మొబైల్ స్టోరేజ్ పెంచుకునేందుకు కొన్ని ట్రిక్స్ 

ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా..అందులో కావాల్సినవన్నీ సర్దేసుకున్నారా..వాటితో స్టోరేజ్ మొత్తం నిండిపోయిందా..మెమొరీ కార్డ్ కూడా సరిపోవడం లేదా.. కొత్త యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవాలా..వీటన్నింటికి ఫోన్ లో స్టోరేజ్ కావాలా..అయితే చిన్న ట్రిక్స్ ద్వారా మీరు మీ ఫోన్ స్టోరేజ్ పెంచుకోవచ్చు. అందుబాటులో ఉన్న ట్రిక్స్ ఉపయోగించి మీరు మీ స్టోరేజ్ ని పెంచుకోవచ్చు. ప్రాసెస్ ని ఓ సారి పరిశీలిస్తే..

ఫోన్ లో ఉన్న అనవసరమైన డేటాని క్యాచీ ద్వారా క్లియర్ చేసుకుంటే స్పేస్ కలిసివస్తుంది. దీని కోసం సెట్టింగ్స్‌లో కెళ్లి యాప్స్ మీద క్లిక్ చేస్తే అక్కడ క్యాచీ అని ఆప్సన్ ఉంటుంది. దాన్ని క్లియర్ చేస్తే స్పేస్ కొంచెం ఫ్రీ అవుతుంది.

మీ ఫోన్లో ఉండే డౌన్లోడ్ ఫోల్డర్ లో సపోర్ట్ చేయని ఫైల్స్ ఉంటే వాటిని డిలీట్ చేయడం ద్వారా స్పేస్ పెంచుకోవచ్చు. మీ ఫోన్ లో ఉన్న అనవసరమైన యాప్స్ మొత్తాన్ని ఎస్‌డి కార్డులోకి పంపడం ద్వారా స్పేస్ పెంచుకోవచ్చు.అయితో ఫోన్‌తో పాటు వచ్చిన యాప్స్ ఎస్‌డి కార్డులోకి వెళ్లవు.

మీ ఫోన్‌లో ఎక్కువ స్పేస్ తీసుకునే యాప్స్‌ని గుర్తించి వాటిని తీసేస్తే మీకు స్టోరేజ్ స్పేస్ కలిసివస్తుంది. దీనికోసం మీరు Settings క్లిక్ చేసి Storageలో కెళితే అక్కడ మీకు యాప్స్ అనే బటన్ కనిపిస్తుంది.దానికి టాప్‌లో కుడిభాగాన క్లిక్ చేస్తే మీకు Sort by Size అనే ఆప్సన్ కనిపిస్తుంది. దాన్ని టాప్ చేస్తే ఎక్కువ స్పేస్ తీసుకునే యాప్స్ సమాచారం కనిపిస్తుంది.

ఒక్కో సమయంలో ఇది కూడా మీ ఫోన్ స్టోరేజ్ ని ఆక్రమించుకునే అవకాశం ఉంది. పనికిరానివి తీసేయడం చాలా మంచిది.మీ మొబైల్ లోని ఫోటోలను గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ కి పంపించడం ద్వారా కూడా స్టోరేజ్ స్పేస్ ని పెంచుకోవచ్చు.

న్యూస్ టెక్నాలజీ ఆండ్రాయిడ్ మొబైల్స్ స్టోరేజ్ ఉచిత స్టోరేజ్ స్టోరేజ్ పెంచుకోవడం ఎలా స్పేస్ మొబైల్ స్పేస్