ఫోన్‌ను మరింత క్రియేటివ్‌గా మార్చుకోవాలని ప్రతి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ అనుకుంటూ ఉంటాడు. ఇందులో భాగంగా స్క్రీన్ మీద కనిపించే వాల్‌పేపర్ ని మార్చేస్తుంటారు. అయితే ఇలా ప్రతీసారి మార్చడం కుదరకపోవచ్చు. అయితే మీరు ఒకసారి మారిస్తే దానికదే ఆటోమేటిగ్గా మారిపోయేలా మనం సెట్ చేసుకోవచ్చు. వాల్‌పేపర్స్ గంటగంటకి మీ ఫోన్ పై స్ర్కీన్ ఛేంజ్ అవుతున్నట్లయితే, ఎప్పుడు చూసినా మీ ఫోన్ ఫ్రెష్ లుక్‌లోనే కనిపిస్తుంది. ఫోన్ వాల్‌పేపర్స్ షెడ్యూల్ టైమ్‌లో మారిపోయే విధంగా మీ ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన వాల్ పేపర్‌లను వరస క్రమంలో సెట్ చేసుకుని వాటిని స్ర్కీన్ పై ర్యాండమైజ్ చేసుకునేందుకు అనేక ప్రొసీజర్స్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి.
ఇందుకోసం మీరు ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి Wallpaper Changer అనే అప్లికేషన్‌ను, మీ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి.
ఇన్ స్టాలేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత యాప్‌ను మీ డివైస్‌లో లాంచ్ చేయండి. యాప్ ఓపెన్ అయిన తరువాత యాప్ పేజీకి సంబంధించిన డిస్‌ప్లే పై కనిపించే red barను క్లిక్ చేయటం ద్వారా live wallpaper feature ఎనేబుల్ అవుతుంది.
ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. వాటిలో మొదటి ఆప్షన్ ద్వారా వాల్‌పేపర్ ప్రతి 30 నిమిషాలు లేదు ప్రతి 60 నిమిషాలకు మారిపోయే విధంగా టైం ఇంటర్వెల్‌ను సెట్ చేసుకోవచ్చు. ఇక రెండవ ఆప్షన్‌లో భాగంగా లాక్ స్ర్కీన్ పై మారే వాల్‌పేపర్ లను కాన్ఫిగర్ చేసుకోవచ్చు.
ఈ రెండు ఆప్షన్‌లను మీ అభిరుచులకు అనుగుణంగా కస్టమైజ్ చేసుకున్న తరువాత యాప్ స్ర్కీన్ పై ఎడమ వైపు నుంచి కుడి వైపుకు స్వైప్ చేయటం ద్వారా కొన్ని సెక్షన్స్ మీకు కనిపిస్తాయి. వాటిలో album సెక్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే మీకు నచ్చిన ఫోటోలను సెలక్ట్ చేసుకునే వీలుంటుంది. ఇవే ఆండ్రాయిడ్ వాల్ పేపర్స్‌లా మారిపోతాయి. ఇప్పుడు యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి వాల్ పేపర్స్ సైజ్ అలానే అప్పీరియన్స్‌ను, మీకు నచ్చినట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి SB Wallpaper Changer అనే అప్లికేషన్‌ను, మీ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత యాప్‌ను మీ డివైస్‌లో లాంచ్ చేయండి.
వాలà±â€Œà°ªà±‡à°ªà°°à± ఆండà±à°°à°¾à°¯à°¿à°¡à± à°¸à±à°®à°¾à°°à±à°Ÿà±â€Œà°«à±‹à°¨à± à°¸à±à°•à±à°°à±€à°¨à± మొబైలà±à°¸à± మొబైలౠసà±à°•à±à°°à±€à°¨à±