మొబైల్ నంబ‌ర్ పోర్ట్‌బిలిటీకి ట్రాయ్ కొత్త రూల్స్ రెడీ!

మ‌న‌లో ఎక్కువ‌మంది మొబైల్ నంబ‌ర్‌ని ఎక్కువ కాలం వాడుతూ ఉంటారు. కానీ వేరే నెట్‌వ‌ర్క్‌కి మార్చాలంటే నంబ‌ర్ పోతుందేమోన‌నే భ‌యం. ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండ‌డం కోసమే ట్రాయ్ నంబ‌ర్ పోర్ట్‌బిలిటీ అవ‌కాశాన్ని క‌ల్పించింది. నంబ‌ర్ పోర్ట్‌బిలిటీ చేసుకుంటే మ‌న పాత నంబ‌ర్‌ని కొత్త నెట్‌వ‌ర్క్‌కి మార్చుకోవ‌చ్చు. అయితే ఈ నంబ‌ర్ పోర్ట్‌బిలిటీ కోసం ట్రాయ్ కొత్త నిబంధ‌న‌ల‌ను రెడీ చేసింది. ఆ రూల్స్ ఏమిటో చూద్దామా..

డిసెంబ‌ర్ 16 నుంచే అమ‌లు
ట్రాయ్ కొత్త పోర్ట్‌బిలిటీ నిబంధ‌న‌లు ఈ ఏడాది డిసెంబ‌ర్ 16 నుంచే అమ‌ల్లోకి వ‌చ్చాయి. దీని ప్ర‌కారం మొబైల్ పోర్ట్‌బిలిటీ ప్రాసెస్ కేవ‌లం 3 నుంచి 5 రోజుల వ్య‌వ‌ధిలోనే పూర్తి కానుంది. ఇంత‌కుముందు ఈ ప్రాసెస్‌కు 15 రోజులు ప‌ట్టేది. మీ నంబ‌ర్‌ను ఒక నెట్‌వ‌ర్క్ నుంచి ఇంకో నెట్‌వ‌ర్క్‌కి మార్చుకోవాలంటే మీ మొబైల్ నుంచి పోర్ట్ అని టైప్ చేసి మీ నంబ‌ర్‌ని ఎంట‌ర్ చేసి 1900 నంబ‌ర్‌కు ఎస్ ఎం ఎస్ చేయాలి. ఇలా చేయ‌డం ద్వారా యునిక్ పోర్టింగ్ కోడ్ జ‌న‌రేట్ అవుతుంది. మీకు ద‌గ్గ‌ర్లోని టెలిఫోన్ ఆప‌రేట‌ర్‌ని కానీ లేదా క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్ సెంట‌ర్‌ని కాని కాంటాక్ట్ చేయాలి. ఆ త‌ర్వాత క‌స్ట‌మ‌ర్ అక్విజేష‌న్ ఫామ్‌ని ఫిల్ చేయాలి.  మీకు సంబంధించిన కేవైసీ డాక్యుమెంట్ల‌ను స‌బ్మిట్ చేయాలి. ఆ త‌ర్వాత మీకో క‌న్ఫ‌ర్మేష‌న్ మెసేజ్ వ‌స్తుంది. 

3 రోజుల్లోనే..
మీరు పోర్టింగ్ ప్రాసెస్ చేసిన త‌ర్వాత కేవ‌లం మూడు రోజుల వ్య‌వ‌ధిలోనే మీ నంబ‌ర్ ఒక నెట్‌వ‌ర్క్ నుంచి ఇంకో నెట్‌వ‌ర్క్‌కి మారిపోతుంది. ఇది మూడు రోజుల నుంచి మాగ్జిమ‌మ్ 5 రోజుల్లోనే మీ నంబ‌ర్ మారిపోతుంది. కార్పొరేట్ మొబైల్ క‌నెక్ష‌న్ల‌కు పోర్టింగ్ టైమ్‌లైన్స్ ఉండ‌వు. జ‌మ్ము క‌శ్మీర్‌, అసోం, నార్త్ ఈస్ట్ స‌ర్వీస్ ఏరియాల్లో ఇదే ప్రాసెస్ అమ‌లు అవుతుంది. అయితే ఇక్క‌డ 15 రోజుల స‌మ‌యం ప‌డుతుంది. నంబ‌ర్ పోర్ట్‌బిలిటీ చేసుకునేవాళ్లు ముందుగా త‌మ నంబ‌ర్ మీద ఉన్న ఔట్ స్టాండింగ్ డ్యూస్‌ని క్లియ‌ర్ చేసుకోవాలి. అంతేకాక ప్ర‌స్తుత సిమ్ యాక్టివేట్ అయిన 90 రోజుల్లోపే పోర్ట్‌బిలిటీ చేసుకోవాలి. 

Trai new guidelines mobile number portability