యుఎస్‌బీ డ్రైవ్ వాడకం గురించి టెక్నాలజీ తెలిసిన వాళ్లకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా డేటాను కంప్యూటర్ నుంచి తీసుకోవాలన్నా లేదా డేటాను కంప్యూటర్లోకి ఎక్కించాలన్నా యుఎస్‌బీ డ్రైవ్ బాగా యూజ్ అవుతుంది. యుఎస్‌బీ డ్రైవ్ అనేది జస్ట్ ఒక ఎలక్ట్రానిక్ పరికరం మాత్రమే. కంప్యూటర్ దీనికి శక్తి ఇస్తేనే ఇది పని చేస్తుంది. ఈ యుఎస్‌బీ డ్రైవ్ పని చేయాలంటే కంప్యూటర్‌లో సరైన డ్రైవర్లు అవసరం.. అయితే మనం కంప్యూటర్‌కు యుఎస్‌బీ డ్రైవ్‌ను కనెక్ట్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేసి ఎజెక్ట్ చేసిన తర్వాతే తీయాలని అంటుంటారు. మరి నిజంగా మనం ఇలా డ్రైవ్‌ని ఎజెక్ట్ చేయాల్సిన అవసరం ఉందా?
ఎజెక్ట్ చేయకపోతే..
ఇప్పుడు వచ్చే లేటెస్ట్ కంప్యూటర్లకు మంచి డ్రైవర్లు ఉంటున్నాయి. ఒకప్పుడు పెన్ డ్రైవ్ పెట్టాలంటే చాలా ఇబ్బందిగా అనిపించేది.. అన్ని వైర్లను పక్కకి నెట్టుకుంటూ ఇబ్బందిగా పెట్టాల్సి వచ్చేది... కాన ఇప్పుడు దీనికి ప్రత్యేకమై స్లాట్ ఉంటుంది. పెన్ డ్రైవ్ పెట్టినప్పుడు కంప్యూటర్ మాస్టర్ బూట్ రికార్డ్, పార్టిషన్ బూస్ట్ రికార్డు లేదా డైరెక్టరీ స్ట్రక్చర్‌ని రీడ్ చేస్తుంది. ఇవన్నీ కొన్ని సెకన్లలోనే జరిగిపోతాయి. మీరు ఫైల్స్ రీడ్ చేస్తున్నప్పుడు కూడా మార్పులు జరుగుతూనే ఉంటాయి ఈ ఛేంజ్‌లు ఒక బ్యాచ్‌ల వారీగా జరుగుతాయి. డ్రైవ్‌లో ఏదైనా వైరస్ ఉన్నా మాల్‌వేర్ ఉన్నా కూడా ఇది వెంటనే యూజర్లను వార్న్ చేస్తుంది.
ఏం జరుగుతుంది?
మనం యుఎస్‌బీ డ్రైవ్ పెట్టాం కానీ ఎజెక్ట్ చేయకుండా నేరుగా తీసేశాం అనుకోండి చాలా ఇబ్బందులే ఎదురువుతాయి. ఎలా అంటే కంప్యూటర్‌ని డైరెక్ట్‌గా స్విచ్ ఆఫ్ చేస్తే ఏం జరుగుతుందో ఇదీ అంతే! యుఎస్‌బీ డ్రైవ్ హార్డ్‌వేర్. దీన్ని కంప్యూటర్‌తో అనుసంధానించడం వల్ల దీని నుంచి కంప్యూటర్‌కు ఏదైనా వైరస్‌లు పాకొచ్చు. లేదా కంప్యూటర్ నుంచి ఏదైనా మాల్‌వేర్ యుఎస్‌బీలోకి దూరొచ్చు. ఎందుకంటే మనం నిరంతరం ఆన్‌లైన్‌లోనే ఉంటాం. దీని వల్ల హ్యాకర్లు ఈ యుఎస్‌బీ డ్రైవ్‌లను ఒక టూల్‌గా చేసుకునే అవకాశం ఉంది. మనం ఎజెక్ట్ చేసి తీయడం వల్ల ప్రాసెస్‌లు అన్ని సక్రమంగా జరుగుతాయి. ప్రతి యూనిట్ పని అది చేసుకుంటూ వెళుతుంది. అదే ఎజెక్ట్ చేయకపోవడం వల్ల మన డ్రైవ్‌లోకి ఏదైనా వైరస్ ఉన్నా కూడా మనకు తెలియదు ఇలాంటిప్పుడు మీ విలువైన ఫైల్స్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
Eject USB Drive Removing mallware