4కే వీడియోల‌ను రికార్డ్ చేయ‌గ‌ల ఫోన్లు ఇవి

360p.. అవుట్ డేటెడ్ అయిపోయింది. 480p.. బోరు కొట్టేసింది.  720p.. కూడా పాత‌ది అయిపోయింది. 1080p.. అక్క‌డ‌క్క‌డా మాత్ర‌మే వినిపిస్తోంది. ఇప్పుడు అంద‌రికీ కావాల్సింద‌ల్లా 4కే రిజ‌ల్యూష‌న్‌తో వీడియోలు తీయ‌గ‌ల స్మార్ట్‌ఫోన్లు! ధ‌ర‌ ఎక్కువయినా కెమెరా క్వాలిటీకే ప్రాధాన్య‌మిస్తున్నారు స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు. వీరి అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగానే 4K వీడియో రికార్డింగ్‌ను స‌పోర్ట్ చేసేలా ఫోన్లు రూపొందిస్తున్నాయి. బ‌డ్జెట్ రూ.25వేల లోపు ఉండి, 4K వీడియో రికార్డింగ్ ఉన్న స్మార్ట్‌ఫోన్ మీ ఆప్ష‌న్ అయితే ఒక్క‌సారి ఇటు ఒక లుక్కేయండి! 

వివో వి9 (Vivo V9)
సెల్ఫీలంటే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే వారు వివో ఫోన్ల‌వైపు ఆక‌ర్షితుల‌వుతుంటారు. కెమెరా విష‌యంలో ఇప్ప‌టికీ పెద్ద కంపెనీల‌తో పోటీప‌డుతోంది వివో. ఇప్పుడు ఈ కంపెనీ నుంచి రాబోతున్న వి9 మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్ 4K (2160p) వ‌ర‌కూ వీడియో రికార్డింగ్‌ను స‌పోర్ట్ చేస్తుంది. సెక‌నుకి 30 ఫ్రేముల వ‌ర‌కూ ఇది రికార్డు చేస్తుంది. iPhone X తరహాలో notchని కలిగి ఉంటుంది. 6.3 అంగుళాల Full HD డిస్ల్పే గ‌ల ఈ స్మార్ట్‌ఫోన్‌.. వెనుక భాగంలో 16ఎంపీ+5ఎంపీ డ్యుయెల్ కెమెరాలు, ముందు భాగంలో 24 మెగా పిక్స‌ల్ కెమెరా ల‌భిస్తుంది. Snapdragon 626 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్ మీద ఈ ఫోన్ ర‌న్ అవుతుంది. Android 8.0 Oreo ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా తయారుచేసిన FunTouch OS 4.0తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 4GB RAM, 64GBతో ల‌భించే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 3,260 mAh బ్యాటరీ అమ‌ర్చారు. ఈ ఫోన్ ధ‌ర రూ.20,990. 

మోటో ఎక్స్‌4(Moto X4)
మోటో ఎక్స్‌4లో వెనుక భాగంలో f/2.0 aperture గ‌ల 12MP కెమెరా, f/2.2 aperture గ‌ల‌ 8MP గ‌ల డ్యుయెల్ కెమెరా  ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియో ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఆధారంగా ప‌నిచేస్తుంది. శ‌క్తిమంత‌మైన Qualcomm Snapdragon 630 ప్రాసెస‌ర్ ఇందులో ఉంటుంది. 3,000 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ గ‌ల ఈ ఫోన్‌ ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా అమ‌ర్చారు.  3GB RAM, 32GB స్టోరేజ్ గ‌ల మోడ‌ల్ Rs 20,999, 6GB RAM, 64GB స్టోరేజ్ మోడ‌ల్ Rs 24,999కి మార్కెట్‌లో ల‌భిస్తున్నాయి. 

హాన‌ర్ 8 ప్రో (Honor 8 Pro)
ఇందులోనూ సెకనుకు 30 ఫ్రేముల వ‌ర‌కూ 4K రిజ‌ల్యూష‌న్ వీడియోల‌ను రికార్డు చేయ‌చ్చు. 5.7-inch Quad HD డిస్ల్పే గ‌ల ఈ ఫోన్‌కి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొట‌క్ష‌న్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియో ఓస్‌తో ప‌నిచేస్తుంది. వెనుక భాగంలో 12MP + 12MP ఆటోఫోక‌స్‌, డ్యుయెల్ ఎల్ఈడీ ఫ్లాష్ కెమెరాలు ఉంటాయి. ముందుభాగంలో 1080p ఫుల్ హెచ్‌డీని స‌పోర్ట్ చేయ‌గ‌ల‌ f/2.0 apertureతో 8MP ఉంటుంది. 4,000mAh కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ గ‌ల ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. 4GB RAM and 128GB స్టోరేజ్ గ‌ల మోడ‌ల్ రూ.23,999కి ల‌భిస్తోంది.  మెమొరీ కార్డు కూడా వినియోగించుకోవ‌చ్చు. 

నోకియా 6.1 (Nokia 6.1)
2018లో విడుద‌లైన‌ నోకియా 6.1 కూడా 4K UHD వీడియోని రికార్డు చేస్తుంది. 5.5-inch full HD డిస్ల్పే గ‌ల ఈ ఫోన్‌ వెనుక భాగంలో డ్యుయల్ ఎల్ఈడీ ప్లాష్‌తో f/2.0 aperture గ‌ల 16MP కెమెరా ఉంటుంది. ముందు భాగంలో 1080p Full HD వీడియోలు తీయ‌గ‌ల 8MP సెల్ఫీ కెమెరా అమ‌ర్చారు. Qualcomm Snapdragon 630 ప్రాసెస‌ర్ మీద ప‌నిచేస్తుంది. 16:9 aspect ratio గ‌ల ఈ స్మార్ట్‌ఫోన్‌లో 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉంది. 4GB RAM, 64GB స్టోరేజీ గ‌ల ఈ ఫోన్ ధ‌ర రూ. 18,999. మెమొరీ కార్డు ద్వారా స్టోరీజ్ పెంచుకోవ‌చ్చు. 

మోటో జీ5ఎస్ ప్ల‌స్‌(Moto G5S Plus)
రూ.12,999 బ‌డ్జెట్‌లో 4K UHD వీడియోల‌ను రికార్డు చేసే బెస్ట్ స్మార్ట్ ఫోన్ మోటో జీ5ఎస్ ప్ల‌స్‌. వెనుక f/2.0 apertureతో 13MP + 13MP గ‌ల కెమెరాలు ఉంటాయి. ఆటోఫోక‌స్‌తో పాటు డ్యుయెల్ ఎల్ఈడీ ప్లాష్ స‌దుపాయం ఉంది. ముందు భాగంలో f/2.0 apertureతో 8MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5.5 అంగుళాల full HD స్క్రీన్ గ‌ల ఈ ఫోన్‌.. Qualcomm Snapdragon 625 ప్రాసెస‌ర్ ఆధారంగా ప‌నిచేస్తుంది. 4GB RAM, 64GB స్టోరేజీ గ‌ల ఈ ఫోన్ రూ.12,999కే ల‌భిస్తోంది. 3000 ఎంఏహెచ్ గ‌ల బ్యాటరీ ఇందులో అమ‌ర్చారు. 

4k recording videos best smart phones vivo v9 moto x honor nokia నోకియా స్మార్ట్ మొబైల్స్ 4 కె వీడియో వివో మోటో