ప్రపంచ మహమ్మారి కరోనా నివారణలో అందరూ తలో చెయ్యీ వేస్తున్నారు. టెక్నాలజీ సంస్థలు కూడా కరోనా నియంత్రణలో జనాన్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నాయి. మొన్నటివరకు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్ లాంటి మొబైల్ నెట్వర్క్ కంపెనీలన్నీ కొవిడ్ 19 (కరోనా) వైరస్ విషయంలో అలర్ట్ చేస్తూ కాలర్ట్యూన్స్ పెట్టాయి. ఇప్పుడు రిలయన్స్ జియో మరో అడుగు ముందుకేసింది. తన మై జియో యాప్లోనే కరోనా టెస్టింగ్కు ఒక ఆన్లైన్ టూల్ను డెవలప్ చేసింది.
సింప్టమ్స్ చెకర్
మై జియో యాప్లో symptoms checker అనే ఆప్షన్ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్లోని మై జియో యాప్లో ఈ ఫీచర్ ఉంది. త్వరలో ఐవోఎస్లోనూ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ను ఉపయోగించుకోవాలంటే ముందుగా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్లి మై జియో యాప్ను అప్డేట్ చేసుకోవాలి.
ఎలా వాడుకోవాలి?
అప్డేట్ చేశాక మై జియో యాప్ ఓపెన్ చేస్తే #CoronaHaregaIndiaJeetega అనే బ్యానర్ కనిపిస్తుంది.
* దాన్ని క్లిక్ చేయండి.
* మీ వయసు, జెండర్, ఏ దేశం, ఇంతకు ముందు 14 రోజుల్లో వేరే ఏదైనా దేశానికి ప్రయాణం చేశారా? జలుబు, జ్వరం, గొంతునొప్పి లాంటి లక్షణాలున్నాయా? ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందా? ఇలా రకరకాల ప్రశ్నలు అడుగుతుంది.
* వాటికి మీరు ఎంటర్ చేసే ఆన్సర్లను బట్టి మీరు కరోనా రిస్క్ ఉందో లేదో అంచనా వేసి చెబుతుంది.
క‌రోనా మై జియో యాపà±â€Œ క‌రోనా వైర‌సà±â€Œ క‌రోనా లాకà±â€Œà°¡à±Œà°¨à±â€Œ MyJio App Myjio app carona symptoms checker