ఆగస్టుకు ఏమాత్రం తీసిపోకుండా సెప్టెంబరులో టాప్ మొబైల్ కంపెనీలన్నీ తమ కొత్త ప్రొడక్టులను విడుదల చేయబోతున్నాయి. షియామీ పోకో ఎఫ్1 నుంచి నోకియా 6.1 ప్లస్ వరకూ, రియల్మీ 2 నుంచి హానర్ ప్లే, నోట్ 9 వరకూ ఆగస్టులో సందడి చేశాయి. సెప్టెంబరులోనూ పోటీ మరింత తీవ్రంగా ఉండబోతోంది. ఐఫోన్, షియామి ఎంఐ 8, హానర్ 8ఎక్స్ వంటి మోడళ్లతో పాటు మరిన్ని విడుదల అవబోతున్నాయి. వీటిలో టాప్-8 ఫోన్స్ గురించి తెలుసుకుందాం!
యాపిల్ మూడు కొత్త ఫోన్లు
ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8 మోడల్స్కు కొనసాగింపుగా మూడు కొత్త ఫోన్లను యాపిల్ విడుదల చేయబోతోంది. వీటిలో ఐఫోన్ ఎక్స్ కంటే పెద్దది, బడ్జెట్ ఐఫోన్గా వ్యవహరించే కొత్త మోడల్.. ఐఫోన్ 8 ని రీప్లస్ చేస్తుందని భావిస్తున్నారు. ఐఫోన్ 9ని ఈసారి విడుదల చేయకపోవచ్చని తెలుస్తోంది. కొత్తగా విడుదలయ్యే మోడల్స్ అన్నీ.. ఐఫోన్ ఎక్స్కి కంటిన్యూగా రాబోతున్నాయి. వీటిని iPhone XS, iPhone XS Plus, 2018 iPhone Xగా మార్కెట్లోకి రావొచ్చు.
Xiaomi Mi 8
పోకో ఎఫ్1 మొబైల్ని ఆగస్టు చివరి వారంలో విడుదల చేసిన షియామీ.. సెప్టెంబరులోనూ జోరు కొనసాగించబోతోంది. కొత్త మోడల్ Mi 8ని భారత మార్కెట్లో సెప్టెంబరులో లాంచ్ చేయబోతోంది. ఇది పలు వేరియంట్లలో లభిస్తుంది. ఎస్డీ 710 ప్రాసెసర్ గల మోడల్ను భారత్లో విడుదల చేయాలని భావిస్తోంది. 6.2 అంగుళాల ఫుల్ హెచ్డీ నాచ్ డిస్ల్పేతో ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 845 చిప్సెట్తో వచ్చే ఈ మొబైల్ ధర రూ.30వేల కంటే తక్కువగా ఉండబోతోంది.
Honor 8X, 8X Max
హువాయ్ సబ్ బ్రాండ్ హానర్ సంస్థ.. హానర్ 7ఎక్స్ మోడల్కి కొనసాగింపుగా రెండు కొత్త మోడల్స్ను చైనాలో సెప్టెంబర్ 5న లాంచ్ చేస్తోంది. వీటిని భారత్లో సెప్టెంబర్ నెలాఖరు, అక్టోబర్ తొలి వారంలో విడుదల చేయబోతోంది. కొత్త లుక్లో ఈ 8ఎక్స్ మొబైల్ ఉండబోతోంది. మెరుగైన ప్రాసెసర్, వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్, అధిక బ్యాటరీ సామర్థ్యంతో పాటు, కెమెరా సిస్టమ్ వంటివన్నీ ఉన్నాయి. హానర్ 8ఎక్స్ లోనూ దాదాపు ఇవే ఫీచర్లు ఉండనున్నాయి. అంతేగాక ఈ మొబైల్స్ రూ.15వేల లోపే ఉంటాయని తెలుస్తోంది.
Vivo V11, V11 Pro
సెప్టెంబర్ 6న రెండు ఫోన్లను విడుదల చేస్తున్నట్లు వివో ఇప్పటికే ప్రకటించింది. వివో వి11, వి 11 ప్రోగా రాబోతున్న ఈ ఫోన్లు.. వాటర్ డ్రాప్ నాచ్తో ఉండబోతున్నాయి. ఒప్పో ఎఫ్9 ప్రో మోడల్ స్ఫూర్తితో వివో వీ11 ప్రో తీసుకొస్తున్నారు. ఇన్ డిస్ల్పే ఫింగర్ ప్రింట్ సెన్సర్, స్నాప్డ్రాగన్ 660 చిప్సెట్, డ్యుయల్ కెమెరా సెటప్తో ఈ రెండు మోడల్స్ రాబోతున్నాయి. 3,400 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 ఎంపీ కెమెరా ముందు భాగంలో అమర్చారు.
