4000 ఎంఏహెచ్ కంటే ఎక్కువ బ్యాట‌రీ ఉన్న ఫోన్లు ఇవీ

స్మార్ట్‌ఫోన్‌లో ఫీచ‌ర్లు పెరిగే కొద్దీ బ్యాట‌రీ వినియోగం కూడా భారీగా పెరిగిపోతోంది. అందుకే ఇప్పుడు 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ అంటే సాధార‌ణ‌మైపోయింది. 6 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్‌, 4జీబీ ర్యామ్‌తో న‌డిచే ఫోన్ల‌తో బ్యాట‌రీ ప‌ట్టుమ‌ని నాలుగైదు గంట‌లు కూడా న‌డిచే ప‌రిస్థితి లేదు. అందుకే ఇప్పుడు వ‌చ్చే పెద్ద ఫోన్ల‌కు 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ క‌చ్చితంగా అవ‌స‌ర‌మ‌వుతుంది. అలా 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీతో ఇటీవల వ‌చ్చిన స్మార్ట్‌ఫోన్ల లిస్ట్ చూద్దాం. 

శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 (Samsung Galaxy Note 9)
శాంసంగ్ గెలాక్సీ నోట్ సిరీస్‌లో కొత్త‌గా వ‌చ్చిన మోడ‌ల్ ఇది. 6జీబీ ర్యామ్ , 128 జీబీ స్టోరేజ్‌తో వ‌చ్చిన ఈ ఫోన్‌కు పెద్ద డిస్‌ప్లే కూడా ఉంది. దీంతో బ్యాట‌రీ బాగా అవ‌స‌ర‌మ‌వుతోంది. అందుకే 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీతో రిలీజ్ చేశారు. ధ‌ర 67,900.
నోట్‌9లో 8జీబీ ర్యామ్‌/ 512 జీబీ మెగా స్టోరేజ్‌తోనే మ‌రో వేరియంట్ కూడా ఉంది. దీని ధ‌ర 84,900

హువావే పీ 20 ప్రో (Huawei P20 Pro)
చైనీస్ బ్రాండ్ హువావే ఫ్లాగ్‌షిప్ మోడ‌ల్ హువావే పీ 20 ప్రో  కూడా శాంసంగ్ గెలాక్సీ నోట్ 9లాగే ఉంటుంది.  దీనిలో ట్రిపుల్ కెమెరా సెట‌ప్ ఉంది. 40 మెగాపిక్సెల్ ఆర్జీబీ సెన్స‌ర్‌, 20 ఎంపీ మోనో క్రోమ్ సెన్స‌ర్‌, 8 ఎంపీ టెలిఫోటో లెన్స్‌తో ఈ మూడు కెమెరాలుంటాయి. ఫ్రంట్ కెమ‌రా 24 మెగాపిక్సెల్స్‌.  కైరిన్ 970 ప్రాసెస‌ర్‌, 6 అంగుళాల ఓలెడ్ డిస్‌ప్లే, 6జీబీ ర్యామ్‌తో వ‌చ్చిన ఈ ఫోన్‌కు కూడా 4,000 ఎంఏహెచ్ బ్యాట‌రీ అమ‌ర్చారు.  ధ‌ర 64,999.

బ్లాక్‌బెర్రీ ఇవాల్వ్ ఎక్స్  (BlackBerry Evolve X)
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌,  64 బిట్ ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగ‌న్ ప్రాసెస‌ర్‌, ఆడ్రినో 512 జీపీయూ, 6జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఉన్న బ్లాక్‌బెర్రీ ఇవాల్వ్ ఎక్స్‌కు కూడా 4,000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉంది.  దీనిలో ఉన్న బ్లాక్‌బెర్రీ ప‌వ‌ర్ సెంట‌ర్ యాప్ ప‌వ‌ర్ యూసేజ్‌ను ఆప్టిమైజ్ చేస్తుంది. కాబ‌ట్టి మీకు బ్యాట‌రీ మరింత ఎక్కువ స‌మ‌య‌వం వ‌స్తుంది. 12 మెగాపిక్సెల్ డ్యూయ‌ల్ రియ‌ర్ కెమెరాలు, 13 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్న ఈ ఫోన్ ధ‌ర  34,990 రూపాయ‌లు

