మాస్క్ వేసుకోవాలి, పూలింగ్ ట్రిప్స్ అడ‌క్కూడ‌దు.. లాక్‌డౌన్ త‌ర్వాత ఉబెర్ ఇలా.. 

గ్రీన్‌, ఆరెంజ్ జోన్లలో క్యాబ్ స‌ర్వీసులు న‌డుపుకోవడానికి కేంద్ర ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా ఓకే అంటే క్యాబ్‌లు రోడ్డెక్కుతాయి. ఈ ప‌రిస్థితుల్లో క్యాబ్ అగ్రిగేట‌ర్ స‌ర్వీస్ అందిస్తోన్న ఉబెర్ , తాము ఇక‌పై క్యాబ్‌లు న‌డిపే విధానం మీద క‌స్ట‌మ‌ర్ల‌కు, డ్రైవ‌ర్ల‌కు కూడా క్లారిటీ ఇచ్చింది.  క‌రోనా వ్యాప్తిని నివారించేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు ఉబెర్ ప్ర‌క‌టించింది. ఇందుకు  ఏం చేయాలో త‌న యాప్ అప్‌డేట్‌లో వివ‌రంగా చెప్పింది.

ఫేస్ మాస్క్ లేకుంటే బ్లాక్ చేస్తారు
* డ్రైవ‌ర్‌, క్యాబ్‌లో వెళ్లే ప్ర‌యాణికులు త‌ప్న‌నిస‌రిగా మాస్క్ ధ‌రించాలి. ఒక వేళ ప్ర‌యాణికుడు మ‌ధ్య‌లో ఫేస్ మాస్క్ తీసేస్తే ఉబ‌ర్ డ్రైవ‌ర్ ఉబెర్ యాప్‌లో ఉండే నో ఫేస్ క‌వ‌ర్ ఆర్ మాస్క్ అనే ఆప్ష‌న్‌ను ఉప‌యోగించి డ్రైవ‌ర్ కంప్ల‌యింట్ చేయొచ్చు. ఇది  మ‌రోసారి రిపీట‌యితే ఆ క‌స్ట‌మ‌ర్‌ను ఉబెర్ స‌ర్వీసు వాడ‌కుండా కంపెనీ బ్లాక్ చేస్తుంది.

* డ్రైవ‌ర్ లేదా రైడ‌ర్ ఎవ‌రు ఫేస్ మాస్క్ వేసుకోక‌పోయినా రెండోవారు ఆ ట్రిప్‌ను క్యాన్సిల్ చేయొచ్చు

*  ప్ర‌తి ట్రిప్ పూర్త‌య్యాక డ్రైవ‌ర్ త‌న క్యాబ్‌ను శానిటైజ్ చేయాలి

* ఇండియాలోని ఉబెర్ డ్రైవ‌ర్ల కోసం 30 ల‌క్ష‌ల ఫేస్ మాస్క్‌లు, 12 ల‌క్ష‌ల ష‌వ‌ర్ క్యాప్స్‌, 2ల‌క్ష‌ల బాటిళ్ల క్రిమి సంహార‌కాలు, 2 ల‌క్ష‌ల సీసాల శానిటైజ‌ర్లు సిద్ధంగా ఉంచిన‌ట్లు ఉబెర్ ప్ర‌క‌టించింది.

* డ్రైవ‌ర్లు కావాలంటే పీపీఈ కిట్లు కూడా ఇస్తామ‌ని, కానీ దానికి డ‌బ్బులు డ్రైవ‌ర్లే చెల్లించాల‌ని చెప్పింది.

నో పూలింగ్ ప్లీజ్ 
* పూలింగ్ ట్రిప్స్ ఉండవని, ఇందుకు క‌స్ట‌మ‌ర్లు స‌హ‌క‌రించాల‌ని ఉబెర్ కోరింది.

* ఇండివిడ్యువ‌ల్ ట్రిప్స్‌కి మాత్రమే అనుమ‌తి. అది కూడా వెన‌క‌సీటులో ఇద్ద‌రికే అవ‌కాశం.

* వీలైనంత వ‌రకు డ్రైవ‌ర్ ప‌క్క సీటు ఖాళీగా ఉంచాల‌ని క‌స్ట‌మ‌ర్ల‌ను కోరింది. 

ఉబెర్‌ ఉబెర్ క‌రోనా రూల్స్‌ Uber Uber corona Safety measures