ఈ దీపావళి ఫోటోలు పర్‌ఫెక్ట్‌గా రావ‌డానికి సింపుల్‌ ట్రిక్స్‌

స్మార్ట్ ఫోన్ వ‌చ్చాక ఫోటోలు తీయ‌డానికి పెద్ద నైపుణ్యం అక్క‌ర్లేద‌ని అంద‌రికీ అర్ధ‌మైంది.  పైగా ఇప్పుడు భారీ మెగాపిక్సెల్ కెమెరాల‌తో  ఉన్న స్మార్ట్‌ఫోన్లు కూడా అంద‌రికీ అందుబాటు ధ‌ర‌ల్లోకి వ‌చ్చాయి. దీంతో ఎవ‌రికి న‌చ్చిన సీన్‌ను వారు క్లిక్‌మ‌నిపిస్తున్నారు. ఇక వెలుగుల పండ‌గ దీపావ‌ళి రోజున దీపాల అందాల‌ను, వాటిలో మెరిసిపోయే మీ ఫ్యామిలీ ఫోటోలు తీయాల‌ని మీకు అనిపిస్తే ఈ ప‌ర్‌ఫెక్ట్ ఫోటో ట్రిక్స్ మీకోస‌మే..


ట్రైపాడ్ లేదా సెల్ఫ్ టైమ‌ర్ పెట్టుకోండి
దీపాల‌ను, వాటి వెలుగును క్యాప్చ‌ర్ చేయ‌డం కొద్దిగా క‌ష్ట‌మే. మామూలుగానే దీపం గాలికి కొద్దిగా షేక్ అవుతున్న‌ట్లు ఉంటుంది. మీ చేయి ఏమాత్రం క‌దిలినా ఫోటో బ్ల‌ర్ అయిపోతుంది. అందుకే ట్రైప్యాడ్ ఉప‌యోగించి ఫోటో తీయండి లేదంటే సెల్ఫ్ టైమ‌ర్ పెట్టుకుని ఫోన్ లేదా కెమెరాను స్ట‌డీగా పెడితే మీకు మంచి ఫోటో వ‌స్తుంది. 

నైట్‌మోడ్‌ను వాడుకోండి
మీ ఫోన్ లేదా కెమెరాలోని నైట్ మోడ్ ఫీచ‌ర్‌ను ఉపయోగించి  ఫోటో తీస్తే ష‌ట్ట‌ర్ స్పీడ్ ఆటోమేటిగ్గా త‌గ్గుతుంది. దీంతో మీరు ఎక్కువ  వెలుగును క్యాప్చ‌ర్ చేయొచ్చు.

ఎక్కువ జూమ్ చేయకండి
ఫోటో తీసేటప్పుడు అతిగా జూమ్ చేయకండి. ఇలా చేస్తే ఇమేజ్ రిజ‌ల్యూష‌న్ త‌గ్గివ‌పోతుంది. అది చివ‌రికి పిక్ క్వాలిటీని దెబ్బ తీస్తుంది.

ఎక్స్‌పోజ‌ర్ త‌గ్గించండి
క్లియ‌ర్, క్రిస్ప్ పిక్స్ కావాలంటే ఎక్స్‌పోజ‌ర్‌ను మాన్యువ‌ల్‌గా త‌గ్గించుకోండి
కొద్దిగా వార్మ్ ఫోటోలు దీపావ‌ళి లైటింగ్‌ను బాగా క‌వ‌ర్ చేస్తాయి. మాన్యువ‌ల్ లేదా ప్రో మోడ్‌ను వాడుకుని కల‌ర్ టెంప‌రేచ‌ర్, ఎక్స్‌పోజ‌ర్‌ను త‌గ్గిస్తే మంచి ఫోటోలు వ‌స్తాయి.

వైడ్ యాంగిల్ లెన్స్‌తో సెల్పీలు
దివాళీ వెలుగుల‌తో మీ సెల్ఫీలను మెరిపించాల‌నుకుంటున్నారా?  వైడ్ యాంగిల్ లెన్స్‌తో ఫోటో తీస్తే బాగా వ‌స్తుంది. అలాగే వైడ్ యాంగిల్‌తో ఫోటోలు తీస్తే సాధ్య‌మైనంత ఎక్కువ స్పేస్‌ను కవ‌ర్ చేయొచ్చు. దీంతో ఎక్కువ దీపాలు, ఎక్కువ మంది జ‌నాలతోబా ఫోటోకు మంచి రిచ్ లుక్ వ‌స్తుంది. 

గ్రూప్ ఫోటోల‌కు సెమీ స‌ర్క్యుల‌ర్‌
దీపావ‌ళికి ఫ్రెండ్స్‌, ఫ్యామిలీతో గ్రూప్ ఫోటోలు తీసుకుంటున్నారా?  జ‌నం ఎక్కువైతే అర్ధ వృత్తాకారంలో నిల‌బ‌డండి. అప్పుడు
ఎక్కువ మందిని క‌వ‌ర్ చేయ‌డానికి మరీ దూరం నుంచి ఫోటో తీయ‌క్క‌ర్లేదు. 

ల్యాండ్ స్కేప్ మోడ్‌
ఫోటో ఫ్రేమ్ మ‌రింత వైడ్‌గా ఉంటే మంచి ఫోటో వ‌స్తుంది. అందుకోసం ల్యాండ్ స్కేప్ మోడ్ వాడుకోండి.

దీపాల్ని బ్యాక్‌గ్రౌండ్‌గా వాడుకోండి
దీపాన్ని లేదా సీరియ‌ల్ లైటింగ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌గా వాడుకుంటే మీకు అదిరిపోయే ఫోటో వ‌స్తుంది. 

పోట్రెయిట్ మోడ్‌
మంచి క్యాండిడ్ షాట్స్ లేదా సెల్ఫీ కావాలంటే బ్యాక్‌గ్రౌండ్ బొకే ఎఫెక్ట్ కావాలంటే పోట్రెయిట్ మోడ్ ఆన్ చేయండి.

లైవ్ వీడియోకి ట్రైప్యాడ్‌తో ట్రై చేయండి
మీరు మీ మూమెంట్స్‌ను వీడియో తీసుకోవాల‌నుకుంటే ఫోన్‌లో ఉన్న బిల్ట్ ఇన్ స్టెబిలైజేష‌న్ మోడ్ వాడుకోండి. లేదంటే ట్రైప్యాడ్ వాడండి. అప్పుడు మీ వీడియో షేక్ కాకుండా క్వాలిటీగా వ‌స్తుంది. 

బాణ‌సంచా ఫోటో తీయాలా?
బాణ‌సంచా ఫోటో తీయాలంటే ఆ వెలుగుల‌ను అందంగా క్యాప్చ‌ర్ చేయాలంటే మాత్రం కాస్త ఓపిక కావాలి. స్లో మోష‌న్ వీడియోలు తీస్తే బాగా వ‌స్తుంది. ఇవ‌న్నీ ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అంద‌రికంటే మీ దీపావళి ఫోటోలు బాగా వ‌స్తాయి. 


 

Capture excellent photos in this Diwali Diwali photos దీపావ‌ళికి స్మార్ట్‌ఫోన్‌తో సూప‌ర్ ఫోటోలు నైట్ మోడ్‌ వైడ్ యాంగిల్ లెన్స్‌ Â