మీ చేతుల్లోని స్మార్ట్‌ఫోన్‌లు ఎంత డర్టీగా ఉంటున్నాయో, మీకు తెలుసా..?, మురికి వస్తువులను పుట్టుకున్న ప్రతిసారీ చేతులను శుభ్రంగా కుడుక్కుంటాం. అలాంటిది, వివిధ రకాల బ్యాక్టీరియాలతో నిండే ఉండే మొబైల్ ఫోన్‌లను తాకిన ప్రతిసారీ చేతులను శుభ్రం చేసుకుంటున్నామా..? నిత్యావసర సాధానల్లో ఒకటైన మొబైల్ ఫోన్ గురించి ఆసక్తికర వివరాలు బహిర్గతమయ్యాయి. పలు పరిశోధనల ద్వారా వెల్లడైన వివరాల మేరకు మొబైల్ ఫోన్‌లు 85శాతం కామన్ బ్యాక్టీరియాతో నిండి ఉంటున్నాయట. వీటి నుంచి రక్షణ పొందడానికి మొబై్ ఎలా క్లీన్ చేయాలనే దానికి కొన్ని చిట్కాలు ఇస్తున్నాం. ఓ సారి ప్రయత్నించి చూడండి.
మనం రోజు ఉపయోగించే ఏటీఎమ్ స్క్రీన్ చదరపు అంగుళానికి గాను 4,500 బ్యాక్టిరియాలను కలిగి ఉంటుందట. పెట్స్ ఈటింగ్ బౌల్, ఇది కూడా క్రిములతో నిండి ఉండే ప్రదేశమే. సగటు పెట్ ఈటింగ్ బౌల్ చదరపు అంగుళానికి 2,110 బ్యాక్టిరియాలను కలిగి ఉంటుందట.
పబ్లిక్ టాయిలెట్‌లలో ఉండే క్రిముల కంటే ఎక్కువ క్రిములను కలిగి ఉంటుందట. సగటు టచ్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్‌లో, ఒక్కో చదరపు అంగుళం 25,000 క్రిములను కలిగి ఉంటుందట. అదే సమయంలో పబ్లిక్ టాయిలెట్‌లు చదరపు అంగుళానికి 1,201 బ్యాక్టీరియాలను కలిగి ఉంటుందట.
స్మార్ట్‌ఫోన్ ను క్లీన్ చేయాలంటే మీకు ఈ సామాగ్రి అవసరమవుతుంది.
లింట్ ఫ్రీ మైక్రోఫైబర్ క్లాత్, కాటన్ స్వాబ్స్, డిస్టిల్ వాటర్, రబ్టింద్ ఆల్కాహాల్. వీటితో ఎలా క్లీన్ చేయాలో చూద్దాం.
స్టెప్ 1
మీ ఫోన్ పై ఏర్పాటు చేసిన స్ర్కీన్ ప్రొటెక్టర్‌తో పాటు కవర్ కేస్‌లను తొలగిచండి. ఫోన్‌ను స్విచాఫ్ చేసి బ్యాటరీని వేరు చేయండి. ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్‌ను జాగ్రత్తగా తొలగించండి. ఓ కాటన్ స్వాబ్‌ను రబ్బింగ్ ఆల్కాహాల్‌లో ముంచి కీబోర్డ్‌ను ఏమాత్రం ఒత్తిడి తగలకుండా సున్నితంగా శుభ్రం చేయండి.
స్టెప్ 2
ఇదే పద్ధతిని ఫోన్ వెనుక కేస్ పై అప్లై చేయండి. ఫోన్ లోపలి భాగాలను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా కెమెరా లెన్స్ కెమోరా లెన్స్ క్లినింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కొద్దిగా డిస్టిల్ వాటర్‌లో క్వాటన్ స్వాబ్‌ను ముంచి కెమెరా లెన్స్ ఇంకా ఫ్లాష్ ను స్పిన్నింగ్ మోషన్‌లో సున్నితంగా క్లీన్ చేయండి.
స్టెప్ 5
ఫోన్ టచ్ స్క్రీన్ శుభ్రపరిచే క్రమంలో కఠినమైన రసాయనాలను ఉపయోగించొద్దు. స్క్రీన్ క్లీనింగ్‌లో భాగంగా గరుకు బట్టలు, పేపర్ టవల్స్, టిష్యూ పేపర్స్ వంటి వాటిని ఉపయోగించకండి. వీటిని ఉపయోగించటం వల్ల స్క్రీన్ పై గీతలు పడతాయి. స్క్రీన్ను శుభ్రం చేసే క్రమంలో మీ చేతలతో స్క్రీన్ పై బలంగా రాపిడి చేయవద్దు.
à°¸à±à°®à°¾à°°à±à°Ÿà±â€Œà°«à±‹à°¨à±â€Œ à°¡à°°à±à°Ÿà±€ మొబైలà±à°¸à± à°¸à±à°®à°¾à°°à±à°Ÿà±â€Œà°«à±‹à°¨à±â€Œ à°•à±à°²à±€à°¨à±  బà±à°¯à°¾à°•à±à°Ÿà±€à°°à°¿à°¯à°¾