క‌రోనా ఎఫెక్ట్‌.. ఇంటి వ‌ద్ద‌కే ఎయిర్‌టెల్ సేవ‌లు 

లాక్‌డౌన్ నిబంధ‌న‌లు భారీగానే స‌డ‌లించినా క‌రోనా భ‌యంతో జ‌నం బ‌య‌టికి రావ‌డానికి భ‌య‌ప‌డుతున్నారు. నిత్య‌వ‌స‌ర స‌ర‌కుల కోసం త‌ప్ప దేనీకి బ‌య‌టికి రావ‌డం లేదు. అందుకే కిరాణా దుకాణాలు, మెడిక‌ల్ షాపుల్లో త‌ప్ప మిగిలిన‌వాటిలో పెద్ద‌గా ర‌ద్దీ క‌నిపించ‌డం లేదు. ఈ ప‌రిస్థితుల్లో ఎయిర్‌టెల్ త‌న సేవ‌ల‌ను క‌స్ట‌మ‌ర్ల దగ్గ‌ర‌కు సుర‌క్షితంగా చేర్చ‌డానికి ఓ కొత్త స‌ర్వీస్ ప్రారంభించింది.  ఇంటివ‌ద్ద‌కే త‌న ప్రొడ‌క్ట్స్ తీసుకెళ్లి క‌స్ట‌మ‌ర్ల‌కు అందించేకు కాంసియార్జ్ స‌ర్వీసెస్‌ను ప్రారంభించింది.

ఏంటీ కాంసియార్జ్ స‌ర్వీసెస్‌? 
 ముందుగా ఈ సేవ‌ల‌ను  హైద‌రాబాద్‌లో ప్రారంభించింది. ఎయిర్‌టెల్  సిమ్ కార్డులు కావాల‌న్నా, డీటీహెచ్‌, బ్రాడ్‌బ్యాండ్ సేవ‌లు కావాల‌న్నా ఎయిర్‌టెల్‌. ఇన్‌లోకి వెళ్లి బుక్ చేసుకుంటే చాలు. ఎయిర్‌టెల్ సిబ్బంది మీ ఇంటికే వ‌చ్చి వాటిని మీకు అందిస్తారు.

ఏంటి ప్ర‌త్యేక‌త‌?
 * ఎయిర్‌టెల్‌లోని శిక్ష‌ణ పొందిన డెలివ‌రీ సిబ్బంది మీ ఇంటికే వ‌చ్చి కాంటాక్ట్‌లెస్‌గా డెలివ‌రీ ఇస్తారు. 

* శానిటైజ్ చేసుకుని మాస్క్‌లు వేసుకుని వ‌చ్చి మీకు స‌ర్వీస్ అంద‌జేస్తారు.  

* వినియోగదారులు   భౌతిక దూరాన్ని పాటిస్తూనే ఎయిర్‌టెల్ సేవలను ఇంటిద‌గ్గ‌ర నుంచే పొంద‌వ‌చ్చు.  

Airtel Concierge Services Airtel contact less services ఎయిర్‌టెల్ కాంసియార్జ్ స‌ర్వీసెస్‌ ఎయిర్‌టెల్ కాంటాక్ట్‌లెస్ స‌ర్వీసెస్ ‌