కరోనా ఉద్ధృతి ఎప్పుడు తగ్గుతుందో తెలియట్లేదు. చాలామంది వర్క్ ఫ్రం హోమ్చేస్తున్నారు. మరోవైపు పిల్లలు, ఇంట్లో ఆడవాళ్లు కూడా మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లతో ఆన్లైన్ కంటెంట్‌ను తెగ చూసేస్తున్నారు. టోటల్‌గా ఇవన్నీ కలిసి మీ బ్రాడ్‌బ్యాండ్‌ను పిండేస్తున్నాయి. దీంతో చాలాచోట్ల యూసేజ్ పెరిగి బ్రాడ్‌బ్యాండ్ కూడా స్లో అయిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా వాడుకునేందుకు, లాక్‌డౌన్‌తో ఇల్లు కదలని వేళ మొబైల్ ఎక్కువగా వాడేవారికి రోజుకు 3జీబీ డేటా అందించే ప్లాన్స్‌ను మన టెల్కోలు ఆఫర్ చేస్తున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి.
ఎయిర్టెల్ 558 ప్లాన్
ఎయిర్‌టెల్‌లో 558తో రీఛార్జి చేసుకుంటే రోజుకు 3జీబీ 4జీ డేటా వస్తుంది. వ్యాలిడిటీ 56 రోజులు
అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్
* రోజుకు 100 ఎస్ఎంస్లు
* ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ సర్వీస్ ఫ్రీ.
* ఎయిర్టెల్ హలోట్యూన్స్ కూడా ఫ్రీ.
* వింక్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ ఫ్రీ
* అంతేకాదు ఎయిర్టెల్ ద్వారా ఫాస్టాగ్ తీసుకుంటే 150 రూపాయల క్యాష్‌బ్యాక్ కూడా వస్తుంది.
వొడాఫోన్ 399 ప్లాన్
వొడాఫోన్ కరోనా లాక్డౌన్ పరిస్థితుల్లో తన ప్రీపెయిడ్ ప్లాన్స్‌లో కొన్నింటికి డబుల్ డేటా ఇస్తోంది. 399 రూపాయలతో రీఛార్జి చేయించుకుంటే రోజుకు 1.5 జీబీ 4జీ డేటా వచ్చేది. దాన్ని డబుల్ చేసి 3జీబీ డేటా ఇస్తోంది.
వ్యాలిడిటీ 56 రోజులు
* అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్
* రోజుకు 100 ఎస్ఎంస్లు
* వొడాఫోన్ ప్లే, జీ5 సబ్స్క్రిప్షన్స్ ఫ్రీ.
* అయితే ఈ ఆఫర్ ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, కేరళ, మహరాష్ట్ర, నార్త్ ఈస్ట్, పంజాబ్, యూపీ వెస్ట్ సర్కిల్స్‌లో పని చేయదు. ఈ రాష్ట్రాల వారు ఈ బెనిఫిట్స్ పొందాలంటే ఎయిర్‌టెల్‌లో మాదిరిగానే 558 ప్లాన్ తీసుకోవాలి.
జియో 349 ప్లాన్
రిలయన్స్ జియో 349 రూపాయలతో రీఛార్జి చేయించుకుంటే రోజుకు 3జీబీ డేటా ఇస్తోంది. అయితే దీని వ్యాలిడిటీ 28 రోజులే.
* ఇతర నెట్‌వర్క్‌లకు 1000 నిముషాల ఫ్రీ కాలింగ్
* జియో టూ జియో అన్లిమిటెడ్ కాలింగ్
* రోజుకు 100 ఎస్ఎంస్లు
* జియో సావన్, జియో టీవీ వంటి జియో యాప్స్ అన్నీ ఫ్రీగా చూడొచ్చు.
రోజà±à°•à± 3జీబీ డేటా à°ªà±à°²à°¾à°¨à±à°¸à±â€Œ ఎయిరà±â€Œà°Ÿà±†à°²à± 558 à°ªà±à°²à°¾à°¨à± వొడాఫోనౠ399 à°ªà±à°²à°¾à°¨à±â€Œ జియో 349 à°ªà±à°²à°¾à°¨à± Daily 3GB Data plans Airtel Rs 558 plan Vodafone Rs 399 plan Jio 349 plan