స‌రికొత్త ఓఎస్ Android Pie గురించి కొన్ని కీల‌క అంశాలు

ఆండ్రాయిడ్ స‌రికొత్త వెర్ష‌న్ Pie.. డెవ‌ల‌పర్‌ ప్రివ్యూని విడుద‌ల చేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆస‌క్తిగా ఈ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ గురించి ఎదురుచూస్తున్నారు. గూగుల్ పిక్స‌ల్ ఫోన్ల‌కు మాత్ర‌మే కొత్త వెర్ష‌న్ అందుబాటులోకి వ‌చ్చింది. ఇందులో కొత్త ఫీచ‌ర్లు ఏమేమి ఉన్నాయి? ఎలాంటి మార్పుల‌ను గూగుల్ చేసింది? అనే విష‌యాలు అంద‌రిలోనూ ఉత్సుక‌త క‌లిగిస్తున్నాయి. ఆల‌స్యం చేయ‌కుండా వీటి గురించి తెలుసుకుందాం! 

* ప్ర‌స్తుతం స్మార్ట్‌ఫోన్ల‌న్నీ నాచ్‌తో వ‌స్తున్నాయి. స్క్రీన్‌లో ఫోన్ స్పీక‌ర్‌, ముందు భాగంలో కెమెరాకు కొంత భాగం స్పేస్‌ ఉంటుంది. మీరు ఐఫోన్‌-ఎక్స్‌లో నాచ్‌ని గ‌మ‌నించారా?  ఇప్పుడు అలాంటి నాచ్‌కు త‌గిన‌ట్టుగా స్మార్ట్‌ఫోన్ల‌లో యాప్స్ స‌పోర్ట్ చేసేలా Android P లో `డిస్ల్పే క‌టౌట్‌` ఫీచ‌ర్ ఉంది. 

* మెసేజ్‌లు, మెయిల్స్‌ను ఓపెన్ చేయ‌కుండానే.. నోటిఫికేష‌న్ సెంట‌ర్ నుంచే రిప్లై ఇచ్చేలా `స్మార్ట్ రిప్లై` ఆప్ష‌న్ ఉంటుంది. టైప్ చేయ‌న‌వ‌స‌రంగా లేకుండా మెషిన్ లెర్నింగ్ అల్గారిథ‌మ్స్ ద్వారా కొన్ని జ‌వాబులు ముందుగానే వ‌స్తుంటాయి. దీని నుంచే మ‌నం స‌మాధానాలు పంపేయవ‌చ్చు. ఇవి మెసేజ్‌ టైప్ చేసే స‌మ‌యాన్ని త‌గ్గిస్తాయి. 

* ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రైనా ఫొటో పంపితే.. నోటిఫికేష‌న్‌లో ఇమేజ్ వ‌చ్చిన‌ట్టు తెలిసేదే త‌ప్ప ఏ ఫొటో పంపించారో చూసే అవకాశం ఉండేది కాదు. కానీ ఈ స‌రికొత్త ఓఎస్‌లో నోటిఫికేష‌న్ సెంట‌ర్‌నుంచే ఫొటోలు చూడొచ్చు. 

* బ్లాగ్‌లో చెప్ప‌ని సీక్రెట్ ఫీచ‌ర్ ఇది. మ‌నం ఫోన్‌లో ఏం టైప్ చేస్తున్నామో మ‌రింత స్ప‌ష్టంగా తెలిపేందుకు.. ఐఫోన్‌లో మాగ్నిఫయ‌ర్ టూల్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఏదైనా పదం లేదా వాక్యం మీద‌ కర్స‌ర్ ఉంచిన‌ప్పుడు.. దాని పైన పెద్ద‌గా అంటే జూమ్ చేసిన‌ట్లు ఆ ప‌దం క‌నిపిస్తుంది. 

* ఎక్కువ సైజ్ ఉన్న ఫొటోలు మ‌నం పంపించడంతో పాటు మ‌న‌కు వ‌చ్చిన వాటిని సేవ్ చేసుకుంటే ఫోన్‌లో ఎక్కువ స్థ‌లాన్ని ఆక్ర‌మించేస్తాయి. ప్ర‌స్తుతం దీనిని త‌గ్గించేందుకు హెచ్ఈఐఎఫ్ అనే ఇమేజ్ ఎన్‌కోడింగ్ సిస్ట‌మ్‌కు ఇది స‌పోర్ట్ చేస్తుంది. ప్ర‌స్తుతం ఇది ఆపిల్ ఐవోస్‌11లో ఉంది.  

* పాస్‌వ‌ర్డ్ ఆటోఫిల్ ఆప్ష‌న్ ఆండ్రాయిడ్‌లో ఉన్నా.. దీనిని మ‌రింత మెరుగ్గా కొత్త వెర్ష‌న్‌లో ఉప‌యోగించవ‌చ్చు. ఆన్‌లైన్ అప్లికేష‌న్లు, పాస్‌వ‌ర్డ్స్ వంటి వాటిలో ప్ర‌తిసారీ ఆప్ష‌న్లు టైప్ చేసే అవ‌స‌రం లేకుండా స‌మ‌యాన్ని త‌గ్గిస్తుంది. 

* సెట్టింగ్స్ పేజీని మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా రూపొందించారు. తెలుపు, నీలం రంగుల్లో క‌నిపించే ఈ పేజీ.. ఇప్పుడు మ‌రింత క‌ల‌ర్‌ఫుల్‌గా మారింది. అలాగే ఇప్ప‌టివ‌ర‌కూ వాల్యూమ్ బ‌ట‌న్స్ క్లిక్ చేస్తే.. స్క్రీన్‌పైన మ‌న‌కు వాల్యూమ్ ఐకాన్ అడ్డం(హారిజంట‌ల్‌)గా క‌నిపించేది. కానీ ఇప్పుడు నిలువు(వెర్టిక‌ల్‌)గా క‌నిపిస్తుంది.  

* ఫ్లాగ్ షిప్ మొబైల్స్‌లో ఒకేసారి ఫ్రంట్‌, బ్యాక్ కెమెరాను ఉప‌యోగించి ఫొటోలు తీసుకోవ‌చ్చు. ఇప్పుడు ఈ ఆండ్రాయిడ్ కొత్త వెర్ష‌న్‌లోనూ డ్యుయెల్ కెమెరాలను ఒకేసారి యూజ్ చేయ‌చ్చు. 

* ఏదైనా గ్రూప్ మెసేజ్ లేదా ఇండివిడ్యువ‌ల్ మెసేజ్‌లు అన్నీ నోటిఫికేష‌న్ ట్రేలో ఒకేచోట ఉండి కొంత గంద‌ర‌గోళానికి గురిచేస్తాయి. కానీ ఇప్పుడు మ‌రింత క్లారిటీతో ఎక్కువ సార్లు ట్యాప్ చేయాల్సిన అవ‌స‌రం లేకుండా చేస్తుంది. 

android pie new version of android features of android pie notch model