షియోమి రెడ్‌మీ నోట్ 5, నోట్ 5 ప్రో (Xiaomi Redmi Note 5 and Redmi Note 5 Pro)
ఇండియాలో లీడింగ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా వెలుగొందుతున్న షియోమి రెడ్‌మీ నోట్ 5 సిరీస్‌లో తీసుకొచ్చిన నోట్ 5, నోట్ 5 ప్రో కూడా 4,000 ఎంఏహెచ్ బ్యాట‌రీతోనే వ‌చ్చాయి. దీంతో బ్యాట‌రీని ఒక్క‌సారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే దాదాపు రోజున్న‌ర పాటు ఫోన్ న‌డుస్తుంది.  రెండు మోడ‌ల్స్ కూడా 5.99 అంగుళాల  ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో వ‌చ్చాయి.  నోట్ 5 క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్‌తో రిలీజ‌యింది. 12 ఎంపీ రియ‌ర్‌, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 3జీబీ ర్యామ్/ 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధ‌ర 9,999. 3జీబీ ర్యామ్‌/64 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్ ధ‌ర 11,999. 
నోట్ 5 ప్రో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 636 ప్రాసెస‌ర్‌తోనూ త‌యారు చేశారు. 12 ఎంపీ, 5 ఎంపీ రియ‌ర్ కెమెరాలు, సెల్ఫీల కోసం ఫ్రంట్ 20 ఎంపీ కెమెరా ఉన్నాయి. 4జీబీ ర్యామ్‌/ 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఉంది. ధ‌ర 14,999. 

ఆసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 (Asus Zenfone Max Pro M1)
గేమ్స్ , హెచ్‌డీ కంటెంట్ చూడ‌డం, సోష‌ల్ మీడియా బ్రౌజింగ్ మీ ఫేవ‌రెట్స్ అయితే ఆసుస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 మీకు మంచి ఆప్ష‌న్‌. 5.99 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ స్క్రీన్ ఉన్న ఈ ఫోన్లో 13 ఎంపీ, 5 ఎంపీ బ్యాక్ కెమెరాలు, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 3జీబీ ర్యామ్‌/ 32 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధ‌ర 10,999. 4జీబీ ర్యామ్‌/ 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఉన్న ఫోన్ ధ‌ర 12,999.

మోటో జీ 6 ప్లే (Moto G6 Play)
మోటోరోలా  రీసెంట్‌గా మిడ్ సెగ్మెంట్‌లో తీసుకొచ్చిన ఫోన్ మోటో జీ 6 ప్లే. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్‌ 430 ప్రాసెస‌ర్ మాత్ర‌మే ఉండ‌డంతో ఈ సెగ్మెంట్‌లో మిగ‌తా ఫోన్లంత ప‌వ‌ర్‌ఫుల్ పెర్‌ఫార్మెన్స్ ఉండదు. కానీ ఈ ఫోన్ కు కూడా 4,000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఇచ్చారు.  ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన 13 ఎంపీ బ్యాక్ కెమెరా,  సెల్ఫీ ఫ్లాష్‌తో ఉన్న 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా దీని ప్ర‌త్యేక‌త‌లు. 3జీబీ ర్యామ్‌/ 32 జీబీ స్టోరేజ్ ఉంది. ధ‌ర 11,999.

smartphones with 4 000mAh battery samsung galaxy note 9 huawei p20 pro xiaomi redmi note 5 xiaomi redmi note 5 pro moto g6 play blackberry evolve x asus zenfone max pro m1 xiaomi mi max 2 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉన్న స్మార్ట్ ఫోన్లు శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 హువావే పీ 20 ప్రో బ్లాక్‌బెర్రీ ఇవాల్వ్ ఎక్స్ ఆసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో à°Žà°‚1 షియోమి రెడ్‌మీ నోట్ 5  షియోమి రెడ్‌మీ నోట్ 5 ప్రో  మోటో జీ 6 ప్లేÂ