వాట్సాప్ స్టేటస్ వచ్చాక మన ఆనందాన్ని, విచారాన్ని, సంబరాన్ని, సంతోషాన్ని అన్నింటినీ బంధుమిత్రులతో ఎప్పటికప్పుడు పంచుకోగలుగుతున్నాం. ఒకప్పటిలా ఒక విషయాన్ని పదిమందికి చెప్పాలంటే ఫోన్ చేయడమో, పర్సనల్గా మెసేజ్ పెట్టడమో చేయాల్సిన అవసరం లేదిప్పుడు. జస్ట్ స్టేటస్లో పెడితే చాలు మన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్లందరికీ విషయం తెలిసిపోతుంది. వాట్సాప్ స్టేటస్ అంటే మెసేజ్, ఫొటో పెట్టడమే కాదు ఇంకా చాలా చాలా చేయొచ్చు. అలాంటి స్టేటస్ ట్రిక్స్ మీకోసం..
1. స్టేటస్కి లింక్స్ యాడ్ చేయండి
వాట్సాప్ స్టేటస్లో మనం ఏదైనా యాడ్ చేయాలంటే టెక్స్ట్ లేదా టైప్తోపాటు కెమెరా సింబల్ కూడా ఉంటుంది. కెమరా సింబల్ను క్లిక్ చేస్తే ఫొటోలు, వీడియాలు, జిఫ్లు లాంటి మీడియా ఫైల్స్ను యాడ్ చేయొచ్చు. అంతేకాదు మీరు స్టేటస్లో ఏదైనా వెబ్సైట్కు సంబంధించిన లింక్ కూడా ఇవ్వచ్చు. కెమెరా సింబల్పైనున్న పెన్సిల్ సింబల్ను క్లిక్ చేసి www.computervignanam.net ఇలా ఏ లింక్నైనా టైప్ చేసి మీ కాంటాక్ట్స్ అందరికీ ఒకేసారి దాన్ని చూపించవచ్చు.
2. ఫాంట్, బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చండి
వాట్సాప్ స్టేటస్కి కావాలంటే మీకు నచ్చిన కలర్కూడా పెట్టుకోవచ్చు. స్టేటస్లోకి వెళ్లి పెన్సిల్ సింబల్ను క్లిక్ చేస్తే T సింబల్ తర్వాత రంగుల ప్లేట్ లాంటి సింబల్ కనిపిస్తుంది. దానిమీద క్లిక్ చేస్తే వాట్సాప్ స్టేటస్ బ్యాక్గ్రౌండ్ కలర్ మారుతుంది. మీకు నచ్చిన కలర్ను బ్యాక్గ్రౌండ్గా సెట్ చేసుకోవచ్చు. అలాగే T సింబల్ మీద క్లిక్ చేస్తే ఫాంట్ స్టైల్ కూడా మార్చుకోవచ్చు.
3. టెక్స్ట్ను ఫార్మాట్ చేయండి
అంతేకాదు వాట్సాప్ స్టేటస్లో మీరు పెట్టే టెక్స్ట్ మెసేజ్ను ఫార్మాట్ కూడా చేసుకోవచ్చు. స్టేటస్లో ఏదైనా పదం టైప్ చేశాక దాన్ని కాపీ చేస్తే కట్, కాపీ, పేస్ట్, బోల్డ్, ఇటాలిక్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. మీకు ఏం కావాలంటే దాని మీద క్లిక్ చేసి మీ టెక్స్ట్ను ఫార్మట్ చేసుకోవచ్చు. అంతేకాదు సింబల్స్ను యూజ్ చేసి కూడా మీరు టెక్స్ట్ను ఫార్మాట్ చేయొచ్చు.
మీరు బోల్డ్ చేయాలనుకున్న పదానికి ముందు వెనుక * సింబల్ టైప్ చేస్తే ఆ టెక్స్ట్ బోల్డ్ అవుతుంది.
