ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌లో నెట్‌వ‌ర్క్ సెట్టింగ్స్ రీసెట్ చేస్తే ఏమ‌వుతుంది?

ఆండ్రాయిడ్‌లో కానీ ఐవోఎస్‌లో కానీ మ‌న‌కు ఎదుర‌య్యే ఇబ్బందుల నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి ఎన్నో రీసెట్టింగ్స్ ఆప్ష‌న్లు అందుబాటులో ఉన్నాయి.  వీటి సాయంతో మ‌నం మొబైల్ ఫోన్ లేదా ట్యాబ్లెట్ల‌ను సులభంగా రీసెట్ చేయ‌చ్చు. ఫోన్ మొత్తం రీసెట్ చేయ‌కుండానే ఒక్కో విభాగాన్ని కూడా మ‌నం ప్ర‌క్షాళ‌న చేసుకోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు యాప్ ప్రిప‌రెన్సెస్‌, రీసెట్ లొకేష‌న్లు, ప్రైవ‌సీ లాంటి వాటిని మ‌నం విడివిడిగా రీసెట్ చేసుకోవ‌చ్చు. 

ఈ స‌మ‌స్య‌ల కోసం
సాధార‌ణంగా ఆండ్రాయిడ్ లేదా ఐవోఎస్‌ల‌లో  ఒకే ర‌క‌మైన స‌మ‌స్య‌లు చూస్తూ ఉంటాం. వైఫై స‌రిగా రాక‌పోవ‌డం లేదా బ్లూ టూత్ స‌రిగా ప‌ని చేయ‌క‌పోవ‌డం లాంటి స‌మ‌స్య‌లు ఈ రెండింట్లో కామ‌న్‌.  మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో వైఫై లేదా బ్లూ టూత్ స‌రిగా ప‌ని చేయ‌న‌ప్పుడు, సిగ్న‌ల్ అస్త‌మానం డ్రాప్ అవుతున్న‌ప్పుడు ఎవ‌రైనా రీసెట్టింగ్ చేయ‌మ‌ని చెబుతారు. మ‌రి ఆండ్రాయిడ్ రీసెట్ చేయాలంటే ఏం చేయాలి.

నెట్‌వ‌ర్క్ రీసెట్ అంటే..
నెట్‌వ‌ర్క్ రీసెట్ చేయ‌డం ద్వారా ఫోన్ లేదా ట్యాబెట్లను పూర్వ స్థితికి తీసుకు రావ‌డం అన్న‌మాట. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఒక కొత్త డివైజ్‌లో ఎలాంటి సెట్టింగ్స్ ఉంటాయో అలా మారిపోతాయ‌న్న మాట‌. మీకు ఒక కొత్త డివైజ్ ఫీలింగ్ రావాలంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫ్యాక్ట‌రీ రీసెట్ అనే ఆప్ష‌న్‌ను క్లిక్ చేయాలి.  అయితే ఈ రీసెట్ చేయ‌డం ద్వారా వైఫై నెట్‌వ‌ర్క్‌లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాయి. అంటే రీసెట్ అయిన త‌ర్వాత అంత‌కుముందు సేవ్ అయిన  వైఫై నెట్‌వ‌ర్క్స్ అన్నీ మాయ‌మైపోతాయి.  పాస్‌వ‌ర్డ్స్ కూడా క‌నిపించ‌వు. అంటే మీరు మ‌ళ్లీ అన్ని కొత్త‌గా  క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఐవోఎస్‌కు న‌యం 

ఐవోఎస్ యూజ‌ర్ల‌కు మాత్రం వైఫై పాస్‌వ‌ర్డ్‌లు ఐ క్లౌడ్ కీ చెయిన్‌లో సేవ అవుతాయి. మీరు రీసెట్స్ చేసినా అవి మాయం కావు.  అయితే మీ ఫోన్లో ఉన్న అంతా స‌మాచారం పోవాలంటే ముందుగా కీ చెయిన్‌ను ట‌ర్న్ ఆఫ్ చేసి ఆ త‌ర్వాత రీసెట్ చేస్తే చాలు. వైపై క‌నెక్ష‌న్ల‌తో పాటు బ్లూటూత్ క‌నెక్ష‌న్లు, సెల్యూల‌ర్ సెట్టింగ్స్ కూడా రీసెట్ ద్వారా మాయం అయిపోతాయి. 

Reset Network Settings Android iOS