హెయిర్ కటింగ్ కెళ్తే ఆధార్ కార్డ్‌ జిరాక్స్, మొబైల్ నెంబ‌ర్ ఇవ్వాలా ?

ఏంటి సార్ క‌టింగా, ట్రిమ్మింగా? ఓకే .. మీ ఆధార్ కార్డ్ జెరాక్స్‌, మొబైల్ నెంబ‌ర్ కౌంట‌ర్‌లో ఇవ్వండి.. విన‌డానికి విచిత్రంగా అనిపిస్తున్నా త‌మిళ‌నాడులో ఇక‌పై ఇదే జ‌ర‌గ‌బోతోంది. దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌లో స‌డ‌లింపులు ఇచ్చిన కేంద్ర ప్ర‌భుత్వం 15 రోజుల కింద‌టే సెలూన్లు కూడా ఓపెన్ చేసుకోవ‌చ్చ‌ని గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. అయితే మాస్క్‌లు, శానిటైజ‌ర్లు వాడాల్సిందేన‌ని ఆదేశించింది. కొన్ని సెలూన్ల‌లో బార్బ‌ర్స్ పీపీఈ కిట్లు కూడా వేసుకుంటున్నారు.  

23వేల కేసుల‌తో త‌మిళ‌నాడు
అయితే త‌మిళ‌నాడులో ప‌రిస్థితి చాలా సీరియస్‌గా ఉంది. ఇప్ప‌టికే క‌రోనా పాజిటివ్ కేసులు 23 వేలు దాటాయి. రోజూ క‌నీసం ఓ వెయ్యి కేసులు కొత్త‌గా బ‌య‌ట‌ప‌డుతున్నాయి.ఇండియాలో మ‌హారాష్ట్ర త‌ర్వాత అత్యధిక క‌రోనా కేసులున్న‌ది త‌మిళ‌నాడులోనే. ఈ ప‌రిస్థితుల్లో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం సెలూన్లు తెర‌వ‌డానికి వెన‌కా ముందూ ఆలోచిస్తోంది. ఎందుకే ఇప్ప‌టికే సెలూన్లు తెరిచిన రాష్ట్రాల్లో సెలూన్ల‌లో క‌టింగ్ చేయించుకున్న‌వారిలోనూ క‌రోనా స్ప్రెడ్ అవ‌డ‌మే ఇందుకు కార‌ణం.

ఆధార్ ఉంటే గుర్తింపు ఈజీ
ఈ ప‌రిస్థితుల్లో ఇక సెలూన్లు తెర‌వాలంటే కేంద్రం చెప్పిన రూల్స్‌తోపాటు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం మ‌రో కొత్త రూల్ కూడా తెచ్చింది. సెలూన్‌లో క‌టింగ్‌కు వ‌చ్చేవాళ్లంతా వాళ్ల ఆధార్‌కార్డ్ జెరాక్స్‌, సెల్ నెంబ‌ర్ త‌ప్ప‌నిస‌రిగా అక్క‌డ ఇవ్వాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఒక‌వేళ ఎవ‌రికైనా క‌రోనా సోకినా మిగిలిన‌వారిని గుర్తించ‌డం సులువు అవుతుంద‌ని గ‌వ‌ర్న‌మెంట్ ఆలోచ‌న‌.  
వీటిని పాటించిన షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఉత్తర్వులో పేర్కొంది.  మొత్తం మీద టెక్నాల‌జీ ఇలా కూడా ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్న‌మాట‌.

ఆధార్ ఉంటేనే హెయిర్ క‌టింగ్‌ హెయిర్ క‌టింగ్‌కు ఆధార్