ఈ ఏడు టిప్స్ ఫాలో అయితే మీరే లూడో కింగ్! 

లాక్‌డౌన్‌తో  అందరూ ఇప్పుడు ఇండోర్ గేమ్స్ మీద పడ్డారు. అష్టాచ‌మ్మా, వైకుంఠ‌పాళీకి మ‌ళ్లీ మంచిరోజులొచ్చాయి. అయితే స్మార్ట్ ఫోన్‌ వదలలేని వాళ్లు గేమ్స్ కూడా ఫోన్‌లోనే ఆడుతున్నారు. అయితే వీటిలో కూడా లూడో (అష్టా చ‌మ్మా), స్నేక్ అండ్ ల్యాడ‌ర్ (అష్టాచ‌మ్మా)నే ఎక్కువ మంది ఆడుతుండ‌టం విశేషంగానే చెప్పుకోవాలి. ఇక‌పోతే లాక్‌డౌన్‌లో ఆన్‌లైన్‌లో బాగా పాపులరైన గేమ్ లూడో కింగ్.  దీంతో ఎక్కడో ఉన్న ఫ్రెండ్స్, రిలేటివ్స్, తెలియని వ్యక్తులతో కూడా ఆన్‌లైన్‌లో ఆడొచ్చు. అయితే ఇలా ఆన్లైన్లో లూడో కింగ్ ఆడేటప్పుడు ఈ టిప్స్ పాటిస్తే మీరు ఆన్‌లైన్ లూడో కింగ్‌లో మీరే కింగ్ కావ‌చ్చు. 

లూడో కింగ్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లతోపాటు  డెస్క్‌టాప్ వెర్షన్ గానూ అందుబాటులో ఉంది. ఆఫ్‌లైన్‌లో కూడా ఆడుకోవచ్చు. కాబట్టి డేటా అయిపోతే మీరు మీ స్మార్ట్‌ఫోన్‌నే లూడో బోర్డ్‌గా మార్చి ఇంట్లో వాళ్ళతో అడ్డుకోవచ్చు.  

1. ఫ్రీ కాయిన్స్ కలెక్ట్ చేయండి  
గేమింగ్ యాప్ లో కాయిన్స్ చాలా కీలకం. నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాలన్నా,  కొత్త థీమ్స్ పొందాలన్నా కాయిన్స్ చాలా అవసరం. అందుకే ప్రతి కాయిన్ కలెక్ట్ చేయండి. డైలీ రివార్డ్స్, గేమ్ విన్నింగ్ పాయింట్స్ అన్నీ మీకు రివార్డ్ పాయింట్స్ రూపంలో వస్తాయి. వాటన్నింటినీ కలెక్ట్ చేస్కోండి.  

2. బెట్ తక్కువగా పెట్టుకోండి 
లాక్ డౌన్ ఎప్పటివరకు వుంటుందో తెలియదు. అందుకని మీరు లాక్ డౌన్ ఉన్నంత వరకు లూడో ద‌ర్జాగా ఆడాలంటే బెట్టింగ్‌కు త‌క్కువ కాయిన్సే పెట్టుకోండి.ఒకేసారి రెండు, మూడువేల కాయిన్స్ పెట్టేసుకుంటే అవిపోతే ఆట ఉత్త‌గా ఆడాలి. అప్పుడు అంత ‌మ‌జా ఉండ‌దు.

3. అన్ని కాయిన్స్ విడిపించేసుకోండి
ఆరు వేస్తేనే మీకు కాయిన్ రిలీజ‌వుతుంది. అందుకే ముందు ఆరు ప‌డ‌గానే ఓ కాయిన్ రిలీజ్ చేసుకోండి. లేక‌పోతే ఆరు ప‌డినా ఒకే కాయిన్‌ను ర‌న్ చేస్తూ వెళితే ఒక‌వేళ ఆ కాయిన్ లాస్ అయితే మీకు ఆడ‌టానికి ఏమీ ఉండ‌దు. మీ పోత‌ల‌న్నీ వేస్ట‌వుతాయి. 

4. బోర్డంతా మీ కాయిన్స్ ఉండాలి
మీ కాయిన్స్‌ను బోర్డులో వీలైనంత ఎక్కువ స్ప్రెడ్ చేయండి.  అవ‌త‌లి ప‌ర్స‌న్స్‌కి మీ కాయిన్ చంప‌డానికి అవ‌కాశం లేనిచోట పెట్టి వాళ్ల‌కోసం కాచుకుని కూర్చోవాలి.  

5. పండిపోతే ఇంకో ఛాన్స్‌
మీ కాయిన్ టార్గెట్ రీచ్ అయితే అదేనండీ పండిపోతే మీకు ఓ బోన‌స్ మూవ్ వ‌స్తుంది.  కాబ‌ట్టి దాన్ని బాగా ఉప‌యోగించుకోండి. 

6.మూవ్ కోల్పోకండి
ఆడేది ఆన్‌లైన్‌లో కాబ‌ట్టి మీరు ఏ టీవీ చూస్తూనే వేరే ఫోన్ మాట్లాడుతూనో  ఆడుతుంటారు. కానీ డైస్ వేయ‌డానికి మీకు సిస్ట‌మ్ ‌కొంత టైమ్ ఇస్తుంది. ఆ లోగా మీరు వేయ‌లేక‌పోతే ఆ ఛాన్స్ పోయిన‌ట్లే. అలా ర‌న్ అవుట్ ఆఫ్ ద మూవ్ అయితే మీ ఆట స్వ‌రూప‌మే మారిపోతుంది   

7. బోర్ కొడితే ఆట మార్చండి
అస్త‌మానూ లూడో కింగ్ ఆడి బోర్ కొడుతోందా. ఇదే యాప్‌లో స్నేక్ అండ్ ల్యాడ‌ర్‌, లక్కీ 7 లాంటి ఇత‌ర గేమ్స్ కూడా ఉన్నాయి.జ‌స్ట్ ఫ‌ర్ చేంజ్ మ‌ధ్య‌మ‌ధ్య‌లో అవీ ఆడండి.  

Ludo king online games ludo king tips లూడో కింగ్‌ లూడో కింగ్ యాప్ లూడో కింగ్ టిప్స్‌ ఆన్‌లైన్ గేమ్స్‌ లాక్‌డౌన్ ఇండోర్ గేమ్స్‌