8జీబీ ర్యామ్ ఫోన్ల‌పై అంత మోజు ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న‌డానికి 9 కార‌ణాలు

మొబైల్ కొనాల‌నుకునే వారికి బ్యాక్‌ కెమెరా, ఫ్రంట్ సెల్ఫీ కెమెరా, ఇంట‌ర్న‌ల్ మెమొరీ, రెండు సిమ్ స్లాట్‌లు.. వంటి వాటితో పాటు ఇప్పుడు RAM కూడా కీల‌కంగా మారింది. 2 GB RAM కాలం చెల్లిపోయిన త‌ర్వాత‌.. 4 GB RAM ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌ల‌పైనే అంద‌రి దృష్టిప‌డింది. ప్ర‌స్తుతం కొన్ని మొబైల్ కంపెనీలు 6 GB ర్యామ్ ఫోన్లు విడుద‌ల చేస్తున్నా యి. ఇప్పుడిప్పుడే ఈ ఫోన్ల గురించి తెలుస్తుంటే.. OnePlus సంస్థ ఏకంగా 8 GB ర్యామ్ ఫోన్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. దీంతో 6 GB ఫోన్లు కొనాలా? లేదా 8 GB ఫోన్లు కొనాలా? అనే చ‌ర్చ మొద‌లైంది. అయితే 8 GB ర్యామ్‌ ఫోన్ల‌పై అంత మోజు ప‌డాల్సిన అవస‌రం లేదంటున్నారు నిపుణులు. ఎందుకు అలా అంటున్నారో తెలుసుకుందాం!! 

* గ‌త ఏడాది 6 GB RAM ఫోన్లు అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాయి. ఈ ఏడాది 8 GB RAM ఫోన్లపైనే చ‌ర్చ జ‌రుగుతోంది. `నా ద‌గ్గర 8 GB RAM ఫోన్ ఉంది` అని ఇత‌రుల‌కు గొప్ప‌గా చెప్పుకొని మురిసిపోయే వారికి ఈ హై ఎండ్‌ ఫోన్ న‌ప్పుతుంద‌ట‌. మ‌న‌కు అవ‌స‌రం లేని దానిని అంట‌గ‌ట్టేందుకు మొబైల్ కంపెనీలు ఉప‌యోగించే తెలివైన స్ట్రాట‌జీ. 
* స‌గ‌టు మొబైల్‌ వినియోగ‌దారులంద‌రూ త‌మ‌కున్న బ‌డ్జెట్‌లో పాట‌లు విన‌డానికి, సినిమాలు చూడ‌టానికి, గేమింగ్ కోసం, సోష‌ల్ మీడియా, ఇంట‌ర్నెట్ బ్రౌజింగ్‌కు ఏ ఫోన్ న‌ప్పుతుందో చూసుకుని కొనుక్కుంటారు. అందువ‌ల్ల‌ ఈ 8 GB RAM ఫోన్ల‌ గురించి వాళ్లు ఆలోచించే అవ‌కాశ‌మే లేదు. 
* ప్ర‌పంచంలోనే బెస్ట్ స్మార్ట్ ఫోన్లన్నీ 8 GB RAM కంటే తక్కువ ఉన్న‌వే! Apple iPhone X, iPhone 8 Plus, Samsung Galaxy S9+, Google Pixel ఇలా ఏ మోడ‌ల్ తీసుకున్నా 3GB లేదా 4 GB RAMతోనే ప‌నిచేస్తున్నాయి. 
* 8 GB RAM ఉంటే ఫోన్ అత్యంత వేగంగా ప‌నిచేస్తుందా? అంటే క‌చ్చితంగా చెప్ప‌లేం. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్ వేగంగా ప‌నిచేయ‌డమ‌నేది.. అందులో సాఫ్ట్‌వేర్‌పై ఆధారప‌డి ఉంటుంది. 
* ఒకే కంపెనీకి చెందిన రెండు ఫోన్ల‌లో.. ఒక‌టి 6GB RAM, మ‌రొకటి 8GB RAMతో ప‌నిచేస్తున్నాయ‌ని అనుకుందాం!  వాటిని రోజంతా వినియోగించినా స్పీడ్‌, ప‌నితీరు ఒకేలా ఉంటుంది. వీటి మ‌ధ్య వ్య‌త్యాసాన్ని గుర్తించ‌లేం!
* గేమింగ్ విష‌యంలోనూ చాలా వాద‌న‌లే ఉంటాయి. తక్కువ ర్యామ్ ఉంటే ఒక‌లా.. ఎక్కువ ర్యామ్ ఉంటే మ‌రోలా ప‌నిచేస్తాయ‌నే మాట వింటూనే ఉంటాం. త‌మ గేమ్‌ను ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేసుకోవాల‌నే ల‌క్ష్యంతో గేమ్స్‌ను డెవ‌ల‌ప‌ర్లు రూపొందిస్తారనే విష‌యాన్ని మ‌రిచిపోకూడ‌దు. ఇక‌ టాప్-10 ఆండ్రాయిడ్ గేమ్స్.. త‌క్కువ ర్యామ్‌ను వినియోగించుకునేలా త‌యారు చేసిన‌వే. 
* ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకునే ఏ యాప్ ప‌నిచేయ‌డానికీ 8GB RAM అవ‌స‌రం లేదు. వర్చువల్ రియాలిటీ(వీఆర్‌), ఆగ్మెంటెడ్ రియాలిటీ(ఏఆర్‌) వంటి యాప్స్‌తో పాటు MotoMods వంటి హార్డ్‌వేర్ మాడ్యూల్స్.. ఎటువంటి స‌మ‌స్య‌లు లేకుండా 4GB RAM మొబైల్స్ ప‌నిచేస్తాయి. 
* సాధార‌ణ ఫోన్లతో పోల్చితే 8 GB RAM ఉన్న స్మార్ట్‌ఫోన్ల ధ‌ర‌లు చాలా ఎక్కువ‌గా ఉంటాయి. 
* స్మార్ట్‌ఫోన్‌ని ఎంత కాలం ఉప‌యోగిస్తామో తెలియ‌దు! ఏడాదికో రెండేళ్లకో స్మార్ట్‌ఫోన్లు మార్చేస్తూ ఉంటాం. ఈ 8 GB RAM మొబైల్స్ ఫ్యూచ‌ర్ ప్రూఫ్ కావొచ్చు.  భ‌విష్య‌త్‌లో హెవీ గేమ్స్‌, యాప్స్ లాంచ్ అయిన‌ప్పుడు మాత్ర‌మే ఇది  ఉప‌యోగ‌ప‌డొచ్చు.

 

8gb ram smart phone 4gb ram one plus games performance 8 జీబీ ర్యామ్ స్మార్ట్ మొబైల్ గేమ్స్ 6 జీబీ ర్యామ్