చైనా మొబైల్స్ మేకర్ షియోమీ తన నూతన ఎంఐ ఎల్ఈడీ టీవీ ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎ ప్రొ పేరిట 32 ఇంచుల ఎల్ఈడీ టీవీని షియోమీ అత్యంత తక్కువ ధరలో లాంచ్ చేసింది. ఇందులో 20 వాట్ల స్పీకర్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. గూగుల్ వాయిస్ సెర్చ్ ఫీచర్‌ను ఈ టీవీలో అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారంగా ఈ టీవీ పనిచేస్తుంది. ఇందులో 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, వైఫై, డీటీఎస్ వంటి ఫీచర్లు లభిస్తున్నాయి. ఇక ఈ టీవీని రూ.12,999 ధరకు విక్రయిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఎంఐ హోమ్ స్టోర్స్ లో మార్చి 7వ తేదీ నుంచి ఈ టీవీని విక్రయిస్తారు
ఎంఐ ఎల్‌ఈడీ 4ఏ ప్రో ఫీచర్లు
32 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
1366 x 768 పిక్సెల్స్ రిజల్యూషన్
1జీబీ ర్యామ్, 8ఈ ఎంఎంసీ స్టోరేజ్
లేటెస్ట్ అమ్లోజిక్ 64బిట్ ప్రాసెసర్ విత్ 7వ జనరేషన్ ఇమేజింగ్ ఇంజీన్
గూగుల్ అసిస్టెంట్, బ్లూ టూత్, ఎంఐ రిమోట్.
దీంతో పాటుగా ఇండియాలో నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7 ప్రొ, రెడ్‌మీ నోట్ 7ను రిలీజ్ చేసింది. రెడ్‌మీ నోట్ 7 ప్రొ స్మార్ట్‌ఫోన్ నెప్ట్యూన్ బ్లూ, నెబ్యులా రెడ్, స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.13,999 ధరకు, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.16,999 ధరకు లభ్యం కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్ సైట్‌తోపాటు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ ఫోన్లను మార్చి 13వ తేదీ నుంచి విక్రయిస్తారు.
రెడ్‌మీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్ ఆనిక్స్ బ్లాక్, రూబీ రెడ్, సఫైర్ బ్లూ కలర్ ఆప్షన్లలో విడులైంది. ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.9,999 ధరకు లభిస్తుండగా, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.11,999 ధరకు లభిస్తున్నది. ఈ ఫోన్‌ను ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్ సైట్‌లలో మార్చి 6వ తేదీ నుంచి విక్రయించనున్నారు. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన ఎయిర్‌టెల్ కస్టమర్లకు 1120 జీబీ 4జీ డేటా ఉచితంగా లభిస్తుంది.
రెడ్‌మీ నోట్ 7 ప్రొ ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లాగ్లాస్ 5 ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 48, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0.
రెడ్‌మీ నోట్ 7 ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 12, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0.
షియోమి రెడà±â€Œà°®à±€ నోటౠౠరెడà±â€Œà°®à±€ నోటౠ7 à°ªà±à°°à±Š à°Žà°‚à° à°Žà°²à±â€Œà°ˆà°¡à±€ 4à° à°ªà±à°°à±‹