ఏదైనా అత్యవసరంగా నగదు అవసరం అనుకుంటే అందరూ బ్యాంకు దగ్గరకంటే ఏటీఎం సెంటర్ల వైపే మొగ్గుచూపుతుంటారు. అయితే చాలామంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సార్లు చిక్కుల్లో పడుతుంటారు. ముఖ్యంగా చదువురాని వారు ఇతరులను ఆశ్రయిస్తుంటారు, వారి అమాయకత్వాన్ని మోసగాళ్లు క్యాష్ చేసుకుని మొత్తం ఊడ్చిపారేస్తుంటారు. ఇలాంటి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో చూద్దాం.
ఏటీఎం PIN ఎప్పుడూ గుర్తించుకోవాలి. కార్డుల మీద పిన్ నెంబర్ రాయడం చేయకూడదు. ఏటీఎం కార్డు నెంబర్, పిన్ నెంబర్, CVV నెంబర్లను బ్యాంకు అధికారులు సహా ఎవరికి ఇవ్వకూడదు.
తరచుగా ఏటీఎం కార్డు పిన్ నెంబర్ మారుస్తుండాలి. గుర్తుండేలా పిన్ నెంబర్ సెట్ చేసుకోవాలి. అలాగని పుట్టిన తేదీ, వాహనం నెంబర్, ఫోన్ నెంబర్లను ఏటీఎం పిన్ నెంబర్ గా ఎప్పుడూ పెట్టుకోవద్దు.
ATMలో నగదు డ్రా చేస్తే.. ఏటీఎం లేదా PoS మిషన్ లో స్వైప్ చేస్తే దగ్గరగా నిలబడాలి. పిన్ నెంబర్ ఎంటర్ చేసే కీ ప్యాడ్ పై మరో చేతిని అడ్డంగా పెట్టి పిన్ ఎంటర్ చేయాలి.
మీరు నగదు విత్ డ్రా చేసే సమయంలో మీ పక్కన ఇతరులు లేకుండా చూసుకోవాలి. ATM లో డబ్బులు డ్రా చేసేటప్పుడు కొత్తవారితో మాట్లాడొద్దు. ఎవరికి మీ కార్డును ఇవ్వరాదు.
ATMకు ఏదైనా డివైజ్ కనెక్ట్ అయి ఉన్నట్టు గుర్తిస్తే వెంటనే ట్రాన్స్ జెక్షన్ ఆపేయండి. ఏటీఎం గార్డు లేదా బ్యాంకు అధికారులకు సమాచారం అందించండి.
నగదు విత్ డ్రా పూర్తి కాగానే Cancel బటన్ నొక్కండి. ATMలో Welcome Screen వచ్చే వరకు ఏటీఎం సెంటర్ వదిలివెళ్లకండి
ATM కార్డు పోయినా లేదా ఎవరైనా దొంగలించినా సదరు బ్యాంకుకు వెంటనే రిపోర్ట్ చేయండి.అకౌంట్ బ్రాంచ్ కు లేదా ఆ బ్యాంకు కస్టమర్ కేర్ కు కాల్ చేసి కార్డు బ్లాక్ చేయమని చెప్పండి.
మీరు నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ సర్వీసు వాడుతున్నట్టుయితే మోసపూరిత లావాదేవీలు కాకుండా ముందు జాగ్రత్త చర్యగా మీ ఏటీఎం కార్డును మీరే బ్లాక్ చేసుకోవచ్చు.
à°¬à±à°¯à°¾à°‚కౠఅకౌంటౠà°à°Ÿà±€à°Žà°‚ à°¡à°¬à±à°¬à±à°²à± వితౠడà±à°°à°¾ నగదౠవితౠడà±à°°à°¾ à°à°Ÿà±€à°Žà°‚ సెంటరà±