పదానికి లేదా వాక్యానికి ముందు, వెనుక అండర్స్కోర్ ( _ )సింబల్ యాడ్ చేస్తే ఆ టెక్స్ట్ అంతా ఇటాలిక్గా మారుతుంది.
పదానికి లేదా వాక్యానికి ముందు, వెనుక టిల్డ్ ( ~) సింబల్ యాడ్ చేస్తే ఆ టెక్స్ట్ అంతా స్ట్రయిక్ త్రూగా మారుతుంది.
4.టెక్స్ట్ టైప్ చేస్తున్నప్పుడే కాపీ చేయండి
స్టేటస్లో టెక్స్ట్ టైప్ చేస్తున్నప్పుడే దాన్ని క్లిక్ చేసి కాపీ చేయొచ్చు. మీరు స్టేటస్ పెట్టాక కూడా దాన్ని టాప్లో ఉన్న మూడు డాట్స్ సింబల్ను క్లిక్ చేసి కాపీ చేయొచ్చు. మీరు ఎన్ని స్టేటస్లు పెట్టినా వాటన్నింటిని కూడా ఇదే పద్ధతిలో కాపీ చేయొచ్చు.
5.స్టేటస్ను పాజ్ చేయొచ్చు
మీరు ఎవరిదైనా స్టేటస్ చూస్తున్నారు. మీరు అందులో ఉన్న టెక్స్ట్ చదవడం పూర్తవకుండానే అది తర్వాత స్టేటస్లోకి మూవ్ అయిపోతుంది. అలాంటప్పుడు స్టేటస్ మీద వేలు పెట్టి దాని పాజ్ చేయొచ్చు. మీ వేలు స్టేటస్ మీద ఉన్నంతవరకు అది పాజ్లోనే ఉంటుంది. వేలు తీయగానే తర్వాత స్టేటస్లోకి వెళుతుంది.
6. తర్వాత పర్సన్ స్టేటస్ వెంటనే చూడాలంటే..
మీ వాట్సాప్ కాంటాక్స్ట్ లిస్ట్లో ఉన్న పర్సన్స్ స్టేటస్లు వరుసగా మీకు కనిపిస్తాయి. కానీ కొంత మంది వాట్సాప్ స్టేటస్లో చాలా మెసేజ్లు, వీడియోలు, ఫొటోలు పెట్టేస్తుంటారు. అవన్నీ చూసేవరకు వెయిట్ చేయకుండా వేరే వ్యక్తి స్టేటస్లోకి వెళ్లిపోవచ్చు. తర్వాత పర్సన్ స్టేటస్ చూడాలంటే రైట్కి స్వైప్ చేయాలి. ముందు వ్యక్తి స్టేటస్ చూడాలంటే లెఫ్ట్కి స్వైప్ చేయాలి.
Whatsapp Status Tips Add links to Whatsapp status Change back ground colour in whatsapp status వాటà±à°¸à°¾à°ªà± à°¸à±à°Ÿà±‡à°Ÿâ€Œà°¸à± à°Ÿà°¿à°ªà±à°¸à± à°…à°‚à°¡à± à°Ÿà±à°°à°¿à°•à±à°¸à±â€Œ à°¸à±à°Ÿà±‡à°Ÿâ€Œà°¸à±â€Œà°²à±‹ లింకà±à°¸à± యాడౠచేయ‌డం à°¸à±à°Ÿà±‡à°Ÿâ€Œà°¸à±â€Œà°²à±‹ ఫాంటౠబà±à°¯à°¾à°•à±â€Œà°—à±à°°à±Œà°‚డౠక‌ల‌రౠమారà±à°šâ€Œà°¡à°‚ వాటà±à°¸à°¾à°ªà± à°¸à±à°Ÿà±‡à°Ÿâ€Œà°¸à± టెకà±à°¸à±à°Ÿà± ఫారà±à°®à°¾à°Ÿà±â€Œ