిలో వాడే ప్లాస్టిక్ను ఈ ప్యానల్లో వాడారు. ఇది కిందపడినా పగలకుండా ఉంటుందో లేదో ఏకంగా 26 సార్లు కిందపడేసి మరీ టెస్ట్ చేశారు.
* 1.2 మీటర్లు (దాదాపు నాలుగు అడుగుల) ఎత్తు నుంచి 26 సార్లు కింద పడేశారు. తర్వాత బాగా తక్కువ, బాగా ఎక్కువ ఉష్ణోగ్రతల మధ్య పరీక్షించారు.
* ఇంతచేసినా ప్యానల్ ముందు, వెనక, పక్కలు, ఆఖరికి ఎడ్జ్ల్లో కూడా ఎలాంటి డ్యామేజి జరగలేదు.
* చివరగా 1.8 మీటర్లు అంటే దాదాపు 6 అడుగుల ఎత్తు నుంచి కింద పడేశారు. ఇది యూఎస్ మిలట్రీ స్టాండర్డ్స్ కంటే ఎక్కువ. ఇంత ఎత్తులో నుంచి కింద పడేసినా ప్యానల్ చెక్కుచెదరలేదు.
అదొక్కటే సమస్య
అయితే ఈ విషయంలో శాంసంగ్ కంటే ముందు మోటో ఈ ప్రయోగాన్ని చేసింది. మోటో తన ఫోర్స్ సిరీస్లో తీసుకొచ్చిన ఫోన్లకు దాదాపు ఇలాంటి అన్బ్రేకబుల్ డిస్ప్లేనే తీసుకొచ్చింది. అది కింద పడేసినా పగలలేదు కానీ డిస్ప్లే మీద బాగా గీతలుపడ్డాయి. మరి శాంసంగ్ తీసుకొస్తామంటున్న అన్బ్రేకబుల్ డిస్ప్లేలో ఇలాంటి సమస్య వస్తుందా? వస్తే శాంసంగ్ దాన్ని ఎలా పరిష్కరిస్తుంది అనేది తేలాలి.
Samsung unbreakable Display Samsung Unbreakable Flexy OLED display శాంసంగౠఅనà±â€Œà°¬à±à°°à±‡à°•‌బà±à°²à± à°¡à°¿à°¸à±â€Œà°ªà±à°²à±‡ శాంసంగà±â€Œ à°…à°¨à±â€Œà°¬à±à°°à±‡à°•‌బà±à°²à± à°«à±à°²à±†à°•à±à°¸à±€ à°“à°Žà°²à±à°ˆà°¡à±€ à°ªà±à°¯à°¾à°¨â€Œà°²à±â€Œ కింద‌ప‌డినా ప‌గ‌ల‌ని ఫోనౠడిసà±â€Œà°ªà±à°²à±‡ Â