చైనా మొబైల్ మేకర్ లెనోవో మరో విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. ప్రపంచంలోనే తొలిసారిగా భారీ కెమెరాతో ఫోన్ ను రిలీజ్ చేయనుంది.జెడ్ సిరీస్‌లో భాగంగా అదిరిపోయే ఫీచర్లతో జెడ్6 ప్రొ పేరుతో లెనోవో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో లాంచ్ చేయనుంది. తన నూతన స్మార్ట్‌ఫోన్ జడ్6 ప్రొ లో 100 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు ఈ ఫోన్‌కు చెందిన ఓ ఇమేజ్ను ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ చాంగ్ చెంగ్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ ఫోన్లో 100 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ హైపర్ విజన్ కెమెరాతోపాటు, ఎలక్షన్ సందర్భంగా ఫేక్‌న్యూస్‌ను అడ్డుకునేందుకు తీసుకొచ్చిన ఫేస్బుక్ కొత్త టూల్, వాట్సాప్ డార్క్‌మోడ్ అథెంటిఫికేషన్ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు ఈ ఫోన్‌కు చెందిన ఓ ఇమేజ్ను, వీడియోను ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ చాంగ్ చెంగ్ మార్చి 27వ తేదీన చైనా సోషల్ మీడియా వైబోలో పోస్ట్ చేశారు.ఈ ఏడాది మొబైల్ వరల్డ్‌కాంగ్రెస్‌లో దీనిపై ప్రకటించిన సంస్థ జూన్ నెలలో మార్కెట్లలో తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఫీచర్లపై ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ, అంచనాలు ఇలా ఉన్నాయి. లెనోవో జడ్6 ప్రొలో 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్, స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్ తదితర అదిరిపోయే ఫీచర్లను అందిస్తున్నట్లు తెలిసింది. ఇక ఈ ఫోన్‌కు చెందిన పూర్తి స్థాయి స్పెసిఫికేషన్లను లెనోవో త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.
గతేడాది జడ్5 ప్రొ జీటీని విడుదల చేసిన విషయం విదితమే. ఇందులో స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్‌లను అందిస్తున్నారు. ఈ రెండు ఫీచర్లు కలిగిన ప్రపంచంలోని ఏకైక ఫోన్ ఇదే కావడం విశేషం. కాగా ఈ ఫోన్లో ఒకేసారి 50 యాప్స్‌ను ఓపెన్ చేసి ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్లో 6.39 ఇంచుల భారీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 16, 24 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉన్నాయి. ముందు భాగంలో 16, 8 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉండగా, వీటికి ఐఆర్ ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని అందిస్తున్నారు.
లెనోవో జడ్5 ప్రొ జీటీ ఫీచర్లు
6.39 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 6/8/12 జీబీ ర్యామ్, 128/256/512 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 16, 24 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్బీ టైప్ సి, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్సీ, 3350 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.
ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.27,780 ఉండగా, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.30,865గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.34,985, 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.45,280 ఉంది.
à°¨à±à°¯à±‚సౠటెకà±à°¨à°¾à°²à°œà±€ లెనోవో జడà±6 à°ªà±à°°à±Š చైనా ఇండియా లెనోవో లెనోవో జడà±5 à°ªà±à°°à±Š జీటీ