గూగుల్ సెర్చ్ టిప్స్ గురించి మీకు తెలుసా, చెక్ చేశారా ఎప్పుడైనా ?

రోజుకు కొన్ని కోట్ల మంది వినియోగించే సైట్లలో  గూగుల్ ఒకటి. ఏది కావాలన్నా గూగుల్ ఓపెన్ చేస్తారు వారికి కావాల్సింది అందులో సెర్చ్ చేస్తారు.గూగుల్ సెర్చ్ అనేది ఇప్పుడు భూమి పై అత్యధికంగా ఉపయోగించే సెర్చ్ ఇంజిన్.అయితే ఒక్కసారి మనం గూగుల్ లో ఏమైనా సెర్చ్ చేయాలంటే ర్యాండమ్ గా టైపు చేసి వెతుకుతుంటాం అప్పుడు మనకి కాస్త సమయం వేస్ట్ అవుతుంది.ఉదాహరణకు మీకు దగ్గరలో ఏదన్నా ఈవెంట్ జరుగుతుందో తెలుసుకోవడానికి ఈవెంట్స్ హ్యాపెనింగ్ నియర్ బై అని సెర్చ్ చేస్తారు అలా కాకుండా ఫుడ్ ఫెస్టివల్ అని టైపు చేయగానే మీ దగ్గరలో జరుగుతున్న అన్ని ఈవెంట్స్ గూగుల్ ఒకేసారి చూపిస్తుంది.

గూగుల్ సెర్చ్ లో ‘movie showtimes' అని టైపు చేస్తే చాలు మీ దగ్గరలో రన్ అవుతున్నలేటెస్ట్ మూవీ షో టైమ్స్ అన్ని చూపిస్తుంది.

గూగుల్ సెర్చ్ లో "food festival" అని టైపు చేస్తే చాలు మీ దగ్గరలో జరుగుతున్న ఈవెంట్స్ అన్ని చూపిస్తుంది. మీరు తినే ఫుడ్ లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో తెలుసుకోవడానికి ఉదాహరణకి "how many calories in a samosa"అని గూగుల్ సెర్చ్ లో టైపు చేస్తే చాలు.

గూగుల్ సెర్చ్ లో మీకు ఏ రెసిపీ కావాలో కేవలం టైపు చేస్తే చాలు ఒక బాక్స్ మీకు కావల్సిన రెసిపీ ఉన్న అన్ని అగ్ర సైట్లు జాబితా చేస్తుంది.

గూగుల్ సెర్చ్ లో "jobs near me" అని టైపు చేస్తే చాలు మీ దగ్గరలో ఉన్న జాబ్స్ అన్ని చూపిస్తుంది. కాలేజీ/యూనివర్సిటీల గురించి తెలుసుకోవడానికి గూగుల్ లో మీరు చూడాలి అనుకున్న కాలేజీ/యూనివర్సిటీ పేరును టైపు చేయండి చాలు మీకు బ్యాసీ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది.

వ్యాధి గురించి తెలుసుకోవడానికి వెబ్ సైట్ లో కాకుండా కేవలం గూగుల్ లో ఫలనా వ్యాధి పేరు సెర్చ్ చేస్తే చాలు మీకు చిన్న బాస్ లో ఆ వ్యాధి తాలూకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది.

మాములుగా ఫ్రెండ్స్ తో రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడో లేదా రూమ్ లో ఉన్నప్పుడు బిల్స్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు గూగుల్ లో "tip calculator" అని సెర్చ్ చేయండి చాలు

కరెన్సీలను మార్చడానికి నిర్దిష్ట వెబ్సైట్ను సందర్శించడం కంటే, రెండు కరెన్సీ పేర్లను టైప్ చేయండి సరిపోతుంది.ఉదాహరణకు మీరు $ 500 ను రూపాయలలోకి లెక్కించాలనుకుంటే, " USD to INR" అని టైపు చేస్తే సరిపోతుంది.

న్యూస్ టెక్నాలజీ గూగుల్ సెర్చి ఇంజిన్ టిప్స్ అండ్ ట్రిక్స్ హూ టూ బ్రౌజర్ క్రోమ్