జీమెయిల్.. మనం ఎక్కువగా ఉపయోగించే మెయిలింగ్ టూల్.. ఒకప్పుడంటే యాహూ లాంటి మెయిలింగ్ సర్వీసులకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. కానీ గూగుల్ జీమెయిల్ని రోల్ ఔట్ చేసిన తర్వాత యాహూ లాంటి పాత తరం సర్వీసులకు దాదాపు కాలం చెల్లింది. చాలామంది జీమెయిల్‌ను వాడతారు కానీ వారికి అందులో ఉండే ఫీచర్ల గురించి పెద్దగా తెలియదు. జస్ట్ మెయిల్స్ పంపడం, రిసీవ్ చేసుకోవడం వరకే ఉంటుంది. కానీ దీనిలో ఉండే కొన్ని ఫీచర్ల ద్వారా మనం చాలా పనులు చేసుకోవచ్చు మరి ఆ కొత్త ఫీచర్లు ఏంటో చూద్దామా..
ఒక్వ స్పైప్తో అకౌంట్స్ మార్చొచ్చు
జస్ట్ ఒక్క స్పైప్ సాయంతో మీ గూగుల్ జీమెయిల్ అవతారాన్ని మార్చేయచ్చు. ఇందుకోసం స్పైప్ టు స్విచ్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ యూజర్లు తమ గూగుల్ అకౌంట్లోకి వెళ్లి టాప్ రైట్ కార్నర్లో స్విచ్ ఫీచర్‌ని స్వైప్ చేస్తే చాలు. మొదట మీ ప్రొఫైల్ ఐకాన్ ఛేంజ్ అవుతుంది. ఆ తర్వాత రంగులు ఛేంజ్ అవుతాయి. ఫాంట్స్ మారతాయి. ఇలా మీ అకౌంట్ స్వరూపమే మారిపోతుంది. ఇదంతా జరగడానికి కావాల్సింది ఒకే ఒక్క స్వైప్ మాత్రమే.
ఈమెయిల్ షెడ్యూల్ డెలివరీ
మనం మెయిల్స్‌ను ఎప్పటికప్పుడు పంపుకుంటాం. కానీ రేపు ఉదయం ఫలానా సమయానికి ఒక మెయిల్ పంపాలి ఆ సమయంలో మీరు ఏదో బిజీలో ఉంటారు.. మరి అప్పుడు మెయిల్ పంపడం ఎలా! ఇందుకు జీమెయిల్లో ఒక ఫీచర్ ఉంది. అదే షెడ్యూల్ డెలివరీ! మీరు పంపాలనుకున్న మెయిల్ కంపోజ్ చేసి మీరు ఎవరికి పంపాలో వారి మెయిల్ అడ్రెస్ టైప్ చేసి షెడ్యుల్ ఆప్షన్ల్ డేట్, టైమ్ పెట్టుకుంటే చాలు ఆ తేదీన, ఆ సమయానికి ఆ మెయిల్ మీరు పంపాలనుకున్న వారికి వెళ్లిపోతుంది.
సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ మెయిల్
ఈ ఫీచర్‌ను గతేడాదే గూగుల్ ప్రేవేశపెట్టింది. మీరు మెయిల్‌ను పంపి దానికి ఒక టైమర్ సెట్ చేస్తే చాలు. ఈ టైమర్ ఎవరీకీ కనబడదు. ఇది రిసీవర్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే టర్న్ అవుతుంది. ఒకవేళ మనం సెట్ చేసిన నిర్ణీత సమయంలో రిసీవర్ ఈ మెయిల్‌ను ఓపెన్ చేయకపోతే ఇది ఆటోమెటిక్‌గా లాక్ అయిపోతుంది. మనం ఏదైనా మెయిల్ కంపోజ్ చేసే సమయంలో ఈ లాక్ ఆప్షన్‌ను చూడొచ్చు.
ఎస్ ఎం ఎస్ పాస్‌కోడ్
మీ ఈమెయిల్స్‌కు ఎస్ ఎం ఎస్ పాస్‌కోడ్ ఇవ్వొచ్చన్న సంగతి తెలుసా? ... జీమెయిల్లో వచ్చిన ఫీచర్‌తో ఈ పాస్‌కోడ్‌ను ఇచ్చే ఛాన్స్ ఉంది. మీ మెయిల్ కంపోజ్ చేసే సమయంలో లాక్ ఐకాన్‌ను క్లిక్ చేస్తే దానిలో మీకు ఎస్ ఎం ఎస్ పాస్ కోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇది డిఫాల్ట్‌గా నో ఎస్ ఎం ఎస్ పాస్‌కోడ్ అని ఉంటుంది. దాన్ని మన క్లిక్ చేసి అనేబుల్ చేయాలి. ఆ తర్వాత ఒక పాస్వర్డ్ పెట్టాలి. దీని వల్ల మన మెయిల్‌కు అదనపు సెక్యూరిటీ లభిస్తుంది.
మ్యూట్ అన్వాంటెడ్ మెయిల్ చెయిన్స్
మనకు జీమెయిల్లో ఎన్నో రకాల మెయిల్స్ వస్తుంటాయి. కొన్నింటిని సబ్ స్కైబ్ చేయకపోయినా సరే మన ఇన్ బాక్స్‌లోకి వచ్చి చేరతాయి. అందుకే ఇలాంటి అన్వాంటెడ్ మెయిల్ చెయిన్స్‌ని మ్యూట్ చేయడానికి జీమెయిల్లో ఒక ఆప్షన్ ఉంది. మెయిల్ చెయిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి త్రి డాట్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మ్యూట్ ఇట్ అంటే ఇలాంటి అన్వాంటెడ్ మెయిల్ చెయిన్ కన్వర్షేషన్లకు తెరపడుతుంది.
know Features Gmail lock security