గూగుల్ ప్లే స‌ర్వీసులు అప్‌డేట్ కావ‌ట్లేదా? మ‌రి ఈ స‌మ‌స్య‌ను ఫిక్స్ చేయ‌డం ఎలా?

స్మార్ట్‌ఫోన్లు వ‌చ్చిన త‌ర్వాత మ‌న జీవితాలు చాలా వేగం అందుకున్నాయి. ప్ర‌తి చిన్న విష‌యాల‌కు స్మార్ట్‌ఫోన్లు వాడ‌డం చాలా కామ‌న్ అయిపోయింది. ప్ర‌తి ప‌ని చేసుకోవ‌డానికి ఎన్నో యాప్‌లు మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్‌ల‌ను మెయిన్‌టెన్ చేయ‌డానికి గూగుల్ ప్లే స‌ర్వీసు కీల‌క‌పాత్ర పోషిస్తుంది. యాప్‌లు అప్‌డేట్ అయిన‌ప్పుడల్లా ఇది మ‌న‌కు మెసేజ్ పంపిస్తుంది. మ‌రి గూగుల్ ప్లే సర్వీసులు అప్‌డేట్ కాక‌పోతే ఏం చేయాలి.

రీస్టార్ట్ ఫోన్‌
గూగుల్ ప్లే సర్వీసులు అప్‌డేట్ కావడం కామ‌న్ విష‌యం. కానీ ఒక్కోసారి సాంకేతిక కార‌ణాల‌తో ఈ స‌ర్వీసులు అప్‌డేట్ కావు. మ‌రి ఇలా అప్‌డేట్ కాక‌పోతే ఏం చేయాలి. మొద‌ట ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలి. ఇలా చేయ‌డం ద్వారా ఏదైమా మైన‌ర్ టెక్నిక‌ల్ ఇష్యూస్ ఉంటే తొల‌గిపోతాయి. ఇలా చేయ‌డం ద్వారా ఆ ప్లాబ్ర‌మ్ సాల్వ్ అయితే ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు. 

చెక్ స్టోరేజ్
సాధార‌ణంగా గూగుల్ ప్లే స‌ర్వీసులు ఆటోమెటిక్‌గా అప్‌డేట్ అవుతూ ఉంటాయి. ఇదంతా బ్యాక్‌గ్రౌండ్‌లో జ‌రిగిపోతూ ఉంటుంది. ఒక్కోసారి స్టోరేజ్ స్పేస్ ఎక్కువ అయితే కూడా గూగుల్ ప్లే స‌ర్వీసులు ఆగిపోతాయి. ఇలాంటి స‌మ‌యంలో స్పేస్‌ని ఫ్రీ అప్ చేయాలి. అన‌వ‌స‌ర‌మైన ఫైళ్ల‌ను డిలీట్ చేయాలి... ఇలా చేస్తే ఆటోమెటిక్ అప్‌డేష‌న్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వు. 

డేట్ టైమ్ చూసుకోవాలి
మ‌న‌కు తెలియ‌ని ఇంకో అడ్డంకి డేట్ అండ్ టైమ్‌.మ‌న ఫోన్లో డేట్ అండ్ టైమ్ స‌రిగా లేక‌పోతే  అప్‌డేష‌న్లు టైంకి జ‌ర‌గ‌వు. ఇలాంటి స‌మ‌యంలో సెట్టింగ్స్ ఓపెన్ చేసి సిస్ట‌మ్ మీద క్లిక్ చేయాలి. డేట్ అండ్ టైమ్ మీద క్లిక్ చేసి ఆటోమెటిక్ డేట్ అండ్ టైమ్ ఆప్ష‌న్‌ను అనేబుల్ చేయాలి. 

క్లియర్ క్యాచె అండ్ డేటా
మ‌న ఫోన్లో మ‌న‌కు తెలియ‌కుండానే చాలా ర‌కాల చెత్త డేటా రూపంలో పేరుకుపోతుంది. దీన్ని మ‌నం పట్టించుకోం. దీని వ‌ల్ల అప్‌డేష‌న్ ప్ర‌క్రియ కూడా బాగా లేట్ అయిపోతుంది. ఈ స్థితిలో క్లియ‌ర్ క్యాచె అండ్ డేటా చేయ‌డం వ‌ల్ల మ‌ళ్ళీ ప‌రిస్థ‌తి మామూలు స్థితికి వ‌స్తుంది. అన‌వ‌సర‌మైన యాప్‌లు తీసేయాలి.

Fix Google Play Services Update Issue clear catche