ఎయిర్టెల్ సెలెక్టెడ్ కస్టమర్లకు 1జీబీ డేటాను ఎయిర్టెల్ ఉచితంగా అందిస్తోంది. స్పెషల్ ప్లాన్తో రీచార్జ్ చేసుకున్న వినియోగదారులకు ఈ అదనపు డేటా లభిస్తుంది. అయితే సెలెక్ట్ చేసిన వినియోగదారులకు మెసేజ్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తామని ఎయిర్టెల్ ప్రకటించింది.
జియో బాటలోనే..
గతంలో జియో తన కస్టమర్లకు రోజుకు 2జీబీ డేటాను నాలుగురోజులపాటు ఉచితంగా అందించింది. ఇప్పుడు అదేబాటలో ఎయిర్టెల్ వెళుతోంది.
రూ.48 డేటా ప్యాక్తో
* రూ. 48 డేటా ప్యాక్ను రీచార్జ్ చేసుకున్న వినియోగదారులకు 3జీబీ వస్తుంది. ఇప్పుడు దీనికి 1 జీబీ ఫ్రీ డేటా కూడా కలిసి మొత్తం 4జీబీ డేటా లభిస్తుంది.
* రూ. 49 స్మార్ట్ రీచార్జ్ ప్యాక్పైనా అదనపు డేటా లభిస్తుంది. సాధారణంగా ఈ ప్యాక్లో రూ. 38.52 టాక్ టైం ఇస్తుంది. దీంతోపాటు నామమాత్రంగా 100 ఎంబీ డేటా ఇచ్చేది. ఇప్పుడు ఈ ప్యాక్కు కూడా అదనంగా 1జీబీ డేటా ఉచితంగా పొందొచ్చు.
మూడు రోజుల్లో వాడేయాలి
అయితే ఈ అదనపు 1జీబీ డేటాకు మూడు రోజులే కాలపరిమితి. ఆలోపు వాడుకోకపోతే పోయినట్లే.
ఎయిరà±â€Œà°Ÿà±†à°²à± à°«à±à°°à±€ డేటా ఆఫ‌రà±â€Œ ఎయిరà±â€Œà°Ÿà±†à°²à± ఆఫ‌రà±â€Œ Airtel free Data offer Airtel 1gb Data free Â