ఈ రోజుల్లో స్వచ్ఛమైన గాలి ఎక్కడా దొరకడం లేదు. దీనికి ప్రధాన కారణం వాతావరణం విపరీతంగా కాలుష్యం కావడమే. మనం చేతులారా ప్రకృతిని మనమే నాశనం చేస్తున్నాం. ఈ తప్పులు మనం తెలిసే చేస్తున్నామంటే చాలామందికి నమ్మశక్యంగా ఉండదు. కాని ఇది నిజం. పనికిరాని, పాతబడిన గాడ్జెట్లను మనం ఎక్కడంటే అక్కడ పడేస్తున్నాం. దీని వల్ల ప్రకృతి విపరీతంగా ధ్వంసమవుతోంది. వీటిని ఎక్కడబడితే అక్కడ పారేయకుండా రీసైకిలింగ్ లేదా వేరొకరికి దానం చేసినట్లయితే ప్రకృతిని అనేక రకాలైన కాలుష్యాల నుంచి సంరక్షించినవారవుతారు.
గాడ్జెట్ తయారీ కంపెనీలతో పాటు ఆన్లైన్ రిటైలర్లు పాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను రిసైకిలింగ్ నిమిత్తం సేకరించేందుకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అవకాశముంటే అలాంటి చోట మీ పాత ఎలక్ట్రానిక్ వస్తువులను అమ్మేయండి.
10లక్షల ల్యాప్‌టాప్‌లను రిసైకిల్ చేయటం ద్వారా వచ్చే ఫలితం, అమెరికాలో 3500 ఇళ్లు ఏడాది పాటు ఉపయోగించే విద్యుత్‌ను ఆదా చేసినంత సమానమట. 10మిలియన్ల సెల్ఫోన్లను రీసైకిల్ చేయటం ద్వారా 35వేల పౌండ్ల రాగి, 772 పౌండ్ల, వెండి, 75 పౌండ్ల బంగారం, 33 పౌండ్ల పల్లాడియంను తిరిగి పొందవచ్చట.
కాబట్టి మీ పాత కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్‌ను రీసైకిలింగ్ లేదా వితరణ నిమిత్తం వేరొకరికి అందజేసే ముందు సదరు గాడ్జెట్స్ పనితీరును క్షుణ్నంగా పరిశీలించండి. ఒకవేళ సాఫ్ట్వేర్ అప్డేట్లతో ఆ గాడ్జెట్ మరలా ఉపయోగపడేదైతే మీ వద్దనే ఉంచుకోండి.
గాడà±à°œà±†à°Ÿà±à°¸à± మొబైలà±à°¸à± à°¸à±à°®à°¾à°°à±à°Ÿà±â€Œà°«à±‹à°¨à±à°¸à± టీవీ పాత ఎలకà±à°Ÿà±à°°à°¾à°¨à°¿à°•ౠవసà±à°¤à±à°µà±à°²à±