Nokia 8110 4G
ఈ ఏడాది మొదట్లో విడుదలై గుర్తింపు పొందిన మ్యాట్రిక్స్ బనానా ఫోన్.. దేశీయ మార్కెట్లో విడుదలకు నోకియా సిద్ధమైంది. Nokia 8110 4G ఫీచర్ ఫోన్.. ఆఫ్లైన్, ఆన్లైన్లో రూ.5వేల కంటే తక్కువకు లభించనుంది. ప్రస్తుతం ఈ ఫోన్.. అమెజాన్ ద్వారా దేశంలో అందుబాటులో ఉంది. కొన్ని గుర్తింపు లేని విక్రయ సంస్థలు రూ.6వేలకు విక్రయిస్తున్నాయి. స్లైడింగ్ కవర్ రూపంలో ఉండే ఈ నోకియా ఫీచర్ మొబైల్.. T9 keypad, 2.4 అంగుళాల డిస్ల్పే, స్నాప్ డ్రాగన్ 205 ప్రాసెసర్ ఉండనున్నాయి.
Xiaomi Mi MIX 3
వివో నెక్స్, ఒప్పో ఫైండ్ ఎక్స్లానే షియామి కూడా తన తొలి బెజల్ లెస్ స్మార్ట్ఫోన్ Mi MIX 3ని సెప్టెంబరులో విడుదల చేయనుంది. తొలుత ఈ ఫోన్ను షియామి చైనాలో లాంచ్ చేయనుంది. భారత్లో సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ తొలి వారంలో విడుదల చేయనుంది. జీరో బెజల్, వినో నెక్స్లానే పాప్ అప్ కెమెరా, ముందు భాగంలో డ్యుయెల్ కెమెరా, స్నాప్డ్రాగన్ 845 చిప్సెట్తో ఉండే ఈ ఫోన్ వైర్ లెస్ చార్జింగ్ను సపోర్ట్ చేస్తుందట.
Motorola P30
మోటోరోలా కూడా కొత్త మోడల్ పీ30ని సెప్టెంబరులో విడుదల చేయనుంది. 6.2 అంగుళాల ఫుల్ హెచ్డీ 19:9 నాచ్ డిస్ల్పే, స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్, డ్యుయల్ కెమెరా, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి మరిన్ని ఫీచర్లతో ఈ మోడల్ రాబోతోంది. దీని ధర సుమారు రూ.20 వేల వరకూ ఉండనుంది. ఈ ఫోన్ భారత్లో విడుదల చేయడంపై మోటోరోలా, లెనోవో అధికారికంగా ప్రకటించకపోయినా.. ఐఎఫ్ఏ-2018 ద్వారా అందుబాటులో ఉండొచ్చని తెలుస్తోంది.
Lenovo Z5
భారతీయ మార్కెట్లోకి మళ్లీ ప్రవేశించేందుకు లెనోవో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. చైనాలో జూన్లో విడుదల చేసిన మిడ్ రేంజ్ Z series ఫోన్లను.. లెనోవో Z5గా తీసుకురాబోతోంది. 6.2 అంగుళాల ఫుల్ హెచ్డీ 19:9 నాచ్ డిస్ల్పేతో, స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియోతో ఈ మొబైల్ ఉండనుంది. వెనుక డ్యుయెల్ కెమెరా సెటప్తో ఉండనుంది. వెనుక 16 ఎంపీ కెమెరా, ముందు భాగంలో గల 8 ఎంపీ కెమెరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేస్తుంది. ప్రస్తుతం చైనాలో 1299 యువాన్(రూ.13,500)లకు లభిస్తోంది.
Xiaomi Mi 8 Lenovo Z5 Motorola P30 Xiaomi Mi MIX 3 Nokia 8110 4G Vivo V11 V11 Pro Honor 8X 8X Max iPhone XS కొతà±à°¤ మొబైలà±à°¸à±â€Œ సెపà±à°Ÿà±†à°‚బ‌రà±â€Œà°²à±‹ విడà±à°¦â€Œà°² కానà±à°¨à±à°¨ ఫోనà±à°²à±