యూట్యూబ్లో రన్నవుతున్న వీడియోను అక్కడే ఆపాలంటే పాజ్ బటన్ నొక్కుతాం. అలా కాకుండా కేవలం మీ కంటి చూపుతో వీడియోను పాజ్ చేయగలరా? మంత్రమేసినట్లు అక్కడే ఆపగలరా? దానికో ట్రిక్ ఉంది. అది ఎలాగో చూడండి
ఫేస్ పాజ్ క్రోమ్ ఎక్స్టెన్షన్
ఫేస్పాజ్ అనే క్రోమ్ ఎక్స్టెన్షన్ ఉపయోగించి మీ కంటిచూపుతో యూట్యూబ్ వీడియోను పాజ్ చేయొచ్చు. అయితే ఇందుకోసం మీ పీసీ లేదా ల్యాప్ట్యాప్కు వెబ్కామ్ ఉండాలి. మీరు యూట్యూబ్ వీడియో వైపు చూడగానే ఇది మీ ఫేస్ను డిటెక్ట్ చేస్తుంది. మీ ఫేస్ మ్యాచ్ కాగానే వెంటనే వీడియో ఆగిపోతుంది. అయితే మీ ఫేస్ను సరిగ్గా ఐడెంటిఫై చేయాలంటే వెబ్కామ్ క్వాలిటీది అయి ఉండాలి.
ఎలా పనిచేస్తుందంటే..
1. క్రోమ్ వెబ్స్టోర్ నుంచి ఫేస్పాజ్ అనే ఫ్రీ ఎక్స్టెన్షన్ను డౌన్లోడ్ చేయండి. దీన్ని ఇన్స్టాల్ చేయగానే క్రోమ్ బ్రౌజర్లోని ఓమ్నిబాక్స్ పక్కన పర్పుల్ కలర్లో స్మైలీ కనిపిస్తుంది.
2. యూట్యూబ్లోకి వెళ్లి ఏదైనా వీడియో ఓపెన్ చేయండి.
3. ఇప్పుడు కింద కుడివైపున To use Facedetector API, Enable Experimental Web Platform features in Chrome here అనే మెసేజ్ కనిపిస్తుంది. దీనిలో hereని క్లిక్ చేయగానే క్రోమ్ ఫ్లాగ్ పేజెస్ ఓపెన్ అవుతాయి.
4. ఇక్కడ Experimental Web Platform features ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని అనేబుల్ చేసి క్రోమ్ బ్రౌజర్ను రీలాంచ్ చేయాలి.
5. ఇప్పుడు మళ్లీ యూట్యూబ్లోకి వెళ్లి వీడియో ఓపెన్ చేయండి. ఇప్పుడు కింద భాగంలో ఫేస్ ప్లే అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్నిటర్న్ ఆన్ చేస్తే ఫేస్ పాజ్ యాక్టివేట్ అవుతుంది. ఒక్కసారి మీరు పర్మిషన్ ఇస్తే ఓ చిన్న విండో ఓపెన్ అవుతుంది. మీరు యూట్యూబ్ వీడియో వైపు చూడగానే అందులో మీ ఫేస్ కనిపిస్తుంది. ఫేస్ డిటెక్ట్అయి వీడియో ఆటోమేటిగ్గా పాజ్ అయిపోతుంది.
 FacePause Chrome Extension Automatically Pause YouTube Videos When You Look Away కంటిచూపà±à°¤à±‹ యూటà±à°¯à±‚బౠవీడియోనౠపాజౠచేయ‌డం ఫేసà±â€Œà°ªà°¾à°œà± à°•à±à°°à±‹à°®à± à°Žà°•à±à°¸à±â€Œà°Ÿà±†à°¨à±à°·â€Œà°¨à±â€